breaking news
ice cave
-
పర్యాటకులను అబ్బురపరిచే మంచు గుహ
స్విట్జర్లాండ్: స్విస్ ఆల్ఫైన్ పర్వతాల్లోని ఎత్తైన హిమానీనదం మీద సహజంగా ఏర్పడే మంచు గుహ సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. నీలి రంగులో కనిపించే ఈ ప్రకృతి సోయగం పర్యాటకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ మంచు గుహ పరిమాణం, ఆకారం ప్రతి ఏటా భిన్నమైన ఆకృతిని సంతరించుకుంటుంది. ఇది 5 మీటర్ల ఎత్తు, 20 మీటర్ల పొడవు మందపాటి మంచుతో కప్పబడిన గుండ్రని పైకప్పును కలిగి ఉంటుంది. ఇక ఈ ఏడాది గుహ లోపలి భాగం చాలా చదునైనదిగా పర్యటకుల సందర్శనకు వీలుగా ఉంది. వేసవిలో మంచు కరిగి గుహ నీటితో నిండి ఒక సరస్సులా మారుతుంది. డయబిల్రేట్స్ రిసార్ట్ ముందుగా ఉన్న గ్లేసియర్ 3000 చైర్లిఫ్ట్ నుంచి 15 నిమిషాల్లో కాలినడకన మంచు గుహకు చేరుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. కానీ ఈ ప్రయాణంలో ఎవరికి వారే తగు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ‘‘మేము అధికారికంగా మొదటిసారి తెరిచాం. గత సంవత్సరంలాగే మంచు గుహ ఉన్నప్పటికీ ఈసారి భిన్నంగా మరింత దృఢంగా ఉంది. మంచు కేథడ్రల్ లాగా ఇది అందంగా ఉంది’’ అని గ్లేసియర్ 3000 సీఈఓ బెర్న్‌హార్డ్ త్చన్నెన్ రాయిటర్స్‌తో అన్నారు. ఇది అద్భుతమైనదని, ఈ గుహ గురించి ఇంకా చెప్పడానికి మాటలు లేవు, నేను ఇలాంటిది జీవితంలో చూడలేదు. కొత్త ప్రపంచం చూసినట్టు చాలా అందంగా ఉంది. మీకు వెళ్ళే అవకాశం వస్తే నేను సిఫారసు చేస్తా అని సమీపంలో నివసిస్తున్న డచ్ మహిళ హెలెన్ ట్రంప్ పేర్కొన్నారు. -
కుప్పకూలిన యూఎన్ వారసత్వ సంపద
బ్యూనోస్ ఎయిర్స్, అర్జెంటినా : అర్జెంటినాలో యూనెస్కో వారసత్వ సంపదగా భాసిల్లుతున్న ఐస్ బ్రిడ్జి ఆదివారం కుప్పకూలింది. అర్థరాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో వేల మంది ప్రాణాలకు అపాయం తప్పింది. పెంటగోనియా ప్రాంతంలో గల లాస్ గ్లేసిరేస్ జాతీయ పార్కులో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు బ్రిడ్జి ఉంది. సోమవారం బ్రిడ్జిని సందర్శించి, దానిపై నడిచి వెళ్లేందుకు వేలాది మంది యాత్రికులు పార్కుకు రావాల్సివుంది. అయితే, ఆదివారం అర్థరాత్రి సమయంలో వచ్చిన భారీ తుపాను ధాటికి బ్రిడ్జి కుప్పకూలిపోయింది. చివరిసారిగా 2004లో ఈ మంచు బ్రిడ్జి కుప్పకూలినట్లు లాస్ గ్లేసిరేస్ జాతీయ పార్కులోని గ్లేసిరీయమ్ మ్యూజియం డైరెక్టర్ తెలిపారు. -
గజగజ వణికించే గుహ!
మనమెన్నో గుహలు చూసుంటాం. ఇలా మంచుతో సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు చాలా అరుదు. దాదాపు కిలోమీటరు పొడవున సొరంగంలా ఉన్న ఈ గుహ రష్యాలోని కమ్చట్కాలో ఉంది. ఇక్కడికి సమీపంలోని అగ్నిపర్వతాల వద్ద ఉన్న వేడి నీటి బుగ్గల నీరు భారీ మంచు ఫలకం కింద నుంచి ప్రవహించడం వల్ల ఇది ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.