breaking news
kapunadu-Andhra Pradesh
-
కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు పవన్
కాకినాడ: వచ్చే ఎన్నికల్లో మరే ఇతర పార్టీకి కొమ్ము కాయకుండా జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కాపునాడు అధ్యక్షుడు పురంశెట్టి మంగారావు పవన్‌కల్యాణ్‌కు స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల నుంచి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదన్నారు. పవన్‌కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్రంలోని కాపులు ఎదురుచూస్తున్నారని, అయితే రాజకీయంగా పవన్ వ్యవహరించే తీరుపైనే కాపునాడు నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. జనసేన పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఒంటరిగా పోటీ చేయాలని కోరారు. కాపుల ఆత్మాభిమానాన్ని కాపాడుతూ మరే ఇతర పార్టీకి కొమ్ముకాసేలా వ్యవహరించకుండా ఉంటే మద్దతుపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఎవరినో ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్‌కల్యాణ్ పాట్లు పడుతున్నట్టు కనిపిస్తోందన్నారు. అదే జరిగితే రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ఓటర్లు, కాపు సంఘాలు కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు. దీనిపై పవన్‌కల్యాణ్ కాపుల ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
కాపుల సమస్యల పరిష్కారానికి కృషి
కాపునాడు నేతలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కాపుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. కాపునాడు-ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో సోమవారం వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో కలసి పలు అంశాలు తెలియజేయడంతో పాటు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. 2014 ఎన్నికల సమయంలో గెలుపు కోసం కాపులకు టీడీపీ అనేక హామీలిచ్చి ఆ తరువాత వాటి అమలులో నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని వారు ప్రధానంగా జగన్ దృష్టికి తెచ్చారు. కాపులకు ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం నెరవేర్చేలా తాను ప్రయత్నిస్తానని జగన్ వారికి చెప్పారు. రాష్ట్రంలో జనాభాలో అధికంగా ఉన్న కాపు కులానికి న్యాయం జరిగేలా, తమ సమస్యలపై ప్రభుత్వంలో కదలిక వచ్చేలా కృషి చేయాలని వారు జగన్‌కు విజ్ఞప్తి చేశారు.