breaking news
Khelo India Competitions
-
‘మీ పతకాలు వెనక్కి ఇచ్చేయండి’
న్యూఢిల్లీ: డోపింగ్‌లో విఫలమైన రెజ్లర్లు ‘ఖేలో ఇండియా’ క్రీడల్లో సాధించిన పతకాలతో పాటు ధ్రువపత్రాలను వెనక్కి ఇచ్చేయాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఆదేశించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఈ విధంగా చేస్తున్నట్లు డబ్ల్యూఎఫ్ఐ సహాయక కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు. గత నాలుగు సీజన్ల ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌తో పాటు స్కూల్ యూత్, యూనివర్సిటీ క్రీడల్లో పతకాలు సాధించిన 12 మంది రెజ్లర్లు డోపింగ్‌లో విఫలమయ్యారు. ఇందులో ఆరుగురు ఫ్రీస్టయిల్ రెజ్లర్లు కాగా, మరో ఆరుగురు గ్రోకో రోమన్ విభాగానికి చెందినవారు. వీరి నుంచి పతకాలను వెనక్కి తీసుకోవడంలో అనుబంధ రాష్ట్ర సంఘాలు సహాయం చేయాలని డబ్ల్యూఎఫ్ఐ కోరింది. డోపింగ్ పరీక్షలో విఫలమైన రెజ్లర్లలో రోహిత్ దహియా (54 కేజీలు), అభిమన్యు (58 కేజీలు), వికాస్ కుమార్ (65 కేజీలు), విశాల్ (97 కేజీలు), వివేక్ భరత్ (86 కేజీలు), జస్దీప్ సింగ్ (25 కేజీలు), మనోజ్ (55 కేజీలు), కపిల్ పల్‌స్వల్ (92 కేజీలు), జగదీశ్ రోకడే (42 కేజీలు), రోహిత్ అహిరే (72 కేజీలు), విరాజ్ రన్వాడే (77 కేజీలు), రాహుల్ కుమార్ (63 కేజీలు) ఉన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లాక్రీడాకారులు
నేటి నుంచి ఖేలో ఇండియా పోటీలు సిరిసిల్ల : జిల్లా క్రీడాకారులు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో సోమ, మంగళవారాల్లో జరిగే రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా పోటీల్లో వారు పాల్గొంటారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాకారులు వివిధ జిల్లాల జట్లతో పోటీ పడనున్నారు.వీరికి ఆదివారం స్పోర్ట్స్ డ్రెస్‌లను వ్యాయామ ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు గొట్టె అంజయ్య, రాందాస్, మౌనిక, శిరీష, వీరస్వామి, టీఆర్ఎస్వీ నాయకులు గజ్జెల దేవరాజు తదితరులు పాల్గొన్నారు.