breaking news
KNEE replacement
-
మేడ్ ఇన్ ఇండియా రోబోట్.. మోకాలి మార్పిడి ఇక మరింత సులభం
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ప్రతి రంగంలోనూ కొత్త ఉత్పత్తులు లేదా అప్డేటెడ్ ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇండియన్ గ్లోబల్ మెడికల్ డివైజ్ కంపెనీ 'మెరిల్' అడ్వాన్స్డ్ సర్జికల్ రోబోటిక్ టెక్నాలజీ 'మిస్సో' (MISSO)ను లాంచ్ చేసింది.కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ రోబోటిక్ సిస్టం (రోబోట్) పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. దీని ద్వారా మోకాలి మార్పిడికి (Knee Replacement) సంబంధించిన సర్జరీలు మరింత విజయవంతంగా నిర్వహించబడతాయి.ఇప్పటి వరకు భారతదేశంలోని చాలా హాస్పిటల్స్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఎక్కువ డబ్బును వెచ్చించి.. విదేశీ రోబోటిక్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నాయి. అయితే మిస్సో తమ కొత్త రోబోట్ 66 శాతం తక్కువ ధరకు అందించడానికి సిద్ధమైంది. ఇది ఇతర రోబోటిక్ టెక్నాలజీలకు ఏ మాత్రం తీసిపోకుండా చాలా అద్భుతంగా పనిచేస్తుంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోబోటిక్ టెక్నాలజీలు కొంత పెద్ద ఆసుపత్రులకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. కానీ MISSO అనేది చిన్న ఆసుపత్రులకు, టైర్ 2, టైర్ 3 నగరాల్లోని ఆసుపత్రులకు అందుబాటులోకి తీసుకురాగల మొట్టమొదటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ రోబోట్.భారతదేశంలో 40 ఏళ్లు పైబడిన 10 మందిలో ముగ్గురు కీళ్ల అరుగుదలతో బాధపడుతున్నారు. దీనికి 'టోటల్ క్నీ రీప్లేస్మెంట్' (TKR) విధానం ద్వారా.. దెబ్బతిన్న లేదా అరిగిపోయిన మోకాలి కీలును మెటల్, అల్ట్రా-హై మాలిక్యులర్ వెయిట్ పాలిథిలిన్‌తో చేసిన కృత్రిమ కీలుతో భర్తీ చేస్తారు. దీనికి సర్జరీ అవసరం. సర్జరీ తరువాత ఎక్కువ నొప్పిని భరించాల్సి ఉంటుందని చాలా మంది భయపడతారు. కానీ సాధారణ సర్జరీతో పోలిస్తే.. రోబోటిక్ సర్జరీ కొంత ఉత్తమమని, దీని ద్వారా సర్జరీ జరిగితే నొప్పి కూడా కొంత తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.కీళ్ల అరుగుదల అనేది భారతదేశంలో 22 నుంచి 39 శాతం జనాభాలో ఉన్నట్లు సమాచారం. మనదేశంలో ఏడాదికి 5.5 లక్షల మంది మోకాలి మార్పిడికి గురవుతున్నారు. ఐదు సంవత్సరాల క్రితంతో పోలిస్తే.. ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కొన్ని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న సర్జరీలలో మోకాలి మార్పిడికి సంబంధించిన సర్జరీలు 7 నుంచి 8 రెట్లు ఎక్కువని తెలుస్తోంది.లేటెస్ట్ మిస్సో రోబోట్ లాంచ్ కార్యక్రమంలో మెరిల్లో మార్కెటింగ్ హెడ్, ఇండియా & గ్లోబల్ 'మనీష్ దేశ్‌ముఖ్', సన్‌షైన్ బోన్ చైర్మన్, చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్‌లో జాయింట్ ఇన్స్టిట్యూట్ & మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ 'డాక్టర్ ఏ.వీ గురవ రెడ్డి' పాల్గొన్నారు. ఈ కొత్త రోబోట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. -
ఏ వయసులో మోకాళ్ళ సర్జరీ చేసుకుంటే త్వరగా కోలుకుంటారు ..!
-
మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లకు బ్రేక్
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో 20 రోజులుగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు జరగటం లేదు. ఆపరేషన్ థియేటర్ కొరత వల్ల ఈ ఆపరేషన్లు నిలిపివేసినట్లు వైద్యులు చెబుతున్నారు. సుమారు 500 మంది రోగులు ఆపరేషన్ల కోసం పేర్లు నమోదు చేయించుకుని సిద్ధంగా ఉన్నారు. కొంత మంది కీళ్ల బాధితులు తమ పేర్లు నమోదు చేయించుకుని ఆరు నెలలు గడిచినా తమకు ఆపరేషన్ చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. రెండేళ్లుగా ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్స్ సమస్య ఉన్నా ఆస్పత్రి అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిడ్నీ, మోకీళ్ల మార్పిడికి ఒకటే థియేటర్! డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో నాలుగు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. సుమారు రూ.3 కోట్లతో నిర్మించిన ఈ థియేటర్స్‌లో రెండు ఆపరేషన్ థియేటర్స్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. ఒక ఆపరేషన్ థియేటర్లో న్యూరోసర్జరీ ఆపరేషన్లు చేస్తున్నారు. ఒక ఆపరేషన్ థియేటర్లో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు, కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నారు. ఒకే ఆపరేషన్ థియేటర్లో కిడ్నీ, మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయటంతో ఇన్ఫెక్షన్లు వస్తాయని కిడ్నీ ఆపరేషన్లు లేదా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు నిలిపివేస్తున్నారు. ఇలా 20 రోజులుగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు నిలిపివేయటంతో కీళ్ల నొప్పుల బాధితులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ నిధులు కోసం ఎదురుచూపులు... ప్రభుత్వం ఆపరేషన్లు చేసేందుకు జీజీహెచ్‌కు అదనంగా నిధులు మంజూరు చేయలేదు. దీంతో వైద్యులు ఆపరేషన్ల కోసం పేర్లు నమోదు ప్రక్రియ కూడా నిలిపివేశారు. రాష్ట్రంలో ఉచితంగా గుంటూరు జీజీహెచ్‌లో మాత్రమే మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన రోగులు సైతం గుంటూరుకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వం గుంటూరుతోపాటుగా కర్నూలు, విశాఖపట్నం ప్రభుత్వ ఆస్పత్రులకు 2017 మే నెలలో నిధులు విడుదల చేసింది. కాని నేటి వరకు ఆ రెండు ఆస్పత్రుల్లో ఆపరేషన్లు ప్రారంభం కాలేదు. వారికి కేటాయించిన నిధులను గుంటూరుకు జీజీహెచ్‌కు ప్రభుత్వం బదిలీ చేయటం ద్వారా పేద రోగులకు ఇబ్బంది లేకుండా గుంటూరు వైద్యులు ఆపరేషన్లు చేసే అవకాశం ఉంటుంది. సాక్షి కథనంతో ఆపరేషన్లు ప్రారంభం... జీజీహెచ్‌లో 2015 ఆగస్టులో ఎలుకల దాడిలో పసికందు మరణంతో ఆస్పత్రి ప్రతిష్ట మసకబారింది. ఆస్పత్రిపై పేదలకు నమ్మకం కల్పించేందుకు మాజీమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గుంటూరు జీజీహెచ్‌లో 2016 జనవరి 23న మోకీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. కేవలం ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగిందన్న పేరు తప్ప వైద్యులు, వైద్యపరికరాలన్ని ప్రైవేటు వైద్యులు సహకారంతో సమకూరాయి. దీనిపై ‘సాక్షి’ విమర్శనాత్మకంగా కథనాలు ప్రచురించడంతో ‘ తనకు జరిగిన ఆపరేషన్, కార్పొరేట్ వైద్యాన్ని ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు కూడా ఉచితంగా అందేలా చేస్తాను’ అంటూ డాక్టర్ కామినేని వాగ్దానం చేశారు. చాలా మంది పేద రోగులు ఆసుపత్రికి ఆపరేషన్ల కోసం క్యూ కడుతున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటంతో సాక్షి వరుస కథనాలు ప్రచురితం చేయటంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి 2017 మే నెలలో రూ.65 లక్షల నిధులను విడుదల చేసింది. ప్రభుత్వ నిధులతో 26–7–2017 నుంచి సర్జరీలను నిర్వహిస్తున్నారు. ఉన్నతి ఫౌండేషన్‌తో ఉచితంగా ఆపరేషన్లు.... గుంటూరు బీఎంఆర్ మల్టీస్పెషాలిటీ హాస్పటల్స్ అధినేత, ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి జీజీహెచ్‌కు వచ్చే పేద రోగులకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారు. ఆపరేషన్లు చేయడంతోపాటుగా సుమారు రూ.20 లక్షల ఖరీదు చేసే ఇంప్లాంట్లను సైతం జీజీహెచ్‌కు విరాళంగా ఇచ్చి 20 మందికి తన సొంత ఖర్చుతో ఆపరేషన్లు చేశారు. బీఎంఆర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు చెందిన ఉన్నతి ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారు. దాత వచ్చి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నా ప్రభుత్వం నిధులను మంజూరు చేయకుండా, ఆస్పత్రి అధికారులు ఆపరేషన్ థియేటర్ నిర్మాణం చేయకుండా జాప్యం చేస్తూ రోగులు ఇబ్బంది పడేలా చేయటం విమర్శలకు తావునిస్తుంది. కిడ్నీ ఆపరేషన్ల వల్ల నిలిపివేశాం గత 20 రోజులుగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తూ ఉండటంతో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు నిలిపివేశాం. ఆస్పత్రిలో విజయవంతంగా 74 మందికి ఆపరేషన్లు చేశాం. మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ నిర్మాణం చేసేందుకు నాట్కో ఫార్మా కంపెనీ వారు ముందుకొచ్చారు. ఆపరేషన్ థియేటర్ నిర్మాణం జరిగితే నిరంతరంగా ఆపరేషన్లు చేస్తాం. మోకీళ్లనొప్పుల బాధితులు 500 మంది తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఆస్పత్రిలో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు బుధవారం, శనివారం చేస్తున్నాం. ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనంగా బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశాం.– డాక్టర్ గంటా వరప్రసాద్,ఆర్థోపెడిక్ వైద్య విభాగాధిపతి -
కీలుకు మేలు ఫలితాలు!
ఫలితాలు! టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో నూటికి నూరుశాతం సత్ఫలితాలుంటాయని నిపుణులు తెలియచేస్తున్నారు. సాధారణంగా ఈ సర్జరీ యాభై ఏళ్ల నుంచి ఎనభై ఏళ్ల వయసు వరకు చేస్తుంటారు. అయితే ఈ ఆపరేషన్ ఏ వయసులో చేయవచ్చనే దానికి కూడా ఇదమిత్థంగా నిబంధనలేమీ లేవు. పేషెంటులో ఎముక క్షీణత, కీలు అరుగుదలను బట్టి ఏ వయసు వారికైనా చేయవచ్చు. రోగిని పరీక్షించిన ఆర్థోపెడిక్ సర్జన్ అవసరాన్ని సూచిస్తారు. జువైనల్ ఆర్థరైటిస్ కారణంగా టీనేజ్‌లో కూడా ఈ అవసరం ఏర్పడవచ్చు. మోకాలి నిర్మాణం ఇలా! దేహంలో ఉంటే కీళ్లన్నింటిలో మోకాలి కీలు చాలా పెద్దది, సంక్లిష్టమైన నిర్మాణం కూడ. తొడ ఎముక కింది భాగానికి, పిక్క ఎముక పై భాగానికి మధ్య పటెల్లా (మోకాలి చిప్ప)తో కప్పి ఉంటుంది మోకాలి నిర్మాణం. పటెల్లా కింద ఈ మూడు ఎముకల మధ్య కార్టిలేజ్ ఉంటుంది. కీలును కదిలించినప్పుడు ఎముకల చివర్లు ఒకదానితో మరొకటి ఒరుసుకు పోకుండా కందెనలా ఉంటుంది ఈ కార్టిలేజ్. కీళ్ల నిర్మాణంలో రెండు ఎముకలను కలిపి ఉంచే లిగమెంట్ చాలా ముఖ్యమైనది. తొడ- పిక్క ఎముకలను పట్టి ఉంచే ఈ లిగమెంట్ దేహంలోని లిగమెంట్లన్నింటిలోకి పెద్దది. ఈ వ్యవస్థ మొత్తాన్ని సినోవియల్ మెంట్రేన్ చుట్టి ఉంటుంది. ఇది మోకాలు సులువుగా కదలడానికి అవసరమైన ద్రవాలను విడుదల చేస్తుంది. ఇవన్నీ ఐకమత్యంగా పని చేస్తున్నంత కాలం మోకాలి కీలుకు సమస్యలు ఉండవు. గాయాలు, వార్ధక్యం, కొన్ని ఇతర కారణాల వల్ల మోకాలి భాగాల పని తీరులో ఐకమత్యం లోపిస్తుంది. అప్పుడే వాపు, నొప్పి, కీళ్లు కదిలించలేకపోవడం... వంటి సమస్యలు తలెత్తుతాయి. • రెండేళ్ల మనుమడు ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాడు. • కుర్చీ పట్టుకుని లేచి నిలుచున్నాడు... మనవడిని మురిపెంగా చూస్తోంది రాజ్యలక్ష్మి. • అది ఫైబర్ కుర్చీ... కదిలిపోయింది. పిల్లాడికి పట్టు తప్పుతోంది. • కంగారుగా లేవబోయిందామె. అంతే... మోకాలి కీళ్లు పటపటమంటూ శబ్దం చేశాయి. కళ్లవెంట నీళ్లు పడేటంతటి బాధను అదిమిపట్టి అడుగు ముందుకు వేసేలోపే పిల్లాడు కిందపడిపోయాడు. అయ్యో! అంటూ పిల్లాడిని చేతుల్లోకి తీసుకుని సముదాయిస్తోంది. • ఈ మోకాళ్ల నొప్పులు లేకపోతే చక్కగా మనవడి ఆలనపాలన చూసుకునేది కదా అని బాధపడుతోందామె. • యాభై ఏళ్లు దాటిన వారిలో ఇది సర్వసాధారణమైన సమస్య. మోకాలి నొప్పి మొదట్లో మందులతో తగ్గుతుంటుంది. క్రమంగా అది మందులకు మాట వినని స్థితికి చేరుతుంది. అప్పుడిక ప్రత్యామ్నాయం నీ రీప్లేస్మెంట్ సర్జరీ మాత్రమే అంటారు నిపుణులు. అత్యంత క్లిష్టమైన బాధ ఈ చికిత్సతో మటుమాయం అవుతోంది. మరుసటి రోజే నడవవచ్చు! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. సర్జరీ చేసిన మరసటి రోజు నుం నడవవచ్చు. హాస్పిటల్ నుంచి డిశ్చార్ చేయకముందే బెడ్ మీద నుంచి లేచి బాత్రూముకి వెళ్లడం, పనులు సొంతంగా చేసుకోవచ్చు. అలాగే ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత మరే ఇతర సమస్యలు రావని వైద్యులు చెప్తున్నారు. అయితే నీ రీప్లేస్మెంట్సర్జరీ ఒక్కటే కాదు, ఏ ఇతర సర్జరీ చేసుకున్నప్పుడైనా తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలు... అంటే వ్యక్తిగత పరిశుభ్రత, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు ఇక్కడ కూడా పాటించాల్సిందే. ఇందులో ప్రత్యేకంగా బ్లడ్‌క్లాట్ ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. కార్టిలేజ్‌లో గడ్డకట్టిన రక్తనాళాల ద్వారా ఊపిరితిత్తులకు చేరి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంటుంది. అందుకోసం ముందుగానే రక్తం పలుచబడడానికి మందులిస్తారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో, నాణ్యమైన వైద్యసేవలు, పరికరాలు ఉన్న వైద్యశాలలో ఈ సర్జరీని విజయవంతంగా చేయడం సాధ్యమే. టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో నూటికి నూరుశాతం సత్ఫలితాలుంటాయని నిపుణులు తెలియచేస్తున్నారు. సాధారణంగా ఈ సర్జరీ యాభై ఏళ్ల నుంచి ఎనభై ఏళ్ల వయసు వరకు చేస్తుంటారు. అయితే ఈ ఆపరేషన్ ఏ వయసులో చేయవచ్చనే దానికి కూడా ఇదమిత్థంగా నిబంధనలేమీ లేవు. పేషెంటులో ఎముక క్షీణత, కీలు అరుగుదలను బట్టి ఏ వయసు వారికైనా చేయవచ్చు. రోగిని పరీక్షించిన ఆర్థోపెడిక్ సర్జన్ అవసరాన్ని సూచిస్తారు. జువైనల్ ఆర్థరైటిస్ కారణంగా టీనేజ్‌లో కూడా ఈ అవసరం ఏర్పడవచ్చు. మోకాలి నిర్మాణం ఇలా! దేహంలో ఉంటే కీళ్లన్నింటిలో మోకాలి కీలు చాలా పెద్దది, సంక్లిష్టమైన నిర్మాణం కూడ. తొడ ఎముక కింది భాగానికి, పిక్క ఎముక పై భాగానికి మధ్య పటెల్లా (మోకాలి చిప్ప)తో కప్పి ఉంటుంది మోకాలి నిర్మాణం. పటెల్లా కింద ఈ మూడు ఎముకల మధ్య కార్టిలేజ్ ఉంటుంది. కీలును కదిలించినప్పుడు ఎముకల చివర్లు ఒకదానితో మరొకటి ఒరుసుకు పోకుండా కందెనలా ఉంటుంది ఈ కార్టిలేజ్. కీళ్ల నిర్మాణంలో రెండు ఎముకలను కలిపి ఉంచే లిగమెంట్ చాలా ముఖ్యమైనది. తొడ- పిక్క ఎముకలను పట్టి ఉంచే ఈ లిగమెంట్ దేహంలోని లిగమెంట్లన్నింటిలోకి పెద్దది. ఈ వ్యవస్థ మొత్తాన్ని సినోవియల్ మెంట్రేన్ చుట్టి ఉంటుంది. ఇది మోకాలు సులువుగా కదలడానికి అవసరమైన ద్రవాలను విడుదల చేస్తుంది. ఇవన్నీ ఐకమత్యంగా పని చేస్తున్నంత కాలం మోకాలి కీలుకు సమస్యలు ఉండవు. గాయాలు, వార్ధక్యం, కొన్ని ఇతర కారణాల వల్ల మోకాలి భాగాల పని తీరులో ఐకమత్యం లోపిస్తుంది. అప్పుడే వాపు, నొప్పి, కీళ్లు కదిలించలేకపోవడం... వంటి సమస్యలు తలెత్తుతాయి. • రెండేళ్ల మనుమడు ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాడు. • కుర్చీ పట్టుకుని లేచి నిలుచున్నాడు... మనవడిని మురిపెంగా చూస్తోంది రాజ్యలక్ష్మి. • అది ఫైబర్ కుర్చీ... కదిలిపోయింది. పిల్లాడికి పట్టు తప్పుతోంది. • కంగారుగా లేవబోయిందామె. అంతే... మోకాలి కీళ్లు పటపటమంటూ శబ్దం చేశాయి. కళ్లవెంట నీళ్లు పడేటంతటి బాధను అదిమిపట్టి అడుగు ముందుకు వేసేలోపే పిల్లాడు కిందపడిపోయాడు. అయ్యో! అంటూ పిల్లాడిని చేతుల్లోకి తీసుకుని సముదాయిస్తోంది. • ఈ మోకాళ్ల నొప్పులు లేకపోతే చక్కగా మనవడి ఆలనపాలన చూసుకునేది కదా అని బాధపడుతోందామె. • యాభై ఏళ్లు దాటిన వారిలో ఇది సర్వసాధారణమైన సమస్య. మోకాలి నొప్పి మొదట్లో మందులతో తగ్గుతుంటుంది. క్రమంగా అది మందులకు మాట వినని స్థితికి చేరుతుంది. అప్పుడిక ప్రత్యామ్నాయం నీ రీప్లేస్మెంట్ సర్జరీ మాత్రమే అంటారు నిపుణులు. అత్యంత క్లిష్టమైన బాధ ఈ చికిత్సతో మటుమాయం అవుతోంది. మరుసటి రోజే నడవవచ్చు! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. సర్జరీ చేసిన మరసటి రోజు నుం నడవవచ్చు. హాస్పిటల్ నుంచి డిశ్చార్ చేయకముందే బెడ్ మీద నుంచి లేచి బాత్రూముకి వెళ్లడం, పనులు సొంతంగా చేసుకోవచ్చు. అలాగే ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత మరే ఇతర సమస్యలు రావని వైద్యులు చెప్తున్నారు. అయితే నీ రీప్లేస్మెంట్సర్జరీ ఒక్కటే కాదు, ఏ ఇతర సర్జరీ చేసుకున్నప్పుడైనా తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలు... అంటే వ్యక్తిగత పరిశుభ్రత, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు ఇక్కడ కూడా పాటించాల్సిందే. ఇందులో ప్రత్యేకంగా బ్లడ్‌క్లాట్ ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. కార్టిలేజ్‌లో గడ్డకట్టిన రక్తనాళాల ద్వారా ఊపిరితిత్తులకు చేరి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంటుంది. అందుకోసం ముందుగానే రక్తం పలుచబడడానికి మందులిస్తారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో, నాణ్యమైన వైద్యసేవలు, పరికరాలు ఉన్న వైద్యశాలలో ఈ సర్జరీని విజయవంతంగా చేయడం సాధ్యమే. సర్జరీకి దారి తీసే కారణాలు మోకాలి సమస్యల్లో ఎక్కువగా కనిపించేది ఆర్థరైటిస్. మోకాలిని కదిలించాలంటే భయపడేటంత నొప్పి ఉంటుంది. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అని మూడు రకాలుంటాయి. 1. ఆస్టియో ఆర్థరైటిస్ కార్టిలేజ్ పటుత్వం లోపించడం వంటి మార్పులు వయసు పై బడిన వారిలో వస్తుంటాయి. ఎముకల మధ్య కుషన్ తగ్గిపోవడంతో ఎముకలు ఒరిపిడి లోనయి నొప్పి, కీళ్లు బిగుసుకు పోవడం కనిపిస్తుంటాయి. ఈ సమస్య సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంటుంది. ముప్పై ఏళ్లలో కూడా కనిపిస్తుంటుంది. కానీ ఇది చాలా తక్కువ శాతం. 2. రుమటాయిడ్ ఆర్థరైటిస్: ఇది ఒక వ్యాధి. సినోవియల్ మెంబ్రేన్ స్రావాల విడుదల తగ్గడం, పలుచగా ఉండాల్సిన ద్రవం చిక్కబడడం వంటి మార్పులు సంభవిస్తాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే కార్టిలేజ్ కార్టిలేజ్ క్షయానికి గురయ్యి కీళ్లలో నొప్పి, వాపు వస్తాయి. కీళ్లలో వాపుకు సంబంధించిన అనేక సమస్యలలో ఎక్కువగా కనిపించేది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్. 3. పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్: ఇది ప్రమాదవశాత్తూ గాయాలపాలయినప్పుడు మోకాలి ఎముకలు చిట్లడం, విరగడం, మోకాలి కీలులోని లిగమెంట్ వంటి భాగాలు చీరుకు పోవడం వంటివి సంభవిస్తుంటాయి. అలాంటప్పుడు కూడా వాపు, నొప్పితోపాటు కీలు కదలించడం కష్టమవుతుంది. చికిత్స: ఎముకను ప్రిపేర్ చేయడం: కార్టిలేజ్‌లో డ్యామేజ్ అయిన భాగాన్ని, ఫెముర్ బోన్, టిబియా బోన్ల చివర్ల పొరలను తొలగిస్తారు మెటల్ ఇంప్లాంట్స్ అమరిక: తొలగించిన కార్టిలేజ్, ఎముక చివర్ల పరిమాణానికి తగినట్లు, మోకాలి కీలులో సరైన కొలతలతో లోహపు కీలును తయారు చేసి అమర్చడం రీసర్ఫేస్: మోకాలి చిప్ప లోపలి పొరను సరిచేసి ప్లాస్టిక్ బటన్ అమర్చడం. ఇది కొన్ని నీ రీప్లేస్మెంట్ సర్జరీలకు మాత్రమే అవసరం ఇన్సర్ట్ ఎ స్పేసర్: ఇది లోహపు భాగాల మధ్య కదలికను సులువు చేస్తుంది. • టోటల్ నీ రీప్లేస్మెంట్ చాలా అరుదుగా చేస్తారు. మోకాలు పూర్తిగా వంగిపోవడం, దేహం బరువును మోయలేక మోకాలి వంపుతోపాటు కాళ్లు విల్లుగా వంగడం వంటి పరిస్థితుల్లో టోటల్ నీ రీప్లేస్మెంట్ అవసరమవుతుంది. అలాగే... • భరించలేని మోకాలి నొప్పి, కీళ్లు బిగుసుకుపోవడంతో నడవడం, మెట్లెక్కడం, కుర్చీలో నుంచి ఉన్న ఫళాన లేవలేకపోవడం, రోజువారి పనులు చేసుకోలేనప్పుడు కర్ర లేదా వాకర్ సాయం తీసుకోక తప్పని పరిస్థితుల్లో పడుకుని లేచేటప్పుడు కీళ్లు బిగుసుకుపోయి మంచం మీద లేవడానికి ప్రయాసపడడం మందులతో చెప్పుకోదగినంత ఉపశమనం పొందలేనప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, కార్టిజోన్ ఇంజెక్షన్లు, లూబ్రికేషన్ పెంచే ఇంజక్షన్లు, ఫిజికల్ థెరపీ, ఇతర ఆపరేషన్లతో సాంత్వన దక్కనప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం అవుతుంది. ముందస్తు పరీక్షలు! ఆర్థోపెడిక్ సర్జన్ కింది అంశాలను నిర్ధారించుకున్న తర్వాత నీ రీప్లేస్మెంట్ సర్జరీకి అనుమతిస్తారు. మెడికల్ హిస్టరీ: పేషెంట్ సాధారణ ఆరోగ్యపరిస్థితిని తెలుసుకోవడం... అంటే బీపీ, డయాబెటిస్, గుండె వ్యాధులు, మరేదైనా ఇతర వ్యాధులకు మందులు వాడుతుండడం వంటివి ఫిజికల్ఎగ్జామినేషన్: దీని ద్వారా మోకాలి కదలికను, పటుత్వాన్ని, ఎముక గట్టిదనాన్ని, మొత్తంగా కాలి పరిస్థితిని అంచనా వేస్తారు ఎక్స్-రే: ఈ పరీక్ష ద్వారా ఎముక క్షీణత, కార్టిలేజ్ డ్యామేజ్, ఇతర డిఫార్మిటీలు తెలుస్తాయి. వీటితోపాటు బ్లడ్ టెస్ట్, ఎమ్ఆర్ఐ స్కాన్ ద్వారా మోకాలి ఎముకను ఆనుకుని ఉండే మెత్తటి టిస్యూల స్థితి తెలుస్తుంది.