breaking news
Ishagupta
-
అందుకే అవకాశాలు రాలేదు
ఎస్.ఎం.ఎస్, భీమిలి కబడ్డీ జట్టు’ వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్య రూపొందించిన తాజా చిత్రం ‘వీడెవడు’. సచిన్ జోషి, ఇషా గుప్తా జంటగా రైనా జోషి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. తాతినేని సత్య మాట్లాడుతూ– ‘‘ఇదొక థ్రిల్లర్. హీరో భార్య హత్యకు గురవుతుంది. ఆ నేరం హీరో మీద పడుతుంది. అసలు ఆ హత్య హీరో చేశాడా? లేక వేరెవరైనా చేశారా? అన్నది సస్పెన్స్. హీరో ప్రో కబడ్డీ ప్లేయర్. ఆటకి క్రైమ్‌ను మిక్స్ చేసి, ఆడుతుంటాడు. ‘భీమిలీ కబడ్డీ జట్టు’ హిట్ తర్వాత పెద్ద సినిమాలు చేయలేకపోవడానికి కారణం నాకు సరైన పి.ఆర్. లేకపోవడమే. నేను పెద్దగా హీరోల్ని, నిర్మాతల్ని కలవను. అందుకే అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఈ సినిమాతో నేను రీమేక్ సినిమాలు మాత్రమే చేయగలననే పేరు పోతుంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో నానీకి ఒక లైన్ చెప్పాను. అతనితోనే చేయొచ్చు’’ అన్నారు. -
క్రైమ్ థ్రిల్లర్‌గా యార్ ఇవన్
తమిళసినిమా: క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కిన యార్ ఇవన్ చిత్రం ఈ నెల 15న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఒక పక్క వ్యాపార రంగంలో రాణిస్తూ మరో పక్క సినిమాను ఫ్యాషన్‌గా నటిస్తున్న నటుడు సచిన్. ఇంతకు ముందు పలు తెలుగు చిత్రాల్లో నటించిన ఆయన తాజాగా యార్ ఇవన్ పేరుతో తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళం, తెలుగు భాషల్లో సచిన్ కథానాయకుడిగా నటించి నిర్మించిన ఈ చిత్రంలో ఆయనకు జంటగా ఇషాగుప్తా నాయకిగా నటించింది. ఇతర ప్రధాన పాత్రల్లో ప్రభు, కిశోర్, సతీష్ తదితరులు నటించారు. ఎస్ఎస్.థమన్ సంగీతం అందించిన యార్ ఇవన్ చిత్రానికి టీ.సత్య దర్శకుడు. చిత్రం ఈ నెల 15వ తేదీన రెండు భాషల్లో విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం ఉదయం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ సమావేశంలో దర్శకుడు టీ.సత్య మాట్లాడుతూ క్రీడా నేపథ్యంలో తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం యార్ ఇవన్ అని తెలిపారు. ఇందులో సచిన్ ప్రోకబడ్డీ క్రీడాకారుడిగా నటించారని తలిపారు. లవ్, యాక్షన్ సన్నివేశాలతో కూడిన భారీ చిత్రంగా యార్ ఇవన్ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం చిత్ర నిర్మాత, కథానాయకుడు సచిన్ మాట్లాడుతూ తాను వ్యాపార రంగానికి చెందిన వాడినైనా 8 ఏళ్ల వయసులోనే బాల నటుడిగా పరిచయం అయ్యానని చెప్పారు. అందువల్ల వ్యాపారాన్ని నాన్న చూసుకుంటారని, తనకు నటనే ముఖ్యం అని తెలిపారు. అదే విధంగా సినిమాకు భాష లేదని, యార్ ఇవన్ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను అలరించే చిత్రంగా ఉంటుందని తెలిపారు.