breaking news
	
		
	
  Insurance Payment
- 
      
                   
                                                       పర్మిట్ మార్గాన్ని ఉల్లంఘించినా బీమా కంపెనీ పరిహారం చెల్లించాల్సిందే: సుప్రీంన్యూఢిల్లీ: ప్రమాద బీమా చెల్లింపు విషయమై సుప్రీంకోర్టు తీర్పు కీలక తీర్పు వెలువరించింది. హఠాత్తుగా ప్రమాదం చోటుచేసుకున్న సందర్భాల్లో యజమాని లేదా నిర్వాహకుడిపై పరిహారం భారం నేరుగా పడకుండా కాపాడటమే బీమా పాలసీ ఉద్దేశమని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రమాదానికి గురైన వాహనం మార్గాన్ని (రూట్‌ను) ఉల్లంఘించి, పర్మిట్‌ను అతిక్రమించిందనే ఏకైక కారణం చూపుతూ బీమా సంస్థలు బాధితులకు పరిహారం నిరాకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. బాధితుడికి లేదా అతడిపై ఆధారపడిన వారికి పరిహారం నిరాకరించడం న్యాయ విరుద్ధం. ఆ ప్రమాదం బాధితుడి తప్పేమీ లేకుండా జరిగింది కాబట్టి, బీమా సంస్థ కచ్చితంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు వాహన యజమాని, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ బీమా కంపెనీ వేసిన పిటిషన్లను కొట్టివేసింది. 2014 అక్టోబర్ 7వ తేదీన కర్నాటకలో ఓ మోటారు సైకిల్‌ను రాంగ్రూట్లో వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఘటనలో మోటారు సైకిలిస్ట్ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన మోటారు ప్రమాదాల ట్రిబ్యునల్ రూ.18.86 లక్షల పరిహారాన్ని వడ్డీ సహా చెల్లించాలంటూ బీమా కంపెనీని ఆదేశించింది. దీనిపై, ఆ కంపెనీ కర్నాటక హైకోర్టుకు వెళ్లింది. ఆ మొత్తం సరైందేనని ధ్రువీకరించిన హైకోర్టు.. పరిహారాన్ని ముందుగా బాధిత కుటుంబానికి చెల్లించి, ఆ తర్వాత వాహన యజమాని నుంచి వసూలు చేసుకోవాలని తీర్పు వెలువరించింది. ఈ తీర్పును వాహన యజమానితోపాటు బీమా కంపెనీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, పైవిధంగా తీర్పు వెలువరించింది.
- 
      
                   
                                 అమెరికా టు హైదరాబాద్.. వ్యాపార బాట
 ♦ హైదరాబాద్ కేంద్రంగా..అమెరికాలోని ఆసుపత్రులకు సేవలు
 ♦ ఒక్క ఏడాదిలోనే 6 మిలియన్ డాలర్ల బీమా చెల్లింపుల రికవరీ
 ♦ బీమా ఆదాయ విశ్లేషణల్లో వినూత్న సేవలందిస్తున్న డేటా మార్షల్
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : గతేడాది అమెరికాలోని బీమా కంపెనీలు అక్కడి ఆసుపత్రులకు 58 బిలియన్ డాలర్లను అండర్ పేమెంట్ (తక్కువ మదింపు) చేశాయని అమెరికా ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఈ మదింపు ఆధారంగా వ్యాపార అవకాశాల్ని అందిపుచ్చుకుంది డాటా మార్షల్. దాంతో అమెరికా నుంచి హైదరాబాద్‌కు వ్యాపార బాటలు వేసింది. తప్పుగా మదింపు చేసిన క్లయిమ్‌లను పేమెంట్ ఇంటిగ్రిటీ సర్వీసెస్ (పీఐఎస్) విధానంతో విశ్లేషించి.. బీమా చెల్లింపులను రికవరీ చేయించడమే దీని పని. ఇలా ఒక్క ఏడాదిలోనే రికవరీ చేసిన సొమ్మెంతో తెలుసా.. అక్షరాల 6 మిలియన్ డాలర్లకు పైమాటే. ఇది చాలదు బీమా రంగంలో డేటా మార్షల్ అందిస్తున్న వినూత్న సేవలోంటే చెప్పేందుకు!! మరిన్ని విశేషాలు డేటా మార్షల్ కో-ఫౌండర్ రవి ర్యాలీ మాటల్లోనే..
 
 2000వ సంవత్సరంలో మన దేశంలో బీమా పాలసీలను ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశ్యంతో అప్పటివరకున్న ప్రభుత్వ బీమా సంస్థలతో పాటుగా ప్రైవేటు బీమా కంపెనీలకూ అవకాశం కల్పించింది ప్రభుత్వం. అలాంటి సమయంలోనే దేశంలో ఇంటర్నెట్ బూమ్ కూడా వచ్చింది. అప్పుడే అనిపించింది.. ఆన్లైన్లో బీమా పాలసీలను విక్రయిస్తే ఎలా ఉంటుందని! చేతిలో ఉన్న కొంత మొత్తంతో సంరక్ష.కామ్ పేరుతో కంపెనీ ప్రారంభించి.. ఆన్లైన్లో బీమా పాలసీలను విక్రయించడం ప్రారంభించాను. హైస్ట్రీట్ వాసులు తిరిగే చోట కార్పొరేట్ స్థాయిలో పాలసీలను విక్రయించడం మొదలుపెట్టాను. ఇది చూసిన చాలా బీమా కంపెనీలు డొమైన్ నాలెడ్జ్ ఇస్తాం.. మరింత విస్తరింప చేయండని ప్రోత్సహించారు.
 
 2001 డిసెంబర్లో అమెరికాలోని ఒక ఆరోగ్య బీమా కంపెనీ.. ఫిజికల్‌గా ఉండే బీమా క్లయిమ్‌లను ఎలక్ట్రానిక్ రూపంలో మార్చే పనిని అప్పజెప్పింది. ఆరోగ్య బీమాలకు సంబంధించిన పేషెంట్ వివరాలు, డేటా వంటి సమాచారం ఫిజికల్ కాపీలు వచ్చేవి. వాటిని ఎలక్ట్రానిక్ రూపంలో తర్జుమా చేయడం డేటా గ్రిడ్ పని. సంరక్ష.కామ్‌ను కాస్త డాటా గ్రిడ్‌గా పేరు మార్చి 5 మంది ఉద్యోగులతో అమెరికాలో సేవలను ప్రారంభించాం.
 
 అసలేం జరుగుతుందో..
 ఆరోగ్య బీమాకు సంబంధించిన ఫిజికల్ కాపీలు మా దగ్గరి రావడానికి ముందు.. ఎలక్ట్రానిక్ రూపంలో తర్జుమా చేశాక జరిగే తతంగం ఏంటనే విషయంపై నోయిడాకు చెందిన ఇద్దరు నిపుణుల సహాయంతో విశ్లేషించాం. అప్పుడే అర్థమైంది.. ఆరోగ్య బీమా ఎలా క్లయిము చేయాలో.. బీమాను ఎలా పే చేస్తున్నారనే విషయం. బీమా రంగంలో ఎంత వ్యాపారముందో కూడా తెలిసింది. అమెరికాలో చాలా ఆసుపత్రులు వెయ్యి డాలర్ల కంటే ఎక్కువగా ఉన్న క్లయిమ్‌లను మాత్రమే డాక్టర్స్ బ్యాక్‌ఆఫీస్ ఫాలోఅప్ చేస్తుంటారు.
 
 కానీ ఈ విభాగం 20 శాతం కంటే ఎక్కువ ఉండదు. చాలా వరకూ వంద డాలర్ల లోపే క్లయిమ్లుంటాయి. ఈ సమయంలోనే కంపెనీ పేరును డేటా మార్షల్‌గా మార్చాం. డేటా మార్షల్ ప్రత్యేకత ఇక్కడే ఉంది. ఆసుపత్రుల తరపున వంద డాలర్ల క్లయిమ్‌లను కూడా ఫాలో చేస్తుంది మా సంస్థ. మెడికల్ బిల్లింగ్ మాత్రమే కాదు.. క్లయిమ్ రైజ్ చేయటం దగ్గరి నుంచి ఆసుపత్రికి బీమా డబ్బులొచ్చే వరకూ మాదే బాధ్యత.
 
 డాటా మార్షల్ సక్సెస్ సీక్రెట్..
 అత్యంత నిపుణతలో పనిచేయడం సంస్థ విజయ రహస్యం. 5 మందితో ప్రారంభించిన డేటా మార్షల్లో ఇప్పుడు 400 మంది ఉద్యోగులు స్థాయికి ఎదిగింది. రెండేళ్లలో మరో 150 మంది ఉద్యోగులను నియమించుకోనున్నాం.
 
 ఒక్క ఏడాదిలో 6 మిలియన్ డాలర్లు..
 పేషెంట్ ఆసుపత్రిలో చేరిన దగ్గరి నుంచి మొదలుపెడితే.. బెడ్‌కు ఎంత.. తిండికెంత.. ట్రీట్మెంట్కెంత.. మందులకెంత.. వంటి అనేక అంశాలపై క్లయిమ్‌కు ఎంత చెల్లించాలనే విషయంపై ముందుగానే ఆసుపత్రులకు, బీమా కంపెనీలకు మధ్య ఒప్పందం ఉంటుంది. దాని ప్రకారమే బీమా కంపెనీలు ఆసుపత్రులకు చెల్లింపులు చేస్తాయి. ప్రతి వెయ్యి క్లయిమ్స్‌లో 7 శాతం క్లయిమ్‌లు అండర్ పేమెంట్‌గా జరుగుతుంటాయి. 2014 సంవత్సరంలో బీమా కంపెనీలు ఆసుపత్రులకు 58 బిలియన్ డాలర్లు (రూ.3.64 లక్షల కోట్లు) అండర్ పేమెంట్‌గా చేశాయని అక్కడి ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది.
 
 దీన్ని కూడా పేమెంట్ ఇంటిగ్రిటీ సర్వీస్ (పీఐఎస్) విధానంతో విశ్లేషించి.. ఒక్క ఏడాదిలోనే 18 కంపెనీలకు 6 మిలియన్ డాలర్ల బీమా చెల్లింపుల రికవరీ (అండర్ పేమెంట్ రీకవరి) చేసిచ్చాం. ఇందుకు గాను ఇటీవలే ముంబైలో జరిగిన కార్యక్రమంలో 2015 సంవత్సరానికి గాను వైద్య రంగంలో ఇండో అమెరికన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఎక్స్‌లెన్స్ ఇన్నోవేషన్ అవార్డు దక్కింది.
 
 ఈ ఏడాదిలో 55-60 ఆసుపత్రులకు..
 ప్రస్తుతం అమెరికాలోని 19 రాష్ట్రాల్లో.. 22 ఆసుపత్రులు డేటా మార్షల్ సేవలను వినియోగించుకుంటున్నారు. గతేడాది రూ.50 కోట్ల వ్యాపారాన్ని సాధించాం.రూ.6 కోట్ల పెట్టుబడులతో హైటెక్‌సిటీలో మరో డేటా సెంటర్‌ను ప్రారంభించనున్నాం. గతంలో 1.2 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మెడికల్ బిల్లింగ్ కంపెనీ ఫోనిక్స్ మేనేజ్మెంట్ గ్రూప్ (పీఎంజీ)ని కొనుగోలు చేశాం.


