breaking news
Lashkar Chief
-
ఉగ్ర సయీద్ అరెస్ట్
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్దౌలా (జేయూడీ) హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. త్వరలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో హఫీజ్ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్.. ఉగ్రకార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడన్న కేసులో ముందస్తు బెయిల్ పొందేందుకు గుజ్రన్‌వాలా ప్రాంతం నుంచి లాహోర్‌కు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. హఫీజ్‌పై అమెరికా ఇప్పటికే దాదాపు రూ.68 కోట్ల రివార్డు ప్రకటించింది. హఫీజ్‌ను ఉగ్రకార్యకలాపాల వ్యతిరేక కోర్టు ముందు హాజరుపర్చగా ఏడు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత కోట్ లక్పత్ జైలుకు తరలించారు. ఇదే జైలులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జేయూడీకి చెందిన 13 మంది అగ్రనేతలపై పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో జూలై 3న దాదాపు 23 కేసులు నమోదయ్యాయి. ఉగ్రవాది హఫీజ్ సయీద్ అరెస్ట్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. -
రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో జరుగుతున్న ఆందోళనల వెనుక పాకిస్థాన్ ఉగ్రవాది, లష్కర్ చీఫ్ హపీజ్ సయీద్ హస్తం ఉందని ఆయన అన్నారు. సయీద్ మద్దతుతోనే భారత జాతి వ్యతిరేక కార్యక్రమాలు యూనివర్సిటీలో చేస్తున్నారని, వాటిని తామెంత మాత్రము ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురుకు అనుకూలంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఒక ప్రత్యేక దినం నిర్వహించడం, అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేయడం వంటి వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఈ చర్యలకు పాల్పడిన విద్యార్థినాయకులను అరెస్టు చేయడంతోపాటు జేఎన్ యూలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా కలత చెందిన మాజీ సైనికులు, తదితరులు (పూర్వ విద్యార్థులు) తమ సర్టిఫికెట్లను వెనక్కి ఇస్తామని బెదిరించడంవంటి పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధానికి దిగగా.. మరోవైపు విద్యార్థులపై పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ జేఎన్‌యూలో ఆందోళనలు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ 'జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏం జరిగిందో దాని వెనుక లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ మద్దతు ఉంది. నేను అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడైతే భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు పెల్లుబుకుతాయో వాటిపై మాట్లాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ విషయంలో దోషులను కఠినంగా శిక్షిస్తాం. నిర్దోషులకు ఎలాంటి హానీ జరగదు' అని రాజ్ నాథ్ అన్నారు.