breaking news
jaleel kahan
-
జలీల్‌ఖాన్.. అసలు నీకు సిగ్గుందా?
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు విజయవాడలో వచ్చిన ప్రజలను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మద్యం తాగి రోడ్లపైకి వచ్చి పోలీసులు, వైఎస్పార్సీపీ నాయకులపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు బోండా ఉమ, కేశినేని నాని, బుద్దా వెంకన్న, జలీల్‌ఖాన్, చింతమనేని ప్రభాకర్ రౌడీయిజం చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు పట్టించుకోవటం లేదని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు వీళ్ళందరికి అండగా ఉండి రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి అధికార టీడీపీలోకి ఫిరాయించిన జలీల్‌ఖాన్‌కు విశ్వాసం లేదని విమర్శించారు. ‘జలీల్‌ఖాన్.. నీకు విశ్వాసం ఉంటే పార్టీ మారేవాడివి కాదు. నీకు సిగ్గుంటే వైఎస్సార్సీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్. టీడీపీ నుంచి నువ్వు.. వైఎస్సార్సీపీ తరుపున నేను ఎన్నికల్లో పోటీ చేద్దాం. నీకు డిపాజిట్లు కూడా రావు. ఒకవేళ జలీల్‌ఖాన్‌కు డిపాజిట్లు వస్తే.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. వైఎస్సార్సీపీ నాయకులు చటర్జీ, దుర్గాలను జలీల్‌ఖాన్ బెదిరిస్తున్నారు. వాళ్ళకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే భాద్యత వహించాలి. టీడీపీ నాయకులు చేసే రౌడీయిజానికి వైఎస్సార్సీపీ ఎన్నటికీ భయపడదు. జలీల్‌ఖాన్ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చూస్తూ ఊరకోం. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు స్పందించటం లేదు. ఎమ్మెల్యే చింతమనేని ఆర్టీసీ కండక్టర్‌ను కొడితే ఉద్యోగ సంఘాలు ఏమయ్యాయ’ని ప్రశ్నించారు. -
జలీల్‌ఖాన్.. రాజీనామా చేయ్!
విజయవాడ : ‘జలీల్‌ఖాన్ రాజీనామా చేయ్. అధికార పార్టీకి తొత్తుగా ఉంటూ మసీదులు, దర్గాలు, ఖబరస్తాన్లు కూలుస్తున్నావు, జాతి జాతి అంటూ ముస్లింలను తాకట్టు పెడుతున్నావ’ని పశ్చిమ నియోజకవర్గ ముస్లింలు జలీల్‌ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తారాపేటలోని మసీదు, ఖబర్‌స్తాన్ కూల్చేం దుకు అధికారులు సమయుత్తమవుతున్న నేపథ్యంలో అక్కడి ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ అనంతరం మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తారాపేట మసీదు ప్రాంగణం వద్ద సమావేశమయ్యారు. ముస్లిం మత ప్రముఖులు, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఆ సమయంలో జలీల్‌ఖాన్ అక్కడకు రాగానే ముస్లింలు ఒక్కసారిగా రావద్దంటూ నినాదాలు చేశారు. మత పెద్దలు వారిని సముదాయించి కూర్చోపెట్టారు. జలీల్‌ఖాన్ మాట్లాడుతూ తనకు పదవులు, పార్టీలు ముఖ్యం కాదని, మసీదుకు సంబంధించి ఒక్క ఇటుక తీసినా వెంటనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. దాంతో వారు ఒక్కసారిగా రాజీనామా చేసేయ్ అంటూ బిగ్గరగా అరిచారు. రామవరప్పాడు మసీదు కూల్చివేత అంశంలోనూ ముస్లింలను మభ్యపెట్టి ప్రభుత్వానికి అండగా నిలిచావని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ముస్లిం పెద్దలను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లి మాట్లాడిస్తానంటూ నమ్మబలికారు. అయినా ముస్లింలు ఎదురుతిరగడంతో జలీల్‌ఖాన్ బిత్తరపోయారు. సమదాయించటానికి ముస్లిం పెద్దలు కూడా ఇబ్బంది పడ్డారు. మసీద్ జోలికి వస్తే ఊరుకోం : ఆసిఫ్ తారాపేట మసీదు జోలికి వస్తే ఊరుకోమని వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోయజకవర్గ ఇన్చార్జి షేక్ ఆసిఫ్ అన్నారు. మౌన ప్రదర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్న ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు బుద్ధిచెప్పాలన్నారు. తారాపేట మసీదు వద్ద రోడ్డు విస్తరణకు సంబంధించి రైల్వే స్థలంలో కూడా స్థలాన్ని తీసుకోవాలని.. ఆ దిశగా కేంద్ర మంత్రిని కలిసి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం మత సంస్థలపై అన్యాయంగా వ్యవహరి స్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సభకు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు హబిబుర్ రెహమాన్ అధ్యక్షత వహించగా అహలే సున్నతులే జమాతే ఫోరం కో–కన్వీనర్ అల్తాఫ్‌రాజా మాట్లాడారు.