హోటల్ రాజ్‌దూత్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని లక్డీకాపూల్ రాజ్‌దూత్ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు హోటల్లో మంటలు అంటుకోవడంతో అగ్నిప్రమాదం జరిగింది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.