చినవెంకన్న క్షేత్రంలో పెళ్లిళ్ల సందడి
ద్వారకాతిరుమల : చినవెంకన్న క్షేత్రంలో భారీగా జరిగిన వివాహాలతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. గురు, శుక్రవారాల్లో వందలాది జంటలు వివాహబంధంతో ఒక్కటయ్యాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, కల్యాణ మండప ఆవరణతో పాటు ఆలయ ప్రధాన రాజగోపుర మెట్లదారిలో సైతం వివాహాలు జరిగాయి. శేషాచలకొండపై ఉన్న కల్యాణ మండపాలు, ప్రై వేటు సత్రాల్లోనూ పెళ్లి సందడి నెలకొంది. వివాహాల అనంతరం శుక్రవారం ఉదయం నూతన వ«ధూవరులు, వారి బంధువులు శ్రీవారిని, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు.