breaking news
Isaac
-
పేరు మాయని మనిషి
అసలైన సాహిత్యజీవికి వర్తమానం ఎలాంటి కిరీటమూ పెట్టకపోవచ్చు, కానీ చరిత్ర అతడిని తగిన విధంగా ఆశీర్వదిస్తుందనడానికి ఐజాక్ బేబెల్ జీవితమే ఉదాహరణ. అయితే ఆ వర్తమానపు విషాదం చరిత్ర ఎప్పటికీ తుడుచుకోలేని మచ్చ. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగమైన ఉక్రెయిన్‌లో జన్మించిన ఈ యూదు తన మాతృభాష యిడ్డిష్ను కాదని రష్యన్‌ను రచనా భాషగా ఎంచుకున్నాడు. సోవియట్ రష్యా ఆకాంక్షలకు అనుగుణంగా నిలిచాడు. పోలిష్–సోవియట్ యుద్ధ సమయంలో రచయిత గోర్కీ సూచన మీద పాత్రికేయుడిగా పనిచేసిన బేబెల్ ఆ యుద్ధం తాలూకు చీకటి, బీభత్సాల చేదు వాస్తవికతను ‘రెడ్ కావల్రీ’ కథలుగా అందించాడు. 1926లో తొలిసారి ప్రచురితమైన ఈ కథలకు ఇది శతాబ్ది సంవత్సరం.అత్యంత సంక్షిప్తంగా రాయడం, ఉన్నట్టుండి కథను మరో తలంలోకి కొనిపోవడం, ‘సాల్ట్’ కథ గురించి బోర్హెస్ అన్నట్టు– కవిత్వానికే సాధ్యమై మననానికి వీలుండే లయను కథలో సాధించడం బేబెల్ గొప్పతనం. రెడ్ కావల్రీ, తను పుట్టి పెరిగిన ఒడెస్సా పట్టణం నేపథ్యంలో ‘ఒడెస్సా స్టోరీస్’, ఇంకా రెండు నాటకాలు, ఒక సినిమాకు స్క్రీన్‌ప్లే మాత్రమే రాసిన బేబెల్(1894–1940) వచనంలో కరుణ, కాఠిన్యం కలగలసి మనసును మెలిపెడతాయి. యుద్ధభూమి తాలూకు బహుముఖ పార్శా్వలనూ, అత్యంత సున్నితమైన మనిషి కూడా అనూహ్య కార్యాలకు సిద్ధమయ్యే విపరిణామాలనూ ఆయన చిత్రించాడు. సాధారణ జీవితం గడపాలని కోరుకుంటూ రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న నిస్సహాయ మానవులు అందులో కనబడతారు. చావు వాసన వేసే కథలు ఆయనవి! యుద్ధం అనేది యుద్ధ క్షేత్రానికే పరిమితమై ఉండదని కూడా ఈ కథలు చెబతాయి.కమ్యూనిస్టు వ్యతిరేకి కాకపోయినా బేబెల్ ప్రాపగాండా వ్యతిరేకి. దాంతో విమర్శను తట్టుకోలేని రాజ్యం ఆయన్ని సోవియట్ యూనియన్‌లో ‘నాన్–పర్సన్’ చేయడానికి పూనుకుంది. 1933 నుంచే ఆయన పుస్తకాలను ఉపసంహరించడం మొదలైంది. స్టాలిన్ హయాంలోని ‘సామ్యవాద వాస్తవికత’కు తగ్గట్టుగా రచయితలు తమ పాత రచనలను తిరగరాస్తున్న వేళ, తనను తాను సరిచేసుకోవడం ఇష్టంలేని బేబెల్ మౌనం అనే కొత్త సాహిత్య ప్రక్రియలో రాణిస్తున్నానని చెప్పుకొన్నాడు. ఇక ‘ప్రజా శత్రువు’గా అరెస్టయిన తర్వాత బేబెల్ మీద ట్రాట్స్కీయిస్టు, ఉగ్రవాదం, గూఢచర్యం లాంటి కేసులు పెట్టారు. ఆయన పేరును సాహిత్య నిఘంటువుల్లోంచీ, ఎన్సైక్లోపీడియాలోంచీ తొలగించారు. ఆయన గురించి ఏ సాహిత్య కార్యక్రమంలోనూ ఎత్తడానికి లేదు. బేబెల్ అనే మనిషి లేనట్టుగానే వ్యవహరించారు. ఆధునిక సోషల్ మీడియా యుగంలో జడలు విప్పిన ‘క్యాన్సిల్ కల్చర్’ అనేదానికి ఆ కాలంలో బీజాలున్నాయి. 1940 జనవరి 16న పార్టీకీ, సోవియట్ ప్రభుత్వానికీ శత్రువులైన 457 మంది జాబితా స్టాలిన్‌కు అందింది. అందులో బేబెల్ సహా 346 మందిని కాల్చేయాలన్న సిఫారసు ఉంది. జనవరి 27న మధ్యాహ్నం 1:30కు 45 ఏళ్ల బేబెల్‌కు కాల్చివేత శిక్ష అమలైంది. బేబెల్ సమగ్ర రచనలను ఆంగ్లంలోకి అనువదించిన పీటర్ కాన్‌స్టంటీన్ ఈ మరణ శిక్షను ‘ఇరవయ్యో శతాబ్ద సాహిత్యపు అతి దారుణ విషాదాల్లో ఒకటి’గా అభివర్ణించారు. 1954లో కృశ్చేవ్ పాలనలో బేబెల్‌ను నిరపరాధిగా ప్రకటించిన తర్వాతగానీ ఆయన రచనలు మళ్లీ వెలుగు చూడలేదు.రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ తన గతాన్ని పునఃసమీక్షించుకుంటూ, కొత్త చరిత్రను లిఖించకుంటున్న వేళ, అక్కడి మేధావర్గంలో బేబెల్ మీద సంక్లిష్ట స్పందన ఉంది. కానీ ’(ఉక్రెయిన్) అంధత్వం, అశక్తత, ఆ ఆశక్తత లోంచి పుట్టిన తెలియని కఠినత్వం’ గురించి రాసిన బేబెల్ సృజన విస్మరించలేనిదని పొలిటికల్ సైంటిస్ట్ వాలెంటీన్ బుషాన్స్కీ అంటారు. ఒక దిశ లేకుండా పుస్తకాలు చదువుతున్న భార్య ఆంటోనినా పీరుష్కోవాకు అనవసర పుస్తకాల మీద సమయం వృథా చేసుకోకుండా ముఖ్యమైన క్లాసిక్స్ ఏవి చదవాలో ఒక జాబితా ఇస్తాడు బేబెల్. చదవడం ఎంత ముఖ్యమో, ఏవి చదవాలో తెలియడం అంతకన్నా ముఖ్యం. ఆ జాబితాలో మనం బేబెల్‌ను కలుపుకోవచ్చు. -
ఆస్ట్రేలియాపై ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు
జెరూసలేం: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ దాడి ఘటనపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఆస్ట్రేలియాపై ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు చేసింది. ముందే అలర్ట్ చేయడంతో ఆస్ట్రేలియా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యూదుల వేడుకలను టార్గెట్ చేసిన ఉగ్రమూక దాడిలో 10 మంది మృతిచెందగా.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు.యూదులపై దాడులు జరగవచ్చని ఆస్ట్రేలియాకు ముందే హెచ్చరికలు ఇచ్చామని.. యాంటీ-సెమిటిజాన్ని అరికట్టడంలో చర్యలు తీసుకోలేదని ఇజ్రాయెల్ విమర్శించింది. ఈ సందర్భంగా సిడ్నీ కాల్పుల ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ట్వీట్ చేశారు. సిడ్నీ కాల్పుల ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పటికైనా ఆస్ట్రేలియా ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలి’అని పేర్కొన్నారు. I'm appalled by the murderous shooting attack at a Hanukkah event in Sydney, Australia.These are the results of the anti-Semitic rampage in the streets of Australia over the past two years, with the anti-Semitic and inciting calls of “Globalise the Intifada” that were realized… pic.twitter.com/ZMveTRIvwx— Gideon Sa'ar | גדעון סער (@gidonsaar) December 14, 2025మరోవైపు, సిడ్నీ ఉగ్రదాడిని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ తీవ్రంగా ఖండించారు. యూదులపై అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా అధికారులు యాంటీ-సెమిటిజాన్ని ఎదుర్కోవడంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మన సోదరులు, సోదరీమణులు.. ఉగ్రవాదుల చేతిలో అత్యంత క్రూరమైన దాడికి గురయ్యారు’ అంటూ హెర్జోగ్ యెరూషలేములో జరిగిన ఒక కార్యక్రమంలో విచారం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాను వేధిస్తున్న ‘యాంటీ-సెమిటిజం’ని ఎదుర్కోవడానికి పోరాడాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ ఉగ్రదాడి యూదులే లక్ష్యంగా జరిగిందా? అనేదానిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.బాండీ బీచ్‌లో కాల్పుల ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అన్నారు. ఈ ఘటన దృశ్యాలు కలచివేస్తున్నాయని.. బాధితులకు తన ప్రగాఢ సానుభూతి’’ అంటూ అల్బనీస్ ట్వీట్ చేశారు. -
పాస్టర్ కుమారుడిని విడుదల చేసిన మావోయిస్టులు
ఎట్టకేలకు పాస్టర్ కొడుకు ఇసాక్‌ను మావోయిస్టులు విడిచిపెట్టారు. అక్టోబర్ 30వ తేదీన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ కన్నయ్యను కిడ్నాప్ చేయడానికి వచ్చిన మావోయిస్టులు, ఆయన దొరక్కపోవడంతో కొడుకు ఇసాక్‌ను కిడ్నాప్ చేసిన విషయం విదితమే. ఇసాక్ గురువారం ఉదయం స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే ఇసాక్ విడుదల కోసం పలువురు చర్చి పాస్టర్లు, మానవ హక్కుల వేదిక నాయకులు ప్రయత్నాలు చేశారు. ఆయన విడుదల కోసం మావోయిస్టులకు రాయబారాలు కూడా పంపారు. ఈ నేపథ్యంలోనే ఐదు రోజుల క్రితం 12 మంది పాస్టర్లను మావోయిస్టులు అదుపులోకి తీసుకుని, మరుసటి రోజున విడిచిపెట్టారు. 13 రోజుల తర్వాత ఇంటికి చేరుకుని ఇసాక్ విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టులు తనను బాగానే చూసుకున్నారని చెప్పాడు. -
'తండ్రి వస్తేనే కొడుకును వదులుతాం..'
తమ చెరలో ఉన్న ఇస్సాక్‌ను విడుదల చేయాలంటే అతని తండ్రి పాస్టర్ కన్నయ్య తమ వద్దకు రావాల్సిందేనని మావోయిస్టులు అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు ఇస్సాక్ ఆచూకీ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లి మావోయిస్టుల చేతిలో బందీలైన పాస్టర్లను ఆదివారం రాత్రి మావోయిస్టులు విడిచిపెట్టారు. అయితే చెర వీడిన పాస్టర్లు అటవీ ప్రాంతంలో అసలేం జరిగిందనే దానిపై నోరు మెదపడం లేదు. ఇస్సాక్ ఆచూకీ కోసం వెళ్లినపుడు మావోయిస్టులు ఎలా తారసపడ్డారు, ఏం మాట్లాడారు, ఇస్సాక్‌ను చూపించారా, ఎలాంటి హెచ్చరికలు చేశారనే దానిపై వారు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే, తాము ముందు నుంచీ బందీ చేసిన ఇస్సాక్‌ను, పాస్టర్లను మావోయిస్టులు విడివిడిగా ఉంచినట్లు తెలిసింది. కాగా, కన్నయ్య వచ్చిన తర్వాత అతనితో మాట్లాడిన అనంతరం కొడుకుని విడుదల చేస్తామని, మరోసారి ఇస్సాక్‌విడుదల కోసం ఎవరూ మధ్యవర్తులుగా రావద్దని మావోయిస్టులు హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో ఇస్సాక్ భవితవ్యం ఇక అతని తండ్రిపైనే ఆధారపడి నట్లయింది. ఈ నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన కుటుంబసభ్యుల్లో నెలకొంది. మరోవైపు మావోయిస్టులు కన్నయ్యకు అల్టిమేటం జారీచేస్తూ ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇస్సాక్‌ను అపహరించిన నాటి నుంచి కన్నయ్య ఆచూకీ లేకపోవడంతో మావోయిస్టులు లేఖలో ఏం రాశారనేది స్పష్టంగా తెలియరాలేదు.


