జేఈఈ టాపర్లకు వైఎస్ జగన్ అభినందనలు | ys jagan mohan reddy congratulated JEE advanced telugu toppers | Sakshi
Sakshi News home page

జేఈఈ టాపర్లకు వైఎస్ జగన్ అభినందనలు

Jun 13 2016 1:45 PM | Updated on Jul 25 2018 4:09 PM

జేఈఈ టాపర్లకు వైఎస్ జగన్ అభినందనలు - Sakshi

జేఈఈ టాపర్లకు వైఎస్ జగన్ అభినందనలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. వైఎస్ జగన్ ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్-2016 టాప్ 100 ర్యాంకుల్లో 29 ర్యాంకులను తెలుగు విద్యార్థులే కైవసం చేసుకున్నారు. టాప్ 10 ర్యాంకుల్లో ఏకంగా 5 ర్యాంకులను సాధించారు. మే 22న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు, ఆల్ ఇండియా ర్యాంకులను ఐఐటీ గువాహటి ఆదివారం ప్రకటించింది.

Advertisement

పోల్

Advertisement