breaking news
I set
-
అన్ని సెట్స్ నిర్వహణ బాధ్యతలు ఎన్ఐసీకే!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్, ఐసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఏటా నిర్వహిస్తున్న నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్‌కే (ఎన్ఐసీ) మిగతా సెట్స్ బాధ్యతలను అప్పగించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తోంది. సోమవారం ఎన్ఐసీ అధికారులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి భేటీ అయ్యారు. వచ్చే నెల 17 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను వచ్చే నెల 17 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వర శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ పరీక్షలు ఏప్రిల్ 17 నుంచి మే 3 వరకు, అలాగే ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏప్రిల్ 17 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ‘అంగన్వాడీ’ నియామకానికి కమిటీలు అంగన్వాడీ టీచర్లు, సహాయకుల నియామకానికి సంబంధించి సరికొత్త నిబంధనలతో జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తూ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, జిల్లా సంక్షేమాధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా సంబం ధిత ఆర్డీఓ, డీఎంహెచ్ఓ, ఐటీడీఏ ప్రాంతాల్లో ఐటీడీఏ పీఓ సభ్యులుగా ఉంటారు. 23న పీఆర్టీయూ–టీఎస్ విద్యా సదస్సు సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో ఈనెల 23న పీఆర్టీ యూ–టీఎస్ రాష్ట్ర కార్వనిర్వాహక వర్గ సమావేశం, విద్యా సదస్సు నిర్వహిం చనున్నట్లు పీఆర్టీయూ–టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డిలు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. -
నేడు ఐసెట్
14 కేంద్రాల్లో నిర్వహణ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఐసెట్ గురువారం జరుగనుంది. జిల్లా కేంద్రంలో పద్నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక పరిశీలకులను నియమించామని వరంగల్ రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్, కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సాయిలు తెలిపారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12-30గంటల వరకు జరిగే పరీక్షకు వరంగల్ రీజినల్ పరిధిలో 7,870 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. అభ్యర్థులు 9గంటల వరకే కేంద్రాలకు చేరుకోవాలని, నిర్ణీత సమయం కంటే ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద తొలుత అభ్యర్థుల వేలిముద్రలు, ఫొటోలు తీసుకుంటామని.. దీని కోసం ప్రత్యేకంగా బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లను నియమించామని వెల్లడించారు. కాగా, అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్‌పారుుంట్ పెన్ తప్ప సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తీసుకురావొద్దని సారుులు సూచించారు.