breaking news
Jobs opportunities
-
వర్క్‌స్పేస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కంపెనీలు తమ ఉద్యోగాలను భారత్‌కు అవుట్సోర్సింగ్ చేస్తుండటంతో దేశీయంగా ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఒక నివేదికలో తెలిపింది. 2023లో మొత్తం వర్క్ స్పేస్ లీజింగ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), థర్డ్ పార్టీ ఐటీ సేవల సంస్థల వాటా 46 శాతంగా నమోదైందని వివరించింది. ‘ఆసియా పసిఫిక్ హొరైజన్: హార్నెసింగ్ ది పొటెన్షియల్ ఆఫ్ ఆఫ్‌షోరింగ్‘ రిపోర్టు ప్రకారం భారత్‌లో ఆఫ్‌షోరింగ్ పరిశ్రమ గణనీయంగా పెరిగింది. గ్లోబల్ ఆఫ్‌షోరింగ్ మార్కెట్లో 57 శాతం వాటాను దక్కించుకుంది. వ్యయాలను తగ్గించుకునేందుకు, నిర్వహణ సామరŠాధ్యలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు తమ వ్యాపార ప్రక్రియలను లేదా సర్వీసులను ఇతర దేశాల్లోని సంస్థలకు అవుట్సోర్స్ చేయడాన్ని ఆఫ్‌షోరింగ్‌గా వ్యవహరిస్తారు. దీన్నే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో)గా కూడా వ్యవహరిస్తారు. ఇందులో జీసీసీలు, గ్లోబల్ బిజినెస్ సర్వీసులు (జీబీఎస్) మొదలైనవి ఉంటాయి. కంపెనీలు వేరే ప్రాంతాల్లో అంతర్గతంగా ఏర్పాటు చేసుకునే యూనిట్లను జీసీసీలుగా వ్యవహరిస్తారు. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు.. ► 2023లో ఆఫ్‌షోరింగ్ పరిశ్రమలో మొత్తం లీజింగ్ పరిమాణం 27.3 మిలియన్ చ.అ.గా నమోదైంది. క్రితం సంవత్సరంతో పోలిస్తే 26 శాతం పెరిగింది. జీసీసీలు 20.8 మిలియన్ చ.అ., థర్డ్ పార్టీ ఐటీ సేవల సంస్థలు 6.5 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్‌ను లీజుకి తీసుకున్నాయి. ► భారత ఎకానమీకి ఆఫ్‌షోరింగ్ పరిశ్రమ గణనీయంగా తోడ్పడుతోంది. 2023లో మొత్తం సేవల ఎగుమతుల్లో దీని వాటా దాదాపు 60 శాతంగా నమోదైంది. సర్వీస్ ఎగుమతులు 2013లో 63 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023లో మూడు రెట్లు వృద్ధి చెంది 185.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆఫ్‌షోరింగ్ సేవలు అందించే గ్లోబల్ సంస్థల్లో 42 శాతం కంపెనీలకు భారత్‌లో కార్యకలాపాలు ఉన్నాయి. ► 2023 నాటికి దేశీయంగా జీసీసీల సంఖ్య 1,580 పైచిలుకు ఉంది. దేశీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ లావాదేవీల్లో వీటి వాటా 2022లో 25 శాతంగా ఉండగా 2023లో 35 శాతానికి చేరింది. జీసీసీల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల వాటా గణనీయంగానే ఉన్నప్పటికీ తాజాగా ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో వృద్ధికి సెమీకండక్టర్లు, ఆటోమొబైల్, ఫార్మా తదితర రంగాలు కారణంగా ఉంటున్నాయి. ► రాబోయే దశాబ్ద కాలంలో ఆఫీస్ మార్కెట్‌కు జీసీసీలే చోదకాలుగానే ఉండనున్నాయి. 2030 నాటికి దేశీయంగా వీటి సంఖ్య 2,400కి చేరనుంది. -
అడ్మిషన్స్, జాబ్స్ అలర్ట్స్ ప్రత్యేకం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దూర విద్య యూజీ కోర్సులు: బీఏ, బీకాం, కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ, ఏవియేషన్ కాలపరిమితి: మూడేళ్లు; అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత పీజీ కోర్సులు: ఎంబీఏ: రెండేళ్లు అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఐసెట్-2014లో అర్హత సాధించాలి. ఎంసీఏ: మూడేళ్లు.; అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉండాలి. ఎంఏ(ఇంగ్లిష్/హిందీ/తెలుగు/సంస్కృతం/ఉర్దూ) కాలపరిమితి: రెండేళ్లు; అర్హతలు: సంబంధిత సబ్జెక్టుతో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఎంఏ(ఎకనామిక్స్/పొలిటికల్ సైన్స్/హిస్టరీ/సైకాలజీ) కాలపరిమితి: రెండేళ్లు; అర్హతలు: సంబంధిత సబ్జెక్టుతో బ్యాచిలర్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులు. ఎంకాం; కాలపరిమితి: రెండేళ్లు; అర్హతలు: బీకాం ఉత్తీర్ణత. ఎమ్మెస్సీ(మ్యాథ్స్)/ఎమ్మెస్సీ(స్టాటిస్టిక్స్); కాలపరిమితి: రెండేళ్లు అర్హతలు: సంబంధిత సబ్జెక్టుతో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: అక్టోబర్ 10 వెబ్సైట్: http://www.oucde.ac.in/ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కోర్సు: ఎల్ఎల్ఎం; సీట్ల సంఖ్య: 15 కాలపరిమితి: ఏడాది; అర్హతలు: ఇంటిగ్రేటెడ్ లా లేదా బీఏ, ఎల్ఎల్బీ ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21 వెబ్సైట్: www.armyinstituteoflaw.org/ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ పోస్టులు: క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ క్లినికల్ రీసెర్చ్ అసిస్టెంట్ ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా; దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 10 వెబ్సైట్:http://www.nims.edu.in/ నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్ పోస్టులు: సిస్టమ్ ఎనలిస్ట్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్లో నిర్దేశించిన అర్హతలు, వయోపరిమితి ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి; చివరి తేది: జూలై 20 వెబ్సైట్: http://www.ncui.coop/