breaking news
lawrence raghava
-
చంద్రముఖి సీక్వెల్లో అనుష్క! ఇక బొమ్మ దద్దరిల్లాల్సిందే
Anushka Shetty: సౌత్‌లో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాపులారిటీ దక్కించుకున్న అనుష్క నిశ్శబ్దం మూవీ తర్వాత మరే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా మరో సూపర్‌హిట్ చిత్రంతో అలరించేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌కు రెడీ అవుతున్నట్లు సమాచారం. డైరెక్టర్ పి. వాసు దర్శకత్వంలో లారెన్స్-అనుష్క కాంబినేషన్లో సినిమా రూపొందనుందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం అనుష్కని సంప్రదించారని, ఆమె కూడా ఈ చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానుంది. చదవండి : 'త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ'..కానీ సినిమా కోసం కాదు షాకింగ్.. తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన స్టార్ హీరో -
శివలింగలో రితికానే హీరో!
శివలింగ చిత్రంలో తన పాత్ర చంద్రముఖి చిత్రంలోని జ్యోతిక పాత్రకు ధీటుగా ఉంటుందని నటి రితికాసింగ్ పేర్కొన్నారు. కన్నడంలో విజయం సాధించిన శివలింగ చిత్రం అదే పేరుతో తమిళంలో పునర్నిర్మాణం అయిన విషయం తెలిసిందే. కన్నడంలో దర్శకత్వం వహించిన పి.వాసు తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించారు. ఆయనకు జంటగా నటి రితికాసింగ్ నటించగా, ప్రధాన పాత్రల్లో శక్తివేల్‌వాసు, రాధారవి,వడివేలు, వీటీవీ.గణేశ్, జయప్రకాశ్, భానుప్రియ, ఊర్వశి, మధువంతి, సాయిప్రియ నటించారు. సురేశ్మురారి ఛాయాగ్రహణం, ఎస్ఎస్.తమన్ సంగీతాన్ని అందించిన శివలింగ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నటుడు రాఘవ లారెన్స్ మాట్లాడుతూ శివలింగ చిత్రంలో పి.వాసు దర్శకత్వంలో నటించడం మంచి అనుభవం అన్నారు. అయితే విభిన్న హారర్, కామెడీ కథా చిత్రంగా రూపొందిన ఇందులో తాను కథానాయకుడిని కాదని, నటి రితికాసింగ్నే హీరో అని పేర్కొన్నారు. తాను ఎక్కువగా పాటలకే పరిమితం అవుతానని అన్నారు. నటి రితికాసింగ్ మాట్లాడుతూ శివలింగ చిత్రంలో చాలా మంచి పాత్రలో నటించే అవకాశాన్ని దర్శకుడు పి.వాసు కల్పించారని, ఇది చంద్రముఖి చిత్రంలో జ్యోతిక పాత్రకు ధీటుగా ఉంటుందని అన్నారు. ఇందులో ముందుగా రజనీకాంత్‌ను నటింపజేయడానికి దర్శకుడు ప్రయత్నించారు. ఆయన ఇతర చిత్రాలను కమిట్ అవడంతో నటించలేకపోయారనే ప్రచారం జరిగింది.