breaking news
Khatri
-
హిందుస్తాన్ షిప్‌యార్డ్ రికార్డ్
విశాఖపట్టణం: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ షిప్‌యార్డ్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 755 కోట్ల విలువైన ఉత్పత్తిని సాధించింది. కోవిడ్–19 రెండు, మూడు దశలు, పాక్షిక లాక్డౌన్లు, ఆంక్షలు తదితర వివిధ సవాళ్లలోనూ ప్రోత్సాహక పనితీరును చూపగలిగినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ హేమంత్ ఖత్రి పేర్కొన్నారు. కంపెనీకి గల మూడు విభాగాలూ ఇందుకు సహకరించినట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మరింత అధికంగా రూ. 1,000 కోట్ల విలువైన ఉత్పాదకతను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. నౌకా నిర్మాణ విభాగం నుంచి రూ. 613 కోట్ల విలువైన ప్రొడక్షన్ సాధించడం ద్వారా కొత్త రికార్డ్‌కు తెరతీసినట్లు పేర్కొన్నారు. గతేడాది రూ. 50.78 కోట్ల నికర లాభం ఆర్జించగా.. రూ. 10.69 కోట్ల నిర్వహణ లాభాన్ని సాధించినట్లు తెలియజేశారు. అయితే అంతక్రితం ఏడాది(2020–21) రూ. 14 కోట్ల నికర నష్టంతోపాటు.. రూ. 73 కోట్లమేర నిర్వహణ నష్టాలు నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
అమిత్ ఖత్రీకి రజతం
నైరోబి: భారత అథ్లెట్ అమిత్ ఖత్రీ సుదీర్ఘ పరుగులో సత్తా చాటుకున్నాడు. ప్రపంచ జూనియర్ (అండర్–20) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 10,000 మీ. పరుగులో అతను రజత పతకం సాధించాడు. మహిళల 400 మీ. పరుగులో ప్రియా మోహన్ తృటిలో కాంస్యం గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. రోహ్టక్కు చెందిన 17 ఏళ్ల టీనేజ్ అథ్లెట్ అమిత్ ఖత్రీ ఓ రకంగా అద్భుతమే చేశాడు. సాధారణంగా ఆఫ్రికా అథ్లెట్లకు మాత్రమే సాధ్యమయ్యే సుదీర్ఘ పరుగులో భారత అథ్లెట్ పతకం గెలవడం విశేషం. శనివారం జరిగిన పురుషుల పదివేల మీటర్ల రేస్‌వాక్‌లో అతను పోటీని 42 నిమిషాల 17.94 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన హెరిస్టోన్ వాన్యోని 42 ని.10.84 సెకన్ల టైమింగ్‌తో బంగారు పతకం సాధించగా, స్పెయిన్ అథ్లెట్ పాల్ మెక్‌గ్రాత్ (42ని.26.11 సె.) కాంస్యం గెలుపొందాడు. నిజానికి ఖత్రీ స్వర్ణం గెలిచే అవకాశాలు చివరి వరకు కనిపించాయి. వేగంగా దూసుకెళ్లిన అతను 8 ల్యాపులు ముగిసే సరికి అందరికంటే ముందున్నాడు. దాదాపు 9000 మీటర్ల దాకా ఇదే వేగం నమోదు చేయగా... స్థానిక అథ్లెట్ వాన్యోని అనూహ్యంగా ఆఖరి ల్యాపులో అమిత్ ఖత్రీని అధిగమించి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. కెన్యా రాజధాని నైరోబి సముద్ర మట్టానికి 1800 మీ. ఎత్తులో ఉంటుంది. ఇది భారతీయులకు ప్రతికూల ప్రదేశం. ఇలాంటి చోట భారత అథ్లెట్ సుదీర్ఘ పరుగులో స్వర్ణానికి చేరువగా వెళ్లడం ఆషామాషీ విషయం కాదు. పరుగు ముగిసిన అనంతరం ఖత్రీ మాట్లాడుతూ ‘నేను ఆశించిన ఫలితం కాదిది. అయినా సరే రజతంతో తృప్తిగా ఉన్నాను. ఐదు రోజుల ముందు ఇక్కడికొచ్చిన నన్ను ప్రతికూల వాతావరణం ఇబ్బంది పెట్టింది. ఒక ల్యాప్‌లో అయితే శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది’ అని అన్నాడు. పాల్గొన్న తొలి అంతర్జాతీయ పోటీలో రజతం గెలిచిన తన శిష్యుడి ప్రదర్శన పట్ల కోచ్ చందన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళల 10వేల మీటర్ల రేస్‌వాక్‌లో బల్జీత్‌కౌర్ (48 ని.58.17 సె) ఏడో స్థానంలో నిలిచింది. ప్రియకు చేజారిన పతకం... మహిళల 400 మీటర్ల పరుగులో అనేక అంచనాల మధ్య బరిలోకి దిగిన ప్రియా మోహన్‌కు నిరాశే ఎదురైంది. దురదృష్టవశాత్తూ ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. ఫైనల్ పోటీని ప్రియ 52.77 సెకన్లలో ముగించింది. ఈ ఈవెంట్లో ఇమావోబంగ్ (నైజీరియా; 51.55 సె.), కార్నెలియా (పోలండ్; 51.97 సె.), కెన్యా అథ్లెట్ సిల్వియా చెలన్‌గట్ (52.23 సె.) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలిచారు. పురుషుల 400 మీ. హర్డిల్స్‌లో రోహన్ గౌతమ్ కాంబ్లి ఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు. సెమీస్‌లో అతను 52.88 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల హీట్స్‌లో అబ్దుల్ రజాక్, సుమిత్ చహల్, కపిల్, భరత్ శ్రీధర్‌లతో కూడిన జట్టు హీట్స్‌తోనే సరిపెట్టుకుంది. -
వైకల్యాన్ని జయించి..
రెండు చేతులూ కోల్పోయినా ఆత్మ విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. పట్టుదలతో అనుకున్నది సాధించి అనేక అవార్డులు రివార్డులు పొందాడు. అనుకోకుండా తనకు సంభవించిన వైకల్యాన్ని ఎదిరించి జీవితంలో ప్రత్యేకతను సాధించాడు. పధ్నాలుగేళ్ళ వయసులో చేతులు రెండు కోల్పోయినా విద్యతోపాటు, తనకిష్టమైన చిత్రలేఖనంపై దృష్టిని నిలిపి అపురూప దృశ్యకావ్యాలను రూపొందిస్తూ అందర్నీ అబ్బుర పరుస్తున్నాడు. ధవల్ కత్రి తన 14 ఏళ్ళ వయసులో జరిగిన ప్రమాదంలో రెండు చేతులనూ పోగొట్టుకున్నాడు. పాఠశాల సిబ్బంది కూడ అతడిని ప్రోత్సహించడం మానేసి, సెలవు తీసుకోమని సలహా ఇచ్చారు. కానీ అటువంటి అడ్డంకులను ఏమాత్రం పట్టించుకోని ధవల్.. పట్టుదలతో తన విద్యభ్యాసాన్ని కొనసాగించడంతోపాటు, పరీక్షలన్నీ స్వతహాగా రాయడమే కాక, గిటారు వాయించడంలోనూ, పెయింటింగ్స్ వేయడంలోనూ ఆరితేరాడు. అన్ని అవయవాలూ సరిగా ఉన్నవారు కూడ సాధించలేని విజయాలను సాధిస్తూ ఇప్పటివరకూ 300 వరకూ పెయింటింగ్స్ వేసిన ధవల్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.