breaking news
last elections
-
గన్ షాట్ : ఇవే చివరి ఎన్నికలని బాబు ఎందుకన్నారు ..?
-
ఇవే నా చివరి ఎన్నికలు: నితీశ్
పట్నా: ఈ అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని పూర్ణియాలో గురువారం ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేశారు. ‘ఇవే నా చివరి ఎన్నికలు. ఆ తర్వాత మళ్లీ పోటీ చేయను. పదవీ విరమణ చేస్తాను. అంతా బాగున్నప్పుడే మనం తప్పుకోవాలి’అని ఎన్నికల సభలో అనూహ్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. నితీశ్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత సంక్లిష్టమైన ఎన్నికల్ని ఈ సారి ఎదుర్కొంటున్నారు. దీంతో ఓటర్లను ఆకర్షించడానికే చివరి ఎన్నికలంటూ ఒక కొత్త స్టంట్‌కు తెరతీశారని ప్రత్యర్థులు వ్యాఖ్యానించారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయిన యోగి ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ చొరబాటుదారుల సమస్యను పరిష్కరించడానికి ప్రధాని మోదీ సీఏఏని తీసుకువచ్చారంటూ వివాదాన్ని రేపారు. ఈ వ్యాఖ్యలపై నితీశ్ ధ్వజమెత్తారు. ఏమిటీ నాన్సెన్స్ ? ఎవరీ చెత్త మాట్లాడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు. బిహార్‌లో ముస్లిం మైనార్టీలు నితీశ్ పక్షానే ఉన్నారు. యోగి వ్యాఖ్యలతో వారెక్కడ దూరం అవుతారోనన్న భయం ఆయనని వెంటాడుతోంది. బిహార్ అభివృద్ధికి నితీశే ఉండాలి: మోదీ బిహార్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగేందుకు నితీశ్ కుమార్ ప్రభుత్వం అవసరం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్రజలకు ఎన్డీఏయేపై మాత్రమే పూర్తి నమ్మకం ఉందన్నారు. అరాచక వాతావరణాన్ని సృష్టించిన 2005 ముందు నాటి పాలన పరిస్థితుల నుంచి రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తేరుకుంటోందనీ, సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైందని ఆయన అన్నారు. -
అధికార దుర్వినియోగంతోనే గెలుపు
► గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లే పీడీఎఫ్ సాధించింది ► ఇది ప్రజాసంఘాల నైతిక విజయం ► ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ సీతమ్మధార (విశాఖ ఉత్తర) : బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు అధికార దుర్వినియోగంతోనే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోగలిగాయని ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ అన్నారు. ఓటర్ల నమోదుతో మొదలైన ఆ పర్వం ఎన్నికల నిబంధనలను బేఖాతర్ చేయడం, ఓటర్లను ప్రలోభపెట్టడం వరకు కొనసాగిందన్నారు. ఎంఎంటీసీ కాలనీలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన, పీడీఎఫ్ అభ్యర్థి అజశర్మ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ ఎన్నికల రోజు వరకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఓటర్లను ఒత్తిడికి, ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. ఆ తీర్పే నిదర్శనం రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఐదింటిలో బీజేపీ, టీడీపీ నాలుగు స్థానాల్లో ఓటమి పాలయ్యాయన్నారు. రాష్ట్రప్రభుత్వ పనితీరుకు ఈ తీర్పే నిదర్శనమని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని పీడీఎఫ్ అభ్యర్థి అజశర్మ తన ప్రచారంలో ముందుకు తెచ్చారన్నారు. దీనికి విరుద్ధంగా బీజేపీ అభ్యర్థి తరఫు ప్రచారం చేసినవారు మేం అధికారంలో ఉన్నాం, కాబట్టి మేమే గెలవాలన్న ధోరణితో వ్యవహరించారన్నారు. ఉత్తరాంధ్ర సమస్యలపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు సమాధానం చెప్పకపోవడం అన్యాయమన్నారు. అజశర్మకు గత రెండు ఎన్నికల కన్నా అధికశాతం ఓట్లు రావడంతో నైతికంగా ప్రజాసంఘాల విజయంగా పేర్కొన్నారు. ఓటర్ల తీర్పును గౌరవించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ కృషిని కొనసాగిస్తామన్నారు. పెద్దల సభ ఎన్నికలు హుందాగా జరగాలి: అజశర్మ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి, శాసనమండలి పి.డి.ఎఫ్.అభ్యర్థి అజశర్మ మాట్లాడుతూ ఈ ఎన్నికలలో ఓట్లు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ, బీజేపీ అధికార దుర్వినియోగంతో, డబ్బు వెదజల్లి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారన్నారు. హుందాగా ఉండవలసిన పెద్దల సభకు ప్రతినిధిగా ఎన్నిక కావడానికి కుల సంఘాల మీటింగ్‌లు ఏర్పరచడం, అధికార పదవులలో ఉన్న కుల కార్పొరేషన్ల నేతలను ప్రతక్ష్యంగా ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దింపడం దిగజారుడు పద్ధతులకు పాల్పడ్డారని అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తమ బలం 38 వేలకు పెరిగిందన్నారు. గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి కొనసాగిస్తామన్నారు. ఈ ఎన్నికలలో తమకు మద్ధతు ఇచ్చిన వైఎస్సార్ సీపీ, జనసేన పార్టీలకు కృతజ్ణతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో 11 వేల ఓట్లు చెల్లని వైనంపై ప్రశ్నించగా, గత ఎన్నికల్లో 6 వేల ఓట్లు చెల్లలేదన్నారు. కాగా 80 శాతం మంది ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లను వినియోగించలేదని చెప్పారు. -
ఏపి రాజధానిగా హైదరాబాద్‌లో చివరి ఎన్నికలు
-
ఏపి రాజధానిగా హైదరాబాద్‌లో చివరి ఎన్నికలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదారాబాద్‌లో రేపు చివరి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఈ సందర్బంగా గ్రేటర్ హైదరాబాద్‌లో సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖైరతాబాద్‌లో ఓటు వినియోగించుకోనున్నారు. అయితే ఆయన తన పార్టీకి ఓటు వేసే అవకాశం లేదు. పొత్తులో భాగంగా ఖైరతాబాద్ శాసనసభ, సికింద్రాబాద్ లోక్‌సభ రెండు స్థానాలు బిజెపికి కేటాయించారు. అందువల్ల ఆయన తన పార్టీకే ఓటువేయలేని పరిస్థితి. ఇదిలా ఉండగా, నగరంలో 379 పోలింగ్ బూత్‌లను అత్యంత సమస్యాత్మకంగా అధికారులు గుర్తించారు. మరో 304 పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకంగా గుర్తించారు. ఈ ప్రాంతాలలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.