breaking news
Iconic Towers
-
ముఖ్యనేత.. ‘ఐకానిక్’ మేత
రాజధాని ప్రాంతంలో ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయాన్ని అమాంతం పెంచేయడమే కాకుండా.. ఆ పనులను పాత ‘సిండికేట్’ సంస్థలకే కట్టబెట్టేలా ‘ముఖ్యనేత’ చక్రం తిప్పారు. అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేయడంతోపాటు పాత కాంట్రాక్టు సంస్థలనే తెరపైకి తెచ్చి.. పోటీదారులు లేకుండా పక్కా వ్యూహ రచన చేశారు. నచ్చిన సంస్థలకే అధిక ధరలకు టెండర్లు కట్టబెట్టి భారీ దోపిడీకి తెరలేపారు. సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో సిండి‘కేటు’ లాలూ‘ఛీ’ పర్వం ఐకానిక్ టవర్ల టెండర్ల సాక్షిగా మరోసారి బట్టబయలైంది. మూడు ప్యాకేజీల కింద ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలిచింది. ఆ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయకముందే.. 2018లో ఆ పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలకే ఇప్పుడూ కట్టబెట్టేలా ‘ముఖ్యనేత’ పథకం పన్నారు. తద్వారా పాత సంస్థలకే మూడు ప్యాకేజీలను అధిక (ఎక్సెస్) ధరకు కట్టబెడుతూ సీఆర్డీఏ సోమవారం ఆమోద ముద్ర వేసింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.159 కోట్ల భారం పడుతుంది. ఆ మేరకు ఖజానాను కాంట్రాక్టు సంస్థలకు దోచిపెట్టి నీకింత.. నాకింత అంటూ పంచుకుతినడానికి ముఖ్యనేత సిద్ధమయ్యారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్ విధానంలో ఐదు ఐకానిక్ టవర్లు నిర్మించేలా పోస్టర్ అండ్ పార్టనర్స్–జెనిసిస్ ప్లానర్స్–డిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు 2018లో డిజైన్లు రూపొందించాయి. ఆ పనులకు టెండర్లు పిలిచి 2018 ఏప్రిల్‌లోనే కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. పునాదులు అప్పట్లోనే పూర్తయ్యాయి. ఇప్పుడు మిగిలిన పనులకు సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. మూడు ప్యాకేజీలకూ మూడు సంస్థలే⇒ సచివాలయం 1, 2 ఐకానిక్ టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.1,423.07 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. సచివాలయం 3, 4 ఐకానిక్ టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.1,247.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ ఐకానిక్ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.844.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ⇒ ఈ టెండర్లలో మూడు ప్యాకేజీలకూ ముఖ్యనేత ఏర్పాటుచేసిన సిండికేటులోని ఎన్సీసీ, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలే బిడ్లు దాఖలు చేశాయి. ⇒ 1, 2 ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 4.50 శాతం అధిక ధరకు అంటే రూ.1,487 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన షాపూర్జీ పల్లోంజీ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.275.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 1, 2 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,762.70 కోట్లు. ఇదే పనులను 2018లో రూ.932.46 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో ఇదే షాపూర్జీ పల్లోంజీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే ఈ టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.830.24 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.3, 4 ఐకానిక్ టవర్లు నిర్మాణంలోనూ ఇలా..3, 4 ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 4.57 శాతం అధిక ధరకు అంటే రూ.1,304 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.241.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 3, 4 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,545.7 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.784.62 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో ఎల్ అండ్ టీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే 3, 4 టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.761.08 కోట్లు పెరిగినట్లు తేటతెల్లమవుతోంది.జీఏడీ టవర్ పనులూ అధిక ధరకే..జీఏడీ టవర్ నిర్మాణ పనులను 4.49 శాతం అధిక ధరకు అంటే రూ.882 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.163.60 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే ఆ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,045.6 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.554.06 కోట్లకు ఇదే ఎన్సీసీ సంస్థకు సీఆర్డీఏ అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే జీఏడీ టవర్ కాంట్రాక్టు వ్యయం రూ.491.54 కోట్లు పెరిగింది. అప్పు చేసి.. దోచిపెట్టి.. పంచుకు తినేలాఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని 2018లోనూ.. ఇప్పుడూ డయాగ్రిడ్ విధానంలోనే నిర్మించేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అప్పటితో పోల్చితే సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అదీ నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే కృష్ణా నదిలో కావాల్సినంత దొరుకుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2018తో పోల్చితే ఐకానిక్ టవర్ల కాంట్రాక్టు విలువ ఇప్పుడు పెరగడానికి వీల్లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. కానీ.. ఇదే ఐకానిక్ టవర్ల పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలకు అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,082.86 కోట్లు పెరిగింది. ఐదు ఐకానిక్ టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే.. చదరపు అడుగు రూ.8,340.20 చొప్పున పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. కానీ.. ఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని చదరపు అడుగు రూ.8,340.20 చొప్పున కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడంపై ఇంజినీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో వంటి సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి.. వాటిని కాంట్రాక్టు సంస్థలకు దోచిపెడుతూ.. నీకింత నాకింత అంటూ ముఖ్యనేత పంచుకుతినేలా కుట్ర పన్నడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.నిర్మాణం పూర్తయ్యే సరికి తడిసిమోపెడుతెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు అడ్డంగా దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయడం కోసం 6 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసి సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి ఐటీ శాఖకు అప్పట్లో పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి పథకం రచించారని.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి కాంట్రాక్టు వ్యయం ఇంకెంతకు పెరుగుతుందోనని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
అవినీతి 'ఐకానిక్'!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి చదరపు అడుగు రూ.8,981.56 చొప్పున రూ.4,688.82 కోట్లను కాంట్రాక్టుగా విలువగా నిర్ణయించి సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలవడంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. ఇదే ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ నాడు టీడీపీ సర్కారు ఒప్పందం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. అప్పటితో పోల్చితే స్టీలు, సిమెంటు, నిర్మాణ సామగ్రి, ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేదు. పోనీ.. నిర్మాణ పద్ధతి ఏమైనా మారిందా? అంటే అదీ లేదు. అప్పుడూ ఇప్పుడూ డయాగ్రిడ్ విధానమే. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం పెరగకూడదు. కానీ.. 2018తో పోల్చితే చదరపు అడుగుకు ఏకంగా రూ.4,631.14 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేశారు. దీన్నిబట్టి ఐకానిక్ టవర్ల టెండర్లలో భారీ గోల్మాల్ జరిగినట్లు స్పష్టమవుతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యనేత తన సిండికేట్‌లో ముగ్గురు బడా కాంట్రాక్టర్లు ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకేజీ చొప్పున పనులు అప్పగించాలని నిర్ణయించారు. కాంట్రాక్టు విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి అందులో 8 శాతాన్ని తొలి విడత కమిషన్‌గా రాబట్టుకుని.. ఆ తర్వాత ప్రతి బిల్లులోనూ పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్ రూపంలో రాబట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నారని పేర్కొంటున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చ.అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ తర్వాత డిజైన్లలో మార్పు, పని స్వభావం మారిందనే సాకులతో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున పెంచేశారు. ఈ లెక్కన ఇప్పుడు ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందోనన్న చర్చ అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది.డయాగ్రిడ్ విధానంలో నిర్మాణం..సంప్రదాయ పద్ధతిలో భవనాలను కాలమ్స్ (నిలువు కాంక్రీట్ దిమ్మెలు), బీమ్స్ (అడ్డు కాంక్రీట్ దిమ్మెలు) నిర్మించి కాంక్రీట్‌తో శ్లాబ్ వేస్తారు. ఇటుకలతో గోడలు కట్టి సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు. ఐకానిక్ టవర్ల(ఆకాశ హర్మ్యాలు)ను సంప్రదాయ పద్ధతిలో నిర్మించడం సాధ్యం కాదు. డయాగ్రిడ్ విధానంలో నిర్మించేలా ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ డిజైన్ చేసింది. డయాగ్రిడ్ విధానంలో కాలమ్స్, బీమ్స్‌ను ఒక మూల నుంచి మరో మూలకు కలుపుతూ కాలమ్స్ నిర్మిస్తారు. దీనివల్ల గాలి వేగాన్ని తట్టుకుని గురుత్వాకర్షణ శక్తితో ఉంటుంది. అమరావతి ఐకానిక్ టవర్లలో నాలుగింటిని బీ+జీ+39 అంతస్తులతో.. జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో కడుతున్నారు. సచివాలయంలో 1, 2, 3, 4, జీఏడీ టవర్‌లో ఒక్కో అంతస్తు 47 మీటర్లు వెడల్పు, 47 మీటర్ల పొడవుతో 2,209 చదరపు మీటర్లు (23,777 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో నిర్మించనున్నారు. ఇందులో 1,200 చదరపు మీటర్లు(12,916 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతాన్ని వినియోగించేలా నిర్మిస్తారు.వాస్తవానికి చ.అడుగు రూ.2 వేలకు మించదు..!సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని పేర్కొంటున్నారు. అయినా సరే.. 2018తో పోల్చితే ఐకానిక్ టవర్ల అంచనా వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేసి సీఆర్డీఏ టెండర్లు పిలవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మొత్తం ఐదు ఐకానిక్ టవర్లను పరిశీలిస్తే.. సగటున చదరపు అడుగుకు రూ.8,981.56 చొప్పున కాంట్రాక్టు విలువగా నిర్దేశించినట్లు స్పష్టమవుతోంది. రాజధానిలో ఇప్పటివరకూ ఆమోదించిన టెండర్లను పరిగణలోకి తీసుకుంటే.. ఐకానిక్ టవర్ల పనులను కాంట్రాక్టు విలువ కంటే కనీసం 4.5 శాతం అధిక ధరకు టెండర్లలో నిర్మాణ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. ఈ లెక్కన అంచనా వ్యయం నిర్మాణం ప్రారంభించక ముందే పెరగనుంది. గతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని బట్టి చూస్తే.. ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.నాడూ నేడూ అదే దోపిడీ..!2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచి పాలన అంటూ ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఏకంగా రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసిన వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి తెరతీసినట్లు స్పష్టమవుతోంది.సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం..అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్ విధానంలో ఐకానిక్ టవర్లు నిర్మించేలా పోస్టర్ అండ్ పార్టనర్స్– జెనిసిస్ ప్లానర్స్–డిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు 2018లో డిజైన్లు రూపొందించాయి. ఆ పనులను 2018 ఏప్రిల్‌లో కాంట్రాక్టు సంస్థలకు టీడీపీ సర్కారు అప్పగించింది. పునాదులు అప్పట్లోనే పూర్తి కాగా మిగిలిన పనులకు సీఆర్డీఏ ఇప్పుడు టెండర్లు పిలిచింది.» సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,897.86 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో షాపూర్జీ పల్లోంజీ సంస్థకు రూ.932.46 కోట్లకు అప్పగించడం గమనార్హం.» సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,664.45 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.784.62 కోట్లకు అప్పగించారు.» ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,126.51 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు అప్పగించింది. -
షాపూర్ జీ–పల్లోంజీ ప్రతినిధులతో సీఎం సమావేశం
సాక్షి, అమరావతి: ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి కట్టడాలపై సమగ్రంగా అధ్యయనం జరిపి వాటికి దీటుగా అమరావతి ఐకానిక్ టవర్స్ నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) అధికారులు, ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. తాము రూపొందించిన అమరావతి ఐకానిక్ ట్విన్ టవర్ ఆకృతులు, నిర్మాణ వ్యూహంపై షాపూర్ జీ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ జంట కట్టడాల్లో కార్యాలయ స్థలం 55 నుంచి 57 శాతం వరకు ఉంటుంది. షాపింగ్ ఏరియా కోసం 12 నుంచి 13 శాతం వరకు కేటాయిస్తారు. సర్వీస్ అపార్టుమెంట్స్ కోసం 8 శాతం ప్రదేశాన్ని వినియోగించనున్నట్టు వారు వివరించారు.