breaking news
Hostel construction
-
రింకూ సింగ్ గొప్ప మనసు.. తనలా కష్టపడకూడదని
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు బాది కేకేఆర్‌ను గెలిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు రింకూ సింగ్. మూడు నాలుగేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న రాని గుర్తింపు ఆ ఒక్క మ్యాచ్‌తో వచ్చేసింది. అతను కొట్టిన ఐదు సిక్సర్లు కేకేఆర్ అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్‌కు చిరకాలం గుర్తుండిపోతుంది. అయితే రింకూ సింగ్ మంచి క్రికెటర్ మాత్రమే కాదు.. గొప్ప మనసున్న వ్యక్తి కూడా. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి ఐపీఎల్ ద్వారా డబ్బు సంపాదిస్తూ రింకూ సింగ్ జీవితంలో స్థిరపడ్డాడు. అయితే తాను స్థిరపడడానికి ముందు అనుభవించిన కష్టాలు తెలిసినోడు గనుక.. పేద క్రికెటర్లకు అండగా నిలబడాలనుకున్నాడు. కనీస సౌకర్యాలు లేని పేద క్రికెటర్లకు హాస్టల్ నిర్మించాలనుకున్నాడు. ఈ విషయాన్ని రింకూ సింగ్ చిన్ననాటి కోచ్ జాఫర్ చెప్పాడు. కాగా రింకూ కోచ్ జాఫర్ అలీగఢ్ జిల్లాలో క్రికెట్ సంఘానికి చెందిన 15 ఎకరాల్లో అలీగఢ్ క్రికెట్ స్కూల్, అకాడమీ నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు అక్కడే రింకూ సింగ్ హాస్టల్‌ను నిర్మిస్తున్నాడు. రూ. 50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న హాస్టల్లో మొత్తం 14 గదులు ఉంటాయి. ఒక్కో గదిలో నలుగురు ట్రైనీ క్రికెటర్లు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హాస్టల్లో ఏర్పాటు చేయనున్న క్యాంటీన్లోనే క్రికెటర్లు ఆహారం తినేలా వసతులు కల్పించారు. రింకూ సింగ్ నిర్మిస్తున్న హాస్టల్ ''క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో తనలా కష్టపడకూడదనే ఉద్దేశంతో రింకూ సింగ్ హాస్టల్ నిర్మాణానికి పూనుకున్నాడు. మూడు నెలల కింద పని మొదలైంది. మరో నెల రోజుల్లో హాస్టల్ నిర్మాణం పూర్తవనుంది. ఐపీఎల్ పూర్తయ్యాకా రింకూ సింగ్ ఈ హాస్టల్‌ను ప్రారంభించనున్నాడు'' అని కోచ్ జాఫర్ పేర్కొన్నారు. 2017లో అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్(ప్రస్తుతం కింగ్స్ పంజాబ్) రింకూ సింగ్‌ను కొనుగోలు చేసింది. 2017లో పంజాబ్‌కు ఆడిన రింకూ.. 2018లో రూ.80 లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. 2021లో మోకాలి గాయంతో ఐపీఎల్‌కు దూరమైన రింకూ సింగ్‌ను 2022లో జరిగిన మెగావేలంలో మరోసారి కేకేఆర్ రూ.55 లక్షలకు రిటైన్ చేసుకుంది. ఇప్పటివరకు 22 మ్యాచ్‌లాడిన రింకూ సింగ్ 425 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 58గా ఉంది. చదవండి: ధోని చేసిన తప్పు థర్డ్ అంపైర్‌కు కనిపించలేదా? "Because he's the Knight #KKR deserves and the one they need right now" - Rinku Singh 😎#GTvKKR #TATAIPL #IPLonJioCinema | @KKRiders pic.twitter.com/b1QrN3fLjX — JioCinema (@JioCinema) April 9, 2023 -
మో‘డల్’ స్కూళ్లు
సాక్షి, మంచిర్యాల : జిల్లాలోని 14 మండలాలకు 2012-13 విద్యాసంవత్సరానికి మొదటిదశలో మోడల్ స్కూళ్లు మంజూరయ్యాయి. అయితే ఏ ఒక్కచోట పాఠశాల ప్రారంభం కాలేదు. 2013-14లో గదుల నిర్మాణం కాకపోయినప్పటికీ తాత్కాలికంగా తరగతులు ప్రారంభించారు. సమీపంలోని పాఠశాలల్లో తరగ తులను కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా ఏడు మండలాల్లో తరగతులు కొనసాగుతున్నాయి. మిగతా ఏడు ఆదర్శ పాఠశాలల్లో ఈ ఏడాది కూడా ప్రవేశాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియలో వీటికి భాగస్వామ్యం కల్పించలేదు. వసతి గృహాలేవి? తరగతి గదుల నిర్మాణం పూర్తయ్యే దశకు వచ్చినప్పటికీ హాస్టళ్ల నిర్మాణం మాత్రం ఎక్కడా ప్రారంభం కాలేదు. గదులు లేకపోవడంతో గతేడాది ప్రవేశాలు కల్పించలేదు. మోడల్ స్కూల్ విధానంలో పాఠశాల, హాస్టల్ ఉండాలి. హాస్టల్లో కేవలం బాలికల కే వసతి ఉంటుంది. హాస్టల్ వసతి లేక పోవడంతో దూరప్రాంతాల వారు పాఠశాలకు వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. మరోవైపు ఈ సమస్యతో డ్రాపౌట్లు పెరుగుతున్నాయి. పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలను సాకుగా చూయించి రీ టెండర్ పిలిచేలా ఒత్తిడి తీసుకురావచ్చనే ఆలోచనతో కొందరు కాంట్రాక్టర్లు ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తికాని నియామకాలు ఆదర్శ పాఠశాల మొదటిదశ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియలో మొదటిదశలో భాగంగా 2013 జూన్‌లో పదిమంది పీజీటీలను తొలుత ఆయా పాఠశాలలకు నియమించారు. వేతన భద్రత లేకపోవడంతో ఐదు నుంచి ఆరుగురు మాత్రమే విధుల్లో చేరారు. తర్వాత 2013 నవంబర్‌లో స్కూలుకు ఆరుగురు టీజీటీల చొప్పున ఎంపిక చేయగా ముగ్గురు నుంచి నలుగురు చొప్పున విధుల్లో చేరారు. పాఠశాలకు 10 మంది పీజీటీలతో పాటు ఆరుగురు టీజీటీలు విధులు నిర్వర్తించాలి. కంప్యూటర్ ఆపరేటర్, వాచ్‌మన్, పీఈటీ, ఆఫీస్ సబార్డినేట్లను ఆయా పాఠశాలలకు ఔట్సోర్సింగ్ విధానంలో ఎంపిక చేశారు. వీరిని 2014 మార్చి మొదటివారంలో నియమించడంతో వీరి సేవలు పూర్తిస్థాయిలో ఉపయోగపడలేదు. అంతేకాకుండా పీఈటీ, ఆఫీస్ సబార్డినేట్లను ఏప్రిల్ చివరివారంలో విధుల్లో నుంచి రిలీవ్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్‌తో అడ్మిషన్ల ప్రక్రియను నిర్వర్తిస్తూ వాచ్‌మన్‌తో ఆయాపాఠశాల భద్రతను కొనసాగిస్తున్నారు. గడిచిన విద్యా సంవత్సరంలో ఆదర్శ పాఠ శాలలోనూ యూనిఫాంల పంపిణీ జరగలేదు. ఉపాధ్యాయుల్లోనూ అభద్రత ఇటీవలే ఉద్యోగాలకు ఎంపికైన యువ ఉపాధ్యాయులు మోడల్ స్కూళ్ల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు వీరికి సర్వీసు రూల్స్ రాలేదు. దీంతోపాటు 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని, ఐఆర్ డీఏ చెల్లించాలనే డిమాండ్లు ఉన్నాయి. మూడు డిమాండ్ల సాధనకోసం ఆయావర్గాలు మొర పెట్టుకుంటున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించడంలేదు. పెరుగుతున్న విద్యాభారం! గతేడాది 6,7,8 తరగతులతోపాటు ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులను ఆయా పాఠశాలల్లో నడిపించారు. ఈ ఏడాది తొమ్మిది, ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులను అదనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గదులు లేకపోవడంతో క్లాసులు కొనసాగించడం ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. భారీగా దరఖాస్తులు 4మోడల్ స్కూళ్లలో సమస్యలు ఉన్నప్పటికీ అందిస్తున్న నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పెద్దఎత్తున దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అధికారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేసి నాణ్యమైన విద్య బాలబాలికలకు అందేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.