breaking news
illigal business
-
‘గుట్కా’ చీకటి వ్యాపారులు అప్రమత్తం
నగరంలో ఉత్పత్తి, సరఫరా నిలిపివేత పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తూ గుట్కా, పాన్‌మసాలా తయారీ, పంపిణీ, నిల్వలపై ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాలపై అప్రమత్తమైన వ్యాపారులు, హోల్‌సేల్ డీలర్లు నగరంలో రిటైల్ పాయింట్లకు సరఫరాను పూర్తిగా నిలిపేశారు. దీంతో గుట్కా ధర అమాంతం పెరిగిపోయింది. కాగా, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో నగరంలో గుట్కా సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించిన వ్యాపారులు తమ లాభాల్లో అందరికీ వాటాలు ఇస్తూ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఆయా పార్టీల పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే 5 రోజుల పాటు గుట్కా తయారీ, హోల్‌సేల్ సరఫరాను నిలిపేసి, ఈ లోగా అన్ని పరిస్థితులు చక్కబెట్టుకోవాలన్న ఆలోచనలో వీరు ఉన్నట్టు సమాచారం. -
హైవేపై గమ్మత్తుగా..
జిల్లా మీదుగా విచ్ఛలవిడిగా గంజాయి రవాణా దొరికితేనే దొంగ.. లేకపోతే కాసుల వర్షమే.. ఇటీవల కాలంలో ఎక్కువైన సరుకు తరలింపు గంజాయి వ్యాపారం అక్రమార్కులను అడ్డదారిలో అందలమెక్కిస్తోంది. ఒడిశా–విశాఖ సరిహద్దుల్లో ఎక్కువగా పండించే ఈ పంటను రాష్ట్రాల హద్దులు దాటిస్తే.. వారి పంట పండినట్టే. ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయల విలువైన గంజాయి రవాణాకు 16వ నంబరు జాతీయ రహదారి రాచమార్గంగా మారింది. పోలీసులు అడపాదడపా కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, గంజాయి రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. – జగ్గంపేట జిల్లాలో తుని నుంచి మొదలు రావులపాలెం వరకూ హైవేపైన, ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి యథేచ్ఛగా రవాణా అవుతోంది. తాజాగా కడియం మండలం జేగురుపాడులో లారీ, వ్యాన్లపై భారీఎత్తున తరలిస్తున్న గంజాయి పట్టుబడడం పోలీసు వర్గాలనే విస్మయపరిచింది. సుమారు నాలుగు టన్నుల వరకున్న ఈ సరుకు విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. గంజాయి సాగు, రవాణా తీరిది తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పరిధిలో గంజాయిని విరివిగా పండిస్తున్నారు. ఈ ప్రాంతంలోని కుర్మనూరు, నిమ్మనూరు, రాశిబేడ, గిల్లమడుగు, సన్యాసిగూడ, అల్లూరుకోట, గుర్రలూరు, దంతుగూడ, పప్పులూరు ప్రాంతాల్లో ఏటా రెండు విడతలుగా గంజాయి పండిస్తున్నారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు మొదటి పంట, డిసెంబర్ నుంచి మే నెల వరకు రెండో పంటను పండిస్తారు. ఆంధ్రా, తెలంగాణతో పాటు తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఈ ప్రాంతానికి చెందిన గిరిజనులకు ప్రలోభాలకు గురిచేసి, ముందుగా పెట్టుబడులు పెట్టి గంజాయి పండించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో ఈ ప్రాంతంలో శీలావతి, కాడ, కల్లి అనే మూడు రకాల గంజాయిని పండించేవారు. కాలక్రమంలో కాడ, కల్లి రకాలకు ధర లేకపోవడంతో, ప్రస్తుతం శీలావతి గంజాయిని మాత్రమే పండిస్తున్నారు. పండిన గంజాయిని మిషన్ల ద్వారా 2, 5, 10 కిలోల చొప్పున ప్యాకెట్లు, బస్తాల్లో నింపి, ఒడిశా, తూర్పుగోదావరి సరిహద్దుల్లో ప్రయాణిస్తున్న సీలేరు నది మధ్య ఏర్పాటు చేసుకున్న స్టాక్ పాయింట్ వద్దకు చేరుస్తారు. అక్కడి నుంచి ఆర్డర్‌పై విశాఖ జిల్లా సీలేరు, తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి నడుమనున్న రహదారి వద్దకు తరలిస్తారు. అక్కడి నుంచి గంజాయిని కావళ్ల ద్వారా కాలినడకన చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని సుకుమామిడి, లక్కవరం జంక్షన్ల వద్దకు తరలిస్తారు. అనంతరం గంజాయిని వాహనాల ద్వారా చింతూరు, భద్రాచలం మీదుగా విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు తరలిస్తుంటారు. క్షేత్రస్థాయిలో కిలో గంజాయి రూ.200 నుంచి రూ.500 వరకు కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు, దానిని స్మగ్లింగ్ మార్కెట్‌కు తరలించే సరికి కిలో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తారు. పోలీసుల పాత్రే కీలకం గంజాయి రవాణాను అడ్డుకోవాల్సిన ప్రధాన బాధ్యత ఎక్సైజ్ శాఖపై ఉండగా, ఏజెన్సీలో ఎక్కడా ఆ శాఖ అధికారులు గంజాయిని పట్టుకున్న దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో గంజాయిని పట్టుకోవడంలో పోలీసు శాఖ ప్రధానపాత్ర పోషిస్తోంది. గంజాయి రవాణాపై గట్టి నిఘా పెట్టిన పోలీసులు తమ కొరియర్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ గుట్టు లాగి, నిందితులను పట్టుకున్నారు. ప్రలోభాలకు గురై.. గంజాయి రవాణా సమయంలో పట్టుబడుతున్న నిందితులంతా కేవలం కొద్దిపాటి సొమ్ము కోసం రవాణా చేసేందుకు ప్రలోభాలకు గురైనవారే. అసలు నిందితులైన బడా స్మగ్లర్లు మాత్రం దర్జాగా తప్పించుకుంటున్నారు. గంజాయిని పండిస్తున్న ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పరిధి అంతా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో పోలీసులు, అధికారుల నిఘా తక్కువగా ఉండడంతో, గంజాయి సాగు విరివిగా సాగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న స్మగ్లర్లు ఈప్రాంత గిరిజనులకు డబ్బు ఆశచూపి, గంజాయి సాగు చేయిస్తున్నారు. వినూత్న పద్ధతులు గంజాయి రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లు రవాణా కోసం వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. వాహనాల్లో పలు మార్పులు చేసి, తాము పట్టుబడకుండా తప్పించుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తవుడు, ధాన్యం, కలప అడుగున గంజాయి ప్యాకెట్లు పెట్టి రవాణా చేయడం పాత పద్ధతి. ఇప్పుడు వాహనాల అడుగు భాగంలో అరలుగా తయారు చేసి, అందులో గంజాయిని పెట్టడం, జీపులు, కార్లలో సీలింగ్‌కు అటకలా తయారుచేసి, అందులో గంజాయి పేర్చి రవాణా చేయడం పరిపాటిగా మారింది. చిన్నపాటి స్మగ్లర్లు గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి, నడుముకు కట్టుకుని రవాణా చేస్తున్నారు. హైవేపై ప్రత్యేక నిఘా జాతీయ రహదారిపై గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాం. ప్రత్యేక బృందాన్ని నియమించాం. కోటనందూరు, తుని రైల్వే స్టేషన్, కత్తిపూడి సెంటర్ తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. గస్తీలో మొబైల్ చెకింగ్ చేస్తున్నాం. – రాజశేఖర్, డీఎస్పీ, పెద్దాపురం