breaking news
infosys award
-
‘ఇన్ఫోసిస్ ప్రైజ్ 2024’.. విజేతలు వీరే
ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ గురువారం ‘ఇన్ఫోసిస్ ప్రైజ్ 2024’ విజేతలను ప్రకటించింది. ఎకనామిక్స్, ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ అనే ఆరు విభాగాలలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న వారి పేర్లను వెల్లడించింది.అవార్డు అందుకున్న వారిలో భారత్‌లోని ప్రముఖ సంస్థలకు చెందిన వారు ఇద్దరు. ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఇద్దరు, వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఒకరు, ఎడిన్బర్గ్ యూనివర్సిటీ నుంచి ఒకరు ఉన్నారు. ఈ అవార్డు కింద 100,000 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు 84 లక్షల, 42 వేలు) నగదు బహుమతిని అందజేయనున్నారు. అవార్డు ప్రదానోత్సవం జనవరిలో జరగనుంది.ఇన్ఫోసిస్ ప్రైజ్ 2024 గెలుపొందిన విజేతలు:1. ఎకనామిక్స్ విభాగంలో.. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అరుణ్ చంద్రశేఖర్2. ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో.. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి శ్యామ్ గొల్లకోట.3. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగంలో.. ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి మహమూద్ కూరియా.4. లైఫ్ సైన్సెస్ విభాగంలో.. పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు చెందిన సిద్ధేష్ కామత్5. మ్యాథమెటికల్ సైన్సెస్ విభాగంలో.. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ నీనా గుప్తా6. ఫిజికల్ సైన్సెస్ విభాగంలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ వేదిక ఖేమానీకి బహుమతి లభించింది.కాగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజినీర్లు సంబంధిత రంగాల్లో విశేష కృషి చేసినందుకుగాను పత్రి ఏటా ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’ను అందిస్తోంది. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్య వంటి ఆరు విభాగాల్లో కృషి చేసిన వారికి ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. ప్రతి కేటగిరి నుంచి గెలుపొందిన విజేతలకు ఒక బంగారు పతకంతోపాటు, ప్రశంస పత్రం, లక్ష డాలర్లు( భారత కరెన్సీ ప్రకారం రూ. 84 లక్షల 40 వేలు), దానికి సమానమైన ప్రైజ్ పర్స్ అందిస్తారు. మానవాళికి మేలు చేసే అత్యుత్తమ పరిశోధనలను గుర్తించడం, దేశంలోని యువ పరిశోధకులకు, ఔత్సాహిక శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలవడమే ఇన్ఫోసిస్ ప్రైజ్ ప్రాథమిక లక్ష్యం.అయితే విదేశాలకు చెందిన విజేతలు బహుమతిని గెలుచుకునే సమయంలో తమకు నచ్చిన ఇండియన్ ఇన్స్టిట్యూట్లలో తగిన సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. దేశంలో గరిష్టంగా రెండు పర్యటనలలో 30 రోజులు గడవాల్సిందిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కోరుతుంది. -
డాక్టర్ మంజులా రెడ్డికి ఇన్ఫోసిస్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: జీవశాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఏటా ఇచ్చే అవార్డుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాల జీ (సీసీఎంబీ) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ మంజులా రెడ్డి ఎంపికయ్యారు. అవార్డు కింద బంగారు పతకం, ప్రశంసాపత్రంతో పాటు లక్ష డాలర్ల నగదు బహుమతి అందిస్తారు. బ్యాక్టీరియా కణం గోడలను, నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు ఆమె పలు పరిశోధనలు చేశారు. తద్వా రా కొత్త కొత్త యాంటీబయాటిక్ మందు ల తయారీకి మార్గం సులువైందని అంచ నా. జీవ రసాయన, జన్యుశాస్త్రాల ఆధారంగా కొన్ని ఎంజైమ్‌ల సాయంతో కణం గోడలు ఎలా రెండుగా విడిపోతాయో డాక్టర్ మంజులా రెడ్డి గుర్తించారు. జీవశాస్త్రాలతోపాటు ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్సెస్, హ్యుమానిటీస్, గణిత, భౌతిక, సామాజిక శాస్త్రాల్లో అద్భుత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలను ఇన్ఫోసిస్ ఏటా అవార్డుతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. -
పాలమూరు వాసికి ఇన్ఫోసిస్ అవార్డు
ఐరాస మాజీ కార్యదర్శి కోఫీ అన్నన్ చేతుల మీదుగా ప్రదానం కొల్లాపూర్ (మహబూబ్‌నగర్), న్యూస్‌లైన్: నానో టెక్నాలజీ రంగంలో విశేష కృషి చేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన వలిపె రాంగోపాల్‌రావు ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ అవార్డును అందుకున్నారు. శనివారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ చేతుల మీదుగా రాంగోపాల్‌రావు ఈ అవార్డును అందుకున్నారు. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఫలితాలనిచ్చే నానో టెక్నాలజీ పరికరాల ఆవిష్కరణలో ప్రతిభ చాటిన రాంగోపాల్రావుకు 2013లో ఈ అవార్డును ప్రకటించారు. అవార్డు కింద రూ. 55 ల క్షల నగదును కూడా అందజేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా 2005లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును కూడా రాంగోపాల్‌రావు అందుకున్నారు. రూ. 100 ఖర్చుతోనే సొంతంగా గుండెజబ్బులను తెలుసుకునే ప్రత్యేక సెన్సర్‌ను ఆయన రూపొందించారు. పోలీసు జాగిలాల సహాయం లేకుండానే పేలుడుపదార్థాలను గుర్తించే ఈ-డాగ్ అనే సెన్సర్నూ ఆవిష్కరించారు. వ్యవసాయ పరంగా రైతులకు ఉపయుక్తంగా ఉండే పలు పరిశోధనలు కూడా కొనసాగిస్తున్నారు.