breaking news
kakinada muncipal elections
-
కాకినాడలో చంద్రబాబు ‘ఈవీఎం’ కుట్రలు
- వీవీ ప్యాట్స్ లేని ఈవీఎంల వినియోగంపై వైఎస్సార్సీపీ అనుమానాలు - ఈవీఎంలను ట్యాంపర్ చేసిన వ్యక్తులతో కలిసి బాబు అడ్డదారులు - కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసేకోవాలన్న భూమన, చెవిరెడ్డి - కాకినాడలో వీవీ ప్యాట్లు ఉన్న ఈవీఎంలనే ఈసీ వినియోగించాలని డిమాండ్ హైదరాబాద్: కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో వీవీ ప్యాట్లు ఉన్న ఈవీఎంలను మాత్రమే వినియోగించాలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది. ఓటరు తాను ఎవరికి ఓటేశాడో తెలుసుకునే వీలున్న వీవీ ప్యాట్లను నంద్యాల ఉప ఎన్నికలో వినియోగించి, కాకినాడలో మాత్రం వినియోగించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. వైఎస్సార్సీపీ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. వీవీ ప్యాట్లు ఎందుకు వాడట్లేదు? నంద్యాల ఉప ఎన్నికలాగే కాకినాడలోనూ వీవీ ప్యాట్లు వినియోగించాలని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల అధికారికి వైఎస్సార్సీపీ లేఖలు రాసిందని, అయితే, ఆ విజ్ఞప్తిని వారు పట్టించుకోలేదని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ‘‘ పారదర్శకంగా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. వీవీ ప్యాట్లు లేకుండా జరిగే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయన్న నమ్మకం మాకు లేదు’’ అని ఆయన అన్నారు. అందుకే బాబును నమ్మలేం.. ‘‘గెలుపు కోసం ఎలాంటి అడ్డదారిలోనైనా వెళ్లే చంద్రబాబు నాయుడు.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లను ట్యాపరింగ్ చేసిచూపించిన వి.హరిప్రసాద్‌ను సలహాదారుగా నియమించుకున్నారు. ఆయనతో కలిసి కుట్రలు పన్నుతున్నారు. అధికార దుర్వినియోగంతో రాజకీయ లబ్ధిని పొందడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడంలేదంటే మేం నమ్మలేం. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని, కాకినాడలో వీవీ ప్యాట్స్తో కూడిన ఈవీఎంలను మాత్రమే వాడేలా ఆదేశాలు ఇవ్వాలి’’ అని భూమన అన్నారు. -
కాకినాడలో కుక్కలనూ వదలని జెండాలు!
శునకాలకు పచ్చజెండాలు కట్టి ప్రచారంపై విమర్శలు కాకినాడ: నంద్యాల ఉప ఎన్నిక అనంతరం ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం హోరీహోరీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కాకినాడలో చిత్రవిచిత్రమైన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. కాకినాడ 11వ వార్డులో టీడీపీ పచ్చజెండాలు కట్టుకొని శునకాలు దర్శనమివ్వడం స్థానికుల విస్మయపరిచింది. కుక్కకు టీడీపీ జెండాలు కట్టి 11వ వార్డులో తిప్పిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ ఫొటోలను షేర్ చేసుకుంటున్న నెటిజన్లు.. కుక్కలకు పార్టీ జెండాలు చుట్టి ప్రచారం చేయడం ఏమిటి? ఇదెక్కడి చోద్యమని విస్తుపోతున్నారు. మూగజీవులను సైతం రాజకీయ ప్రచారాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసం అని నిలదీస్తున్నారు.


