breaking news
Jayakanth
-
మంచి కామెడీ రైడ్‌లా ఉంటుంది
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘గుర్రంపాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో జయకాంత్ మాట్లాడుతూ– ‘‘కొత్త నిర్మాతలంటే ఏదైనా లవ్‌స్టోరీ, యూత్‌ఫుల్ కంటెంట్‌తో తొలి సినిమా చేస్తుంటారు. కానీ మేం డార్క్ కామెడీ జానర్లో ‘గుర్రంపాపిరెడ్డి’ సినిమా చేశాం. ఈ కథ విని, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేస్తానని అన్నారు. కానీ ఆయన ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు.ఆ తర్వాత మరో యంగ్ హీరో కథ విని, ఓకే చెప్పారు. కానీ ఆ హీరో ఈ సినిమా చేయలేదు. ఈ క్రమంలో నరేశ్ అగస్త్యకు ఈ సినిమా కథ వినిపించగా, ఓకే అన్నారు. ‘గుర్రంపాపిరెడ్డి’పాత్రలో నరేశ్ బాగా నటించారు. ఈ చిత్రంలో సౌదామినిపాత్రలో ఫరియా అబ్దుల్లా మంచి రోల్ చేశారు. ‘జాతి రత్నాలు’ సినిమాలో ఉన్నట్లుగా బ్రహ్మానందంగారు–ఫరియాల మధ్య మంచి కామెడీ ట్రాక్ ఉంది. రీసెంట్ టైమ్స్‌లో బ్రహ్మానందంగారు ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన సినిమా ఇదే.దర్శకుడు మురళీ మనోహర్ బాగా తెరకెక్కించారు. ఓ ఫన్ రైడ్ మూవీలా మా ‘గుర్రంపాపిరెడ్డి’ ప్రేక్షకులను నవ్విస్తుంది’’ అని చెప్పారు. అమర్ బురా మాట్లాడుతూ– ‘‘తెలివిలేని వాళ్లు తెలివైనవాడిని ఎలా ఎదుర్కొన్నారు? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. సందేశాల కోసం ప్రేక్షకులు థియేటర్స్‌కు రారు. ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యే ఫన్, కామెడీ మా సినిమాలో ఉన్నాయి. మా ‘గుర్రంపాపిరెడ్డి’ సినిమాను 140 స్క్రీన్స్‌లో ఓన్‌గా రిలీజ్ చేస్తున్నాం. టికెట్ ధరలను కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా ΄్లాన్ చేస్తున్నాం’’ అని తెలిపారు. -
సినిమాలోనూ అన్నదమ్ములే!
తమిళసినిమా: జేకే,జయకాంత్ సోదరద్వయం తిరుపతిస్వామి కుటుంబం అనే చిత్రం ద్వారా కథానాయకులుగా పరిచయం అవుతున్నారు. విశేషం ఏమిటంటే వీరు చిత్రంలోనూ అన్నదమ్ములుగా నటించారు. ఐశ్వర్యలక్ష్మి కథానాయకిగా, జయన్ ప్రధాన పాత్రలో నటించిన ఇందులో దేవదర్శిని, మయిల్‌స్వామి, ముత్తురామన్, కే.అమీర్, కవిరాజ్, సిజర్‌మనోహర్ ముఖ్యపాత్రలను పోషించారు. జేకే.గుడ్ ఫిలింస్ బాబూరాజ్, జేమ్స్ ఫిలింస్ మురుగానంద్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి సురేశ్ షణ్ముగం దర్శకత్వం వహించారు. ఈయన ఇంతకు ముందు అరసు, గంభీరం చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని బాబురాజ్, జాఫర్ఆష్రాఫ్ నిర్మించారు. చిత్ర వివరాలను నిర్మాతల్లో ఒకరైన బాబూరాజ్ తెలుపుతూ తాను సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థలో 25 ఏళ్లగా నిర్మాణ నిర్వాహకుడిగా బాధ్యతలు నిర్వహించానని తెలిపారు. కాగా ఈ తిరుపతిస్వామి చిత్రాన్ని తన ఇద్దరు కొడుకులు జేకే, జయకాంత్లను కథానాయకులుగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్నానని తెలిపారు.మన పక్కింటిలోనో, ఎదురింటిలోనో కనిపించే సగటు మనిషిలాంటి పాత్ర తిరుపతిస్వామిలో ఉంటుందన్నారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వెళ్లి సాయం చేసే ఆయనకు ఒక అధికారం, రాజకీయ బలం ఉన్న వ్యక్తితో సమస్య ఎదురవుతుందన్నారు. దాన్ని ఆయన కొడుకులు బుద్ధిబలంతో ఎలా ఎదుర్కొన్నారన్నదే తిరుపతిస్వామి చిత్రం అన్నారు. చిత్రం పూర్తి అయ్యిందని, సెన్సార్ సభ్యులు ‘యూ’ సర్టిఫికెట్ అందించడంతో పాటు మంచి కుటుంబ కథా చిత్రం అంటూ ప్రశంసించారని తెలిపారు. తిరుపతిస్వామి చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.


