breaking news
kundan pahan
-
‘సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే.. ఉరి తీయాల్సిందే’
రాంచీ: ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు కమాండర్ కుందన్ పహన్ విషయంలో సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనంటూ నిరాహార దీక్షకు దిగిన ఆల్ జార్కండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్యూ) ఎమ్మెల్యే వికాస్ ముండా ఎట్టకేలకు తన దీక్షను విరమించారు. జార్ఖండ్ హోంశాఖ కార్యదర్శి ఎస్కేజీ రహతే, అదనపు డీఐజీ ఆర్కే మాలిక్ మధ్యవర్తిత్వం ఫలించడంతో వెనక్కి తగ్గారు. ఆయన చేసిన డిమాండ్లను పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో చివరకు దీక్షను విరమించారు. కుందన్ పహన్ లొంగిపోయి స్వేచ్ఛగా తిరగడాన్ని సవాల్ చేస్తూ అతడి విషయంలో సీబీఐ దర్యాప్తు జరగాలని, పలు తప్పిదాలకు పాల్పడిన కుందన్ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ వికాస్ ముండా ఆదివారం నుంచి ఆమరణ నిరహార దీక్షకు దిగారు. -
మావోయిస్టు కీలకనేత లొంగుబాటు
రాంచీ: మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లో కరుడుగట్టిన మావోయిస్టు కీలకనేత నేత పోలీసులకు లొంగిపోయాడు. జార్ఖండ్ రీజినల్ కమిటీ కార్యదర్శి, కుందన్ పహాన్ పలు సీనియర్ పోలీసు అధికారుల హత్యలతోపాటు 128 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతని తలపై రూ.15 లక్షల రివార్డు కూడా ఉంది. 2008లో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫ్రాన్సిస్ ఇంద్రవర్ను హత్య చేయడంతోపాటు, 2008లో ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన నగదు వాహనం నుంచి రూ. 5 కోట్లు లూటీ చేసిన కేసులోనూ నిందితుడు. 2008లో బలిబా దాడిలో డీఎస్పీ ప్రమోద్కుమార్ను హత్య చేశాడని రాంచీ సీనియర్ ఎస్పీ(ఎస్ఎస్పీ) కుల్దీప్ దివేది తెలిపారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఆర్.కె.మాలిక్, సీఆర్పీఎఫ్ ఐజీ సంజయ్ లత్కర్, డీఐజీ ఎ.వి.హాంకర్, సీనియర్ పోలీసుల ఎదుట అతను లొంగిపోయాడు. జన జీవన స్రవంతిలో కలిసేందుకు ప్రయత్నించిన కుందన్ పహాన్కు పలువురు పోలీసు అధికారులు అభినందనలు తెలిపారు.