breaking news
jee advanced-2016
-
జేఈఈ టాపర్లకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. వైఎస్ జగన్ ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు. జేఈఈ అడ్వాన్స్డ్-2016 టాప్ 100 ర్యాంకుల్లో 29 ర్యాంకులను తెలుగు విద్యార్థులే కైవసం చేసుకున్నారు. టాప్ 10 ర్యాంకుల్లో ఏకంగా 5 ర్యాంకులను సాధించారు. మే 22న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు, ఆల్ ఇండియా ర్యాంకులను ఐఐటీ గువాహటి ఆదివారం ప్రకటించింది. Congratulations to #IIT-JEE advanced exam toppers from our Telugu states. All the best for a bright future. — YS Jagan Mohan Reddy (@ysjagan) 13 June 2016 -
జేఈఈ అడ్వాన్స్డ్-2016 ఫలితాలు విడుదల
ఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్-2016 ఫలితాలను ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. మొదటి 100 ర్యాంకుల్లో 30 శాతం తెలుగు విద్యార్థులు సాధించడం విశేషం. తెలుగు విద్యార్థికి నాలుగో ర్యాంక్ వచ్చింది.