breaking news
High Life Luxury Exhibition
-
అద్దం.. హైలైఫ్ అందం
మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో గురువారం హైలైఫ్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. హీరోయిన్ నబా నటేష్ పాల్గొని సందడి చేసింది. మాదాపూర్: హైలైఫ్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన డిజైనింగ్ వస్త్రాభరణాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోనిహెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన హైలైఫ్ ఎగ్జిబిషన్‌ను నటీ నబా నటేష్, మిస్ గ్రాండ్ ఇండియా– 2019 శివానీజాదవ్, అదితీ హుందియాలు గురువారం ప్రారంభించారు. 400 మంది డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులు నగర యువతను ఆకట్టుకునేలా ఉన్నాయని తెలిపారు. మహిళలు ఎక్కువగా అధునాతనడిజైన్లతో కూడిన ఆభరణాలు, వస్త్రాలను ఇష్టపడతారన్నారు. వివాహాది శుభకార్యాలకు హైలైఫ్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వస్త్రాభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు.నిర్వాహకుడు డొమినిక్ మాట్లాడుతూ మూడు రోజుల పాటునిర్వహించనున్న హైలైఫ్ ఎగ్జిబిషన్లో గృహాలంకరణ వస్తువులతో పాటు వస్త్రాభరణాల స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
డిజైనర్ వస్త్రాలు... పోలిస్టోన్ శిల్పాలు...
జీవనశైలిలో వైవిధ్యం ప్రతిబింబింపజేయాలనుకునేవారికి, ఆహార్యంలో అద్భుతం అనిపించుకోవాలనే కోరిక ఉన్నవారికి ఒకే చిరునామాలో ఉత్పత్తులు దొరకడం అంత సులభమైన విషయం కాదు. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్ ప్రాంగణంలో కొలువుదీరిన హై లైఫ్ లగ్జరీ ఎగ్జిబిషన్ ఈ అరుదైన మేళవింపుతో నగరవాసుల్ని మరోసారి అలరిస్తోంది. ఘజియాబాద్ నుంచి తరలివచ్చిన మానవ తయారీ లోహం పోలిస్టోన్తో శిల్పాలు మొదలుకుని అత్యుత్తమ డిజైనర్ బ్రాండ్ల దుస్తుల దాకా... ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. అన్ని ఎక్స్‌పోల తరహాలోనే ఈ ప్రదర్శనలోనూ డిజైనర్ దుస్తుల వెరైటీలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కినప్పటికీ, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, సిల్వర్ ఫర్నిచర్, యాంటిక్స్, అనూహ్యమైన మెటీరియల్‌తో తయారు చేసిన ఇంటీరియర్ ఉత్పత్తులు వైవిధ్యాన్ని కోరుకునేవారికి నచ్చేలా అందుబాటులో ఉంచారు. ముంబయి, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, లక్నో, పూనె,కోల్‌కత, చెన్నై... నగరాల నుంచి తయారీదారులు ఇందులో పాల్గొంటున్నారు. బాలీవుడ్ నటుడు అలోక్‌నాథ్, టాలీవుడ్ వర్ధమాన తారలు మానస, పరిణిధి, సోనా చత్వాని తదితరులు బుధవారం నాటి ప్రారంభ కార్యక్రమానికి అతిధులుగా హాజరయ్యారు. ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుంది.