Indian freedom movement
-
కెప్టెన్‌గా తొలి మహిళ
స్ఫూర్తి లక్ష్మీ సెహగల్ కెప్టెన్ లక్ష్మి... లక్ష్మీ సెహగల్... పేర్లు వినే ఉంటాం. ఆమె భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ధీరవనితల్లో ఒకరు. ఆమె పుట్టింది కేరళలోని మలబార్లో. తండ్రి స్వామినాథన్, తల్లి అమ్ముకుట్టి. ఆమె డాక్టర్ కావాలనే కోరికతో ఎంబిబిఎస్ చదివారు. చెన్నైలోని ట్రిప్లికేన్‌లో కస్తూర్బా గాంధీ ఆసుపత్రిలో డాక్టర్‌గా సేవలందించారు. సింగపూర్ వెళ్లడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ ఇండియన్ నేషనల్ ఆర్మీ సభ్యుల పరిచయడం, సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలు వినడంతో ఆమె జాతీయో ద్యమం పట్ల ప్రభావిత మయ్యారు. సింగ పూర్లో ఆమె ఆసుపత్రి స్థాపించి భారతదేశం నుంచి సింగపూర్‌కి వలస వెళ్లి కూలి పనులు చేసుకుం టున్న కుటుంబాలకు వైద్యం చేశారు. సుభాష్ చంద్రబోస్ సైన్యంలోకి మహిళలను ఆహ్వానిం చినప్పుడు లక్ష్మి ముందుకొచ్చారు. అలా భారతీయ ఆర్మీలో పేరు నమోదు చేసుకున్న తొలి మహిళ ఆమె. లక్ష్మి స్వామినాథన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ రెజిమెంట్ ఏర్పాటైంది. ఝాన్సి రెజిమెంట్‌కు రాణి అని, కెప్టెన్ లక్ష్మి అని ఆమె గుర్తింపు పొందారు. ప్రేమ్ కుమార్ సెహగల్‌ను వివాహం చేసుకోవడంతో కెప్టెన్ లక్ష్మి సెహగల్ అయ్యారు. కాన్పూర్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. స్వాతంత్య్ర వచ్చిన తర్వాత ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత ఆమె రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు. ఆ పదవికి పోటీ చేసిన తొలి మహిళ లక్ష్మీసెహగల్. 2012లో వార్ధక్యం కారణంగా అనారోగ్యంతో మరణించారు. మరణానంతర క్రతువుల మీద ఆమెకు నమ్మకం లేదు. అందుకే తన దేహాన్ని కాన్పూర్‌లోని మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం ఇవ్వవలసిందిగా ముందుగానే సూచించారామె. కెప్టెన్ లక్ష్మి గౌరవార్థం కాన్పూర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆమె పేరుపెట్టారు. సుభాష్ చంద్రబోస్‌తో... -
సివిల్స్‌లో భారత స్వాతంత్రోద్యమ ప్రాధాన్యం ఏమిటి?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: ఈ పాఠ్యాంశాన్ని ఎలా అధ్యయనం చేయాలి? - టి.ఉమారాణి, సికింద్రాబాద్ సివిల్స్ సిలబస్‌లో భారత స్వాతం త్య్రోద్యమం ముఖ్య పాఠ్యాంశం. గాంధీయుగం, స్వాతంత్య్రం అనంతరం యుగాలపై అభ్యర్థులకు అవగాహన అవసరం. ముఖ్యంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో వచ్చిన గ్రంథాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కింది ప్రశ్నను పరిశీలించండి. 1. List–I, List–IIలలో గ్రంథాలు, గ్రంథకర్తలను జతపర్చండి? (2001, 2008, 2011 సివిల్స్) List–I a) సుభాష్ చంద్రబోస్ b) అబుల్ కలాం ఆజాద్ c) రాజేంద్రప్రసాద్ d) జవహర్ లాల్ నెహ్రూ List–II 1) భారతదేశం స్వాతంత్య్రం సాధిస్తుంది. 2) భారతదేశం ఎందుకంటే? 3) భారతదేశం స్వాతంత్య్రానికై పోరాటం 4) భారతదేశ విభజన A B C D 1) 1 4 3 2 2) 3 2 4 1 3) 3 1 4 2 4) 4 1 2 3 సమాధానం - 3 - వివరణ: ఆజాద్ రాసింది ‘భారతదేశం స్వాతంత్య్రం సాధిస్తుంది’ (ఇండియా విన్‌స ఫ్రీడం). ఏప్రిల్ 15, 1946లో రచించాడు. సుభాష్ చంద్రబోస్ - భారతదేశం స్వాతంత్య్రం కోసం పోరాటం, రాజేంద్రప్రసాద్ - భారతదేశ విభజన, నెహ్రూ - భారతదేశం ఎందుకంటే’ గ్రంథాలు రచించారు. ఇవన్నీ ‘ఇండియా’పై వచ్చాయి. ఇండియా స్ట్రగుల్ ఫర్ ఫ్రీడం, ఇండియా డివెడైడ్, వైదర్ ఇండియా. కాబట్టి ఇలా ఇండియాతో ముడిపడి ఉన్న గ్రంథాలన్నీ ఒకే చోట రాసుకోవడం ముఖ్యం. - 2000, 2007లలో స్వాతంత్య్ర ఉద్యమ కాలం నాటి సాంస్కృతిక కట్టడాలపై అడిగిన ప్రశ్న చాలా లోతైందిగా గమనించాలి. 2. వీటిలో సరైంది ఏది? 1) విక్టోరియా మెమోరియల్ హాల్ (కలకత్తా) - హార్బర్ట బేకర్ 2)సెంట్రల్ సెక్రటేరియట్ (న్యూఢిల్లీ) - ఎమర్సన్ డబ్ల్యూ 3) గేట్ వే ఆఫ్ ఇండియా (ముంబాయి) - ఆర్.ఎఫ్. చిస్లోమ్ 4) మద్రాస్ విశ్వ విద్యాలయ సెనేట్ హాల్ -ఆర్.ఎఫ్. చిస్లోమ్ 5) ‘చండీగడ్’ నగర నిర్మాత - ఎడ్విన్ లూయీటిక్స్ సమాధానం - 5 వివరణ: ఎడ్విన్ లూయీటిక్స్ ఢిల్లీలోని ‘పార్లమెంట్ భవనం, చండీగడ్ పట్టణం నిర్మించాడు. విక్టోరియా మెమోరియల్ హాల్‌ను (డబ్ల్యూ ఎమర్సన్), సెంట్రల్ సెక్రటేరియట్ భవనాన్ని (హార్బర్ట బేకర్), గేట్ వే ఆఫ్ ఇండియా (జార్జీ క్లార్క), మద్రాస్ విశ్వ విద్యాలయం (ఆర్.ఎఫ్. చిస్లోమ్)లు నిర్మించారు. దీన్ని బట్టి ప్రశ్నలను ఎంత లోతుగా అడుగుతున్నారో అర్థం చేసుకోవాలి. - స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో వచ్చిన గిరిజన, రైతు, సాయుధ పోరాటాలపై(20వ శతాబ్దంలో) కూడా సంపూర్ణ అవగాహన ఉండాలి. ఉదా: 2009, 1999, 2011, 2001(సివిల్స్)లో అడిగిన కింది ప్రశ్నను పరిశీలించండి. 3. వీటిలో సరైంది ఏది? 1) పత్తర్‌ఘట్ ఉద్యమం - 1898 హైదరాబాద్ 2) తెభాగా ఉద్యమం - 1924 బీహార్ 3) ఏకా ఉద్యమం - 1912 పంజాబ్ 4) మోప్లా ఉద్యమం - 1921 కేరళ సమాధానం - 4 వివరణ: మోప్లా ఉద్యమం సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా కేరళలో 1921లో హాజి మహ్మద్ నాయకత్వంలో ముస్లిం రైతులు చేసిన గొప్ప తిరుగుబాటు. ఇందులో వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఈ ప్రాంతాన్ని గాంధీ సందర్శించకపోవటం అనేక విమర్శలకు తావిచ్చింది. పత్తర్‌ఘాట్ ఉద్యమం 1898-99లలో ‘అస్సాం’ ప్రాంతంలోని గిరిజనులు ఎల్జిన్-2 రాజప్రతినిధి కాలంలో తిరుగుబాటు చేశారు. 368మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. గొప్ప గిరిజన ఉద్యమంగా ‘పత్తర్‌ఘాట్’ సంఘటన చరిత్రలో నిల్చిపోయింది. ‘తెబాగా’ ఉద్యమం 1945-1946లో బెంగాల్ రాష్ర్టంలో వచ్చిన సాయుధ రైతాంగ పోరాటం, ‘తెలంగాణలో’ కూడా ఇదే తరహా ఉద్యమం 1946-51 మధ్య కాలంలో జరిగింది. ‘ఏకా ఉద్యమం’ 1921లో ఉత్తరప్రదేశ్‌లో వచ్చింది. దీన్ని ‘మాదరిపాసి’ సితాపూర్ జిల్లాలో నిర్వహించారు. డాక్టర్ అజయ్ రాయ్ 1971 తెబాగా ఉద్యమంపై ముఖ్య విషయాలు సేకరించాడు. గాంధీ కూడా ఈ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించాడు. 4. వీటిలో సరైంది? 1) బార్డోలి సత్యాగ్రహం - 1928 గుజరాత్ (వల్లభాయ్ పటేల్) 2) ఉత్కల్ ప్రోవెన్షియల్ కిసాన్ సభ (మాలతీ చౌదరి) 3) ఏటియాల నో-రెంట్ స్ట్రగుల్ - భగవాన్ సింగ్ ఉద్యమం 4) బీహారీ కిసాన్ సభ (యదునందన్ శర్మ) సమాధానం - 1 వివరణ: 1928లో గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ‘బార్డోలి’ సత్యాగ్రహం జరిగింది. ఈ సందర్భంగానే పటేల్‌కు ‘సర్దార్’ అనే బిరుదును గాంధీజీ ఇచ్చారు. మాలతీ చౌదరి -ఉత్కల్ కిసాన్ సభ, కరుణసింధు రాయ్ ‘సుర్మావ్యాలీ’ ఉద్యమంలో భాగంగా నో-రెంట్ ఉద్యమం నిర్వహించారు. భగవాన్‌సింగ్ లాంగోవాలా ‘ముజారా’ ఉద్యమం, యదునందన్ శర్మ ‘బీహారీ కిసాన్ సభ’లు స్థాపించారు. 5. ‘ముస్లింలీగ్’ పార్టీ స్థాపకులెవరు? (1999, 2002 - సివిల్స్) 1) హస్రఫ్ మొహానీ 2)యూసుఫ్ మెహారోలి 3)ఫజుల్-హుక్ 4)చౌదరి ఖాతి ఖ్వాజామన్ సమాధానం: 4 వివరణ: హస్రఫ్ మొహానీ ప్రసిద్ధ గజల్స్ కవి ‘పూర్ణ స్వరాజ్, ఇంక్విలాబ్ జిందాబాద్’ మొదలైన పదాల సృష్టికర్త. యూసుఫ్ మొహారోలి కాంగ్రెస్సోషలిస్ట్ స్థాపకులు. ఫజుల్ హుక్ బెంగాల్ ప్రజాపార్టీ స్థాపకులు. పార్టీలు -స్థాపకులు, వాటి ముఖ్య నాయకులు లాంటి ప్రశ్నలపై అవగాహన పెంచుకోవాలి. అలాగే తీవ్రవాద సంస్థలు వాటి స్థాపకులు, వారు పాల్గొన్న కుట్ర కేసులపై కూడా కచ్చితమైన సమాచారం తెలుసుకోవాలి. 6. ‘అరబిందోఘోష్’కు సంబంధించిన కుట్రకేసు ఏది?(2000, 2001 సివిల్స్) 1) అలీపూర్ కుట్రకేసు 2) లాహోర్ కుట్రకేసు 3) కాకోరి కేసు 4) చిట్టగాంగ్ కేసు సమాధానం: 1 వివరణ: అరబిందో ఘోష్ ‘భందేమాతరం’ పత్రిక ఎడిటర్, సావిత్రి అనే గ్రంథ రచన చేశాడు. ఇంకా ‘న్యూలాంప్స్ ఫర్ ఓల్డ్’ వ్యాసాలు రచించాడు. అలీపూర్ కుట్రకేసులో ముద్దాయిగా ముద్రపడి, చివరికి పాండిచ్చేరిలో (1908) సన్యాస జీవితం గడుపుతూ మరణించాడు. (1929) లాహోర్ కుట్రకేసులో ప్రధాన ముద్దాయిలు 12 మంది. అందులో ముఖ్యమైన వారు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, భతుకేశ్వర్దత్లు. చివరికి భతుకేశ్వర్ మినహా మిగతా వారికి 1931 మార్చి 23న ఉరిశిక్ష విధించారు. కాకోరి రైల్వే దోపిడీ కేసులో అశ్వయుల్లాఖాన్ ముద్దాయి. చిట్టగాంగ్ దోపిడీలో ‘మాస్టర్’గా ప్రసిద్ధి చెందిన సూర్యసేన్ ప్రధాన ముద్దాయి. ఇతడు ‘పోగ్రామ్ ఆఫ్ డేత్’ పేరుతో అనేక వ్యాసాలు రచించాడు. - - ఇన్పుట్స్: డా॥పి. మురళీ, ప్రొఫెసర్ నిజాం కాలేజీ, హైదరాబాద్ -
తెలుసుకోగలరా?
-
చెప్పగలరా?
-
చెప్పుకోండి చూదాం
-
చెప్పుకోండి చూదాం...
-
ఆటుపోట్ల గతం... వెలుగులేని చరితం...
60 ఏళ్ల పాటు జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు భారత స్వాతంత్య్రోద్యమంలో ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసిన ఆంధ్ర ప్రజలను నిలువునా ముంచి మద్రాసును తమిళులకు కట్టబెట్టింది. ఆంధ్ర ప్రాంత ప్రజలకు, భారత జాతీయ కాంగ్రెస్‌కు ఉన్న అనుబంధం లోతైనది. 1885లో ఆ సంస్థ ఏర్పడినప్పటి నుంచి తెలు గువారు తమ సేవలు అందించారు. 1891 లోనే ఆంధ్రుడైన పనప్పాకం అనంతాచార్యు లు అధ్యక్షడయ్యాడు. 1918లో న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన ఆంధ్ర కాంగ్రెస్ ఆవి ర్భవించింది. నిజానికి అప్పటికే, 1903లోనే గుంటూరు యువజన సాహితి ఆధ్యర్యంలో ప్రత్యేక రాష్ట్రం ఆలోచన మొదలైంది. 1913 లో బాపట్లలో ఆంధ్రమహాసభ ఇందుకు శంఖం పూరించింది. స్వాతంత్య్రోద్యమంతో సమాంతరంగా ఈ ఉద్యమం కూడా నడిచిం ది. భారత జాతీయ కాంగ్రెస్ నేతలు అటు జాతీయ భావంతో, ఇటు ఆత్మగౌరవం నినా దంతో ఈ ఉద్యమంలో భాగం పంచుకు న్నారు. విజయనగర రాజ్యంలోని చంద్రగిరి సామంతరాజు చెన్నపట్నం అనే గ్రామాన్ని బ్రిటిష్ వారికి వ్యాపార నిమిత్తం అప్పగిం చాడు. దీని అభివృద్ధిలో తమిళుల పాత్ర ఎంతో, తెలుగువారి పాత్ర కూడా అంతే. తెలుగువారు 190 సంవత్సరాల పాటు పన్ను లు చెల్లించారు. మద్రాసు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆంధ్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటి 1920లో తీర్మానించింది. 1938లో ఆంధ్రమహాసభ కూడా మరోసారి అదే అం శాన్ని తీర్మానం రూపంలో వెల్లడించింది. కానీ నాటి మద్రాసు ముఖ్యమంత్రి సి. రాజగోపా లాచారి, తమిళ కాంగ్రెస్ ప్రముఖులు దీనిని వ్యతిరేకించారు. ఆ అంశం మీద నియమించిన ధార్ కమి షన్ (1948 జూన్ 17) కూడా భాషాప్రయుక్త రాష్ట్రాలు దేశ శ్రేయస్సుకు భంగకరమని నివే దించింది. ఇది ఆంధ్రులకు ఆశాభంగాన్ని, ఆగ్రహాన్ని కలిగించింది. కొన్ని పరిణామాల తరువాత 1949లో నెహ్రూ అధ్యక్షతన జేవీపీ కమిటీ ఏర్పాటైంది. ధార్ కమిషన్‌లోని అం శాలను పునః సమీక్షించి తన నివేదికను కాం గ్రెస్ వర్కింగ్ కమిటీకి సమర్పించింది. మద్రా స్ నగరాన్ని మినహాయించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆంధ్ర రాష్ర్ట నిర్మాణానికి మద్రాసు ప్రభుత్వంతో పాటు, తమిళ కాంగ్రెస్ నేతలు తమ అంగీకా రాన్ని తెలిపారు. టంగుటూరి ప్రకాశం నాయ కత్వంలో ఆంధ్ర కాంగ్రెస్ ప్రతినిధులు మద్రా సును వదులుకోవటానికి వ్యతిరేకించారు. మద్రాస్‌లో తమిళుల శాతం ఎక్కువగా ఉన్నం దున మద్రాస్‌ను ఆంధ్రులకు ఇవ్వలేమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అందరినీ ఒప్పించి ఆంధ్ర రాష్ర్ట ఏర్పాటుకు మార్గం ఏర్పరిచింది. 1950 నాటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారరాజా అధ్యక్షతన విభజన కమిటీ ఏర్పాటు ఏర్పడింది. కొత్త రాజధాని ఏర్పడే వరకు మద్రాసే రాజధానిగా ఉండాలని ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు పట్టుపట్టినా తమిళులు ఒప్పుకో లేదు. చివరకు తన అసమ్మతిని లిఖిత పూర్వ కంగా రాసి ప్రకాశం పంతులు విభజన కమిటి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీన్ని సాకుగా తీసుకుని భారత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని వాయిదా వేసింది. కేంద్ర వైఖరికి, ఆంధ్ర కాంగ్రెస్ వైఫల్యానికి నిరస నగా 1952 మద్రాసు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రులు ఓడించారు. అప్ప టికే సహనం కోల్పోయి, పొట్టి శ్రీరాములు రాష్ర్ట సాధనకు 1952 అక్టోబర్ 19న మద్రా సులో ఆమరణ నిరాహారదీక్షకు పూనుకు న్నారు. 58 రోజుల నిరశన తరువాత ప్రాణ త్యాగం చేశారు. ఆంధ్రుల ఆవేశం కట్టలు తెం చుకుంది. విధ్వంసం జరిగింది. దీనికి లొంగి ఢిల్లీ ఆంధ్ర రాష్ర్ట తాత్కాలిక రాజధానిగా మద్రాసును ప్రకటిస్తే తమిళ కాంగ్రెస్ నాయ కుల రాజీనామా చేస్తారని రాజాజీ నెహ్రూను బెదిరించాడు. ఈ పరిస్థితుల్లో మద్రాసును మినహాయించి వివాదాస్పదం కాని తెలుగు ప్రాంతాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రం నిర్మించ డానికి భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు 1952 డిసెంబర్ 19న నెహ్రూ లోక్‌సభలో ప్రకటించారు. ప్రత్యేకాంధ్ర నిర్మాణంలో ఉత్ప న్నమయ్యే ఆర్థిక, పాలనాపరమైన సమస్య లను పరిష్కరించడానికి కైలాస్నాథ్ వాం చూని భారత ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా నియమించింది. ఆయన తన నివేదికను 1953 మార్చిలో సమర్పించారు. దాని ఆధా రంగా చేసుకుని టంగుటూరి ప్రకాశం పం తులు ముఖ్యమంత్రిగా, కర్నూలు రాజధా నిగా, 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవ తరించింది. 60 సంవత్సరాలు జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు భారత స్వాతంత్య్రోద్యమంలో ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసిన ఆంధ్ర ప్రజలను నిలువునా ముంచి మద్రాసును తమిళులకు ఇచ్చివేసింది. మద్రాసును సాధిం చడంలో ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు ఘోరం గా విఫలమయ్యారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్ నిర్మాణం కోసం 1953లో ఫజల్ అలీ కమిషన్ 1953 డిసెంబర్ 30న తన నివేదికను సమర్పించింది. దీని ప్రకారం తెలంగాణ ఆం ధ్ర రాష్ట్రంలో విలీనం చేయడం వలన ఉభయ ప్రాంతాల వారికి ఎన్నో ప్రయోజనాలున్నా యని చెప్పిన సిఫార్సు మేరకు 1956లో ఆంధ్ర-తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పంద షరతుల అంగీకారం మేరకు హైద రాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని కలుపుతూ 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. - డాక్టర్ కె. చిట్టిబాబు