breaking news
KGBV student died
-
కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్య?
చిల్పూరు: జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం సమీపంలోని కేజీబీవీలో 9వ తరగతి విద్యారి్థని ఇస్లావత్ వర్షిణి (14) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే బాలిక ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు, పాఠశాల వర్గాలు, ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం.. రాజవరం జీపీ పరిధి ఫకీర్తండాకు చెందిన ఇస్లావత్ తీరమ్మ, కిషన్ దంపతుల కూతురు వర్షిణిని శుక్రవారం కేజీబీవీలో 9వ తరగతిలో చేరి్పంచారు.అదే రోజు సాయంత్రం భోజనం పెట్టే సమయంలో వర్షిణి రాకపోవడంతో ఎస్ఓ పిలవగా.. ఆకలిగా లేదని సమాధానం చెప్పింది. ఆ రాత్రి భోజనం చేయకుండానే నిద్రపోయిన వర్షిణి, శనివారం ఉదయం మేల్కొనలేదు. గదులు శుభ్రం చేసేందుకు వచి్చన సిబ్బంది పలకరించినా సమాధానం రాకపోవడంతో ఆమె కప్పుకున్న దుప్పటి తీయగా వాంతులు చేసుకున్నట్లు గమనించారు. పక్కన కూల్‌డ్రింక్ బాటిల్ కనిపించడంతో అనుమానంతో ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) సోనికి తెలియజేయగా బాలిక తల్లిదండ్రులతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముందుగా వర్షిణిని స్టేషన్‌ఘన్‌పూర్ ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేసి వరంగల్ ఎంజీఎంకు పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ వర్షిణి ఆదివారం ఉదయం మృతి చెందింది. ఇష్టం లేదని చెప్పింది.. : ఎస్ఓ ఈ విషయమై ఇన్చార్జి ఎస్ఓ సోని మాట్లాడుతూ, శుక్రవారం వర్షిణి విద్యాలయంలో చేరిన సమయంలో తనకు హాస్టల్లో ఉండడం ఇష్టం లేదని చెప్పిందని వెల్లడించారు. ఈ విషయాన్ని బాలిక తల్లి దృష్టికి తీసుకెళ్లామని, ఆమె కూడా అదే విషయాన్ని చెప్పారని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో సర్దుకుంటుందని ఆమె అన్నారని తెలిపారు.కాగా, బాలిక వెంట తెచ్చుకున్న కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలిపి తెచ్చుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక మరణానికి కారణాలు ఆస్పత్రి వర్గాల పూర్తి నివేదిక వచ్చాక తెలుస్తుందని వారు చెప్పారు. ఇదిలా ఉండగా.. తన తండ్రి మద్యం తాగినప్పుడల్లా తల్లిని కొడుతుంటే అడ్డుగా ఉండేదానినని.. తనను హాస్టల్లో చేర్పిస్తే గొడవ జరిగినప్పుడు ఎవరు ఆపుతారని వర్షిణి సిబ్బందితో అన్నట్లు తెలిసింది. -
కేజీబీవీ విద్యార్థిని మృతి
బొండపల్లి: కూరగాయల మీద దోమలు, స్టోర్‌రూం, డైనింగ్ రూంలో చెత్త, గచ్చులపై మురికి, నీటి తొట్టెలో చనిపోయి కుళ్లిపోయిన ఎలుకలు, పందికొక్కుల శరీరభాగాలు... దేవుపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పరిస్థితులివి. ఈ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతున్న ఎస్టీ బాలిక బోయిన పైడమ్మ కడుపునొప్పితే శనివారం మృతి చెందింది. విద్యాలయంలో ఉన్న పరిస్థితుల వల్లే బాలిక అనారోగ్యానికి గురైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టోర్ రూమ్‌లో ఎవరు ప్రవేశించినా రూ.5 జరిమానా విధిస్తామని పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ఆ రూమ్‌లోకి వెళ్లేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. అలాగే బాలికలను పట్టించుకునే వారే అక్కడ కరువయ్యారు. పాఠశాల వాతావరణం దుర్గంధ భూయిష్టంగా మారాంది. దుర్భరమైన పరిస్థితుల మధ్య విద్యార్థినులు తప్పనిసరి పరిస్థితుల్లో చదువుకొనసాగిస్తున్నారు. పాఠశాలలో 200 మందిగాను 156 మంది విద్యార్థులను మాత్రమే ఉన్నారు. అధికారుల పరిశీలనలోనూ ఈ విషయాలే వెల్లడయ్యాయి... రామభద్రపురం మండలం ఆర్.చింతలవలస గ్రామానికి చెందిన 12 ఏళ్ల బోయిన పైడమ్మకు తల్లిదండ్రులు లేరు. ఆమె సంరక్షకుడు, మేనమామ కె.శేఖర్ జూన్ 25, 2014లో దేవుపల్లి కేజీబీవీలో ఆమెను చేర్పించాడు. ఆమెకు ఈ నెల నా లుగో తేదీన కేజీబీవీలో ఉండగా కడుపునొప్పి వచ్చింది. దీంతో విద్యాలయానికి చెందిన ఏఎన్ఎం ప్రథమ చికిత్స అందించి దేవుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం పైడమ్మ ఆరోగ్యం ఇంకా క్షీణించింది. దీంతో బాలిక మేనమామ ఆమెను మార్చి 5న స్వగ్రామం తీసుకెళ్లిపోయారు. అయితే శనివారానికే పైడమ్మ చనిపోయింది. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ బండారు బాలాజీ,తహశీల్దార్ నీలకంఠరావు, ఈఓపీఆర్డీ రవికుమార్ విలేకరులతో పాటు కేజీబీవీకి వెళ్లి పరిస్థితులను కళ్లారా చూశారు. వారు వెళ్లిన సమయానికి ప్రత్యేకాధికారి లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలపై ముసురుతున్న ఈగలు, అక్కడి అపారిశుద్ధ్యాన్ని చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి తొట్టెలో చనిపోయి కుళ్లిపోయిన ఎలుకలు, పందికొక్కుల శరీరభాగాలు తేలడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా గర్ల్స్ అండ్ ైచె ల్డ్ డెవలప్ మెంట్ అధికారి సత్యవతి వచ్చి పరిశీలించారు. ప్రత్యేకాధికారి జి.సరస్వతిపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తానని తెలిపారు. అధికారుల ఎదుటే వాంతులు అధికారులు పరిశీలనకు వెళ్లిన సమయంలో ఓ విద్యార్థిని వాంతులు చేసుకుంటూ కనిపించింది. ఏఎన్ఎం అక్కడే ఆమెకు మాత్రలు మింగిస్తున్నారు. కేజీబీవీలో ఆహారం రుచిగా ఉండడం లేదని, నాసిరకం బియ్యం వండి పెడుతున్నారని, కుళ్లిపోయిన కూరగాయాలు పెడుతున్నారని సాక్షాత్తు తహశీల్దార్ నీలకంఠరావు తీవ్ర ఆగ్రహంతో చెప్పారు. కలెక్టర్‌తో చెప్పి సిబ్బందిపై, ప్రత్యేకాధికారిపై చర్యలు తీసుకుంటామని జెడ్పీటీసీ బాలాజీ హెచ్చరించారు.