breaking news
iftar meal
-
లండన్ లో ఘనంగా తెలంగాణ జాగృతి ఇఫ్తార్ విందు
లండన్: తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ తొలిసారిగా లండన్ లోని ఈస్ట్ హంలో ఘనంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. లండన్ నలుమూలల నుంచి ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా ఇఫ్తార్ విందు లో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో నిష్ఠతో ఆచరించే రోజ విరమించే సాయంకాల సమయాన ఇఫ్తార్ విందును జాగృతి సభ్యులతో కలిసి జరుపుకున్నారు. జాగృతి యూకే ముస్లిం మైనారిటీ ఇంచార్జి సలాం యూసఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర నిర్వహాధికారిగా కేంద్రంలో పనిచేస్తున్న శ్రీరామచంద్ర తేజావత్ తన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శ్రీరామచంద్ర తేజావత్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఖండాంతరాలలో కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా జాగృతి యొక్క ఆవిర్భావం, అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కృషి గురుంచి రామచంద్ర గుర్తు చేశారు. మరో అతిథి, అక్కడి కౌన్సిలర్ పాల్ సథిరిసన్ కూడా పాల్గొని పరమత సహనంతో జాగృతి చేస్తున్న ఈ కార్యక్రమం తనకెంతో నచ్చిందన్నారు. జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ బలమూరి మాట్లాడుతూ.. నూతన కార్యవర్గంతో ఇది రెండో కార్యక్రమమని, ఎంతో విజయవంతంగా టీం యొక్క సమిష్టి కృషితో ముందుకు వెళ్తున్నాం అన్నారు. భవిష్యత్తులో చక్కటి కార్యక్రమాలతో, సంక్షేమ పనులతో పెద్ద ఎత్తున లండన్ తో పాటు ఇతర నగరాల్లో కూడా విస్తరిస్తామని చెప్పారు. మైనార్టీ ఇంచార్జి సలాం యూసఫ్ ముస్లిం సోదరులకు అభివాదం తెలుపుతూ తన ప్రసంగంలో తెలంగాణ అంటే బతుకమ్మ, బోనాలతో పాటు రంజాన్ కూడా విశిష్టమని పేర్కొన్నారు. పవిత్ర మాసంలో చేసే ఈ విందుని జాగృతి తరుఫున ముస్లిం సోదరులతో కలిసి చేసుకోవడం చాలా సంతృప్తిగా తెలంగాణలో ఉన్న భావన కలిగిందన్నారు. ముస్లిం సోదరుల ప్రార్థనలతో, ఆలింగినాలతో అందరు కుటుంబ సమేతంగా సంతోషంగా ఈ వేడుకని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి యూరప్ అధ్యక్షుడు సంపత్ ధన్నామనేని, జాగృతి యూకే ఉపాధ్యక్షుడు పావని గణేష్, సుష్మ జువ్వాడి, శ్రవణ్ రెడ్డి, కార్యదర్శి సంతోష్ ఆకులతో పాటు ఇతర జాగృతి యూకే కమిటీ సభ్యులు సునీల్ మెహరీర్, సలాం యూసఫ్, వంశీ మునిగంటి, లండన్ గణేష్, రఘు జక్కుల, రమేష్ పాల్తేపు, గణేష్ మల్యాల, వెంకట్ బాలగోని, వంశీ తులసి, వంశీ సముద్రాల, ప్రణీత్ కుమార్ కందుకూరి, లక్ష్మి నర్సింహా రెడ్డి, రాంచందర్ రాపోలు, మానస టేకుమట్ల, విద్య బాలగోని, శ్రావణి బలమూరి, మాధవి రెడ్డి, దీపికా, దీప్తి సముద్రాల, అలీన స్ట్రాట్, రాధికా మునిగంటి తదితరులు పాల్గొన్నారు. -
ఇఫ్తార్ వికటించి 900 మందికి అస్వస్థత..
బాగ్ధాద్: ఇరాక్‌లో రంజాన్ మాసం సంధర్భంగా ఇచ్చిన ఇఫ్తార్ విందు వికటించి ఇద్దరు మృతి చెందగా వందల మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మోసుల్ నగరంలోని క్యాంపులో చోటుచేసుకుంది. ఫుడ్ పాయిజన్ ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. రంజాన్ మాసం సందర్భంగా ఖతారీ హ్యూమనిరేషన్ అనే ఆర్గనైజేషన్ ఇప్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ విందులో పాల్గొన్న సుమారు 900 మంది తీవ్ర అస్వస్థతకులోనయ్యారు. వీరిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఆహారం తిన్న క్యాంపు జనం వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. ఇఫ్తార్ విందు వికటించడం వలన డిహైడ్రేషన్ గురయ్యారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు అందుతున్నాయి. ఇప్తార్ విందులో పెట్టిన చికెన్, బీన్స్ ఆహారాన్ని ఖతారీ చారిటీ ఇర్భిల్ నగరంలోని ఓ రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ట్రస్టుకు సంబంధించిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఇర్భిల్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య యుద్దం జరుగుతుంది.