breaking news
happy day
-
నేడు వరల్డ్ హాపీనెస్ డే...లక్ష్యం ఉన్నచోట ఉత్సాహం... ఉత్సాహం ఉన్నచోట సంతోషం ఉంటాయి
సంతోషం సగం బలం అన్నారుగానీ నిజానికి అది సంపూర్ణ బలం. ఆ బలం ఉన్నచోటే ఆరోగ్యం ఉంటుంది. విజయం ఉంటుంది.డబ్బుతో కొనలేని ‘సంతోషం’ ఎవరూ చేరుకోలేని కీకారణ్యం కాదు. ‘నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను’ అని మనసులో గట్టిగా అనుకొని ఒక అడుగు వేస్తే ఎన్నో దారులు కనిపిస్తాయి. సంతోష సామ్రాజ్యానికి దగ్గర చేస్తాయి.‘సక్సెస్‌తో సంతోషం రాదు. సంతోషంతో సక్సెస్ వస్తుంది’ అనే పాతతరం మాటకు కొత్త తరం విలువ ఇస్తోందిప్పుడు. నిరంతరం సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. సంతోషంగా ఉండడానికి సంబంధించిన టెక్నిక్స్ గురించి ఆసక్తిగా తెలుసుకుంటోంది... భోపాల్‌కు చెందిన అనీష ప్రతి రెండు రోజులకు ఒక సంస్కృత శ్లోకాన్ని కంఠస్థం చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకొని ఈ ఏడాది జనవరి మొదటి తేదీ నుంచి ప్రారంభించింది. ఫిబ్రవరి నెల పూర్తయ్యే సరికి తాను అలవోకగా చెప్పగలిగే శ్లోకాల గురించి లెక్క వేసుకుంటే చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ సంతోషం ఇంకా కొనసాగుతూనే ఉంది.తమిళనాడులోని వెల్లూరుకు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ ఐశ్వర్య మోహన్‌కు డ్రైవింగ్ అంటే చెప్పలేనంత భయం. ఆ భయాన్ని వదిలి ఈమధ్యే స్కూటీ నడపడం నేర్చుకుంది. తనకు ఇప్పుడు విమానం నడుపుతున్నంత సంతోషంగా ఉంది. ముంబైకి చెందిన సజన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్యాడ్జెట్స్ కొనడంలో అతడికి అంతులేనంత సంతోషం దొరుకుతుంది. ఇవి మాత్రమే కాదు...మనం చేసే పనికి ఇతరుల నుంచి లభించే ప్రశంస, అభిమాన హీరో సినిమాకు వెళ్లడం, ‘చాలా హ్యాండ్సమ్’గా ఉన్నావు’లాంటి కామెంట్... ఇలాంటివి అప్పటికప్పుడు లభించే తాత్కాలిక సంతోషాలే అయినా తక్కువ చేసి చూసేవి మాత్రం కాదు. చిన్న చిన్న చినుకులు కలిస్తేనే కదా వర్షం.చిరు సంతోషాల కలయికే కదా ఆనందమయ జీవితం! ‘హాబీల నుంచి వచ్చే హ్యాపీనెస్ అంతా ఇంతా కాదయా’ అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.జెన్ జెడ్‌కు సుపరిచితమైన పేరు... విష్ణు కౌశల్. ఇన్‌స్టాగ్రామ్‌లో కామిక్ కంటెంట్ జెనరేట్ చేయడం అతడి హాబీ. ఈ హాబీ కాస్త అతడిని డిజిటల్ స్టార్‌ను చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ణు కౌశల్‌కు 2.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ‘పెద్ద లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నా ప్రయాణాన్ని ప్రారంభించలేదు. నేను కామిక్ కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి కారణం అది నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచుతుంది’ అంటాడు 25 సంవత్సరాల విష్ణు కౌశల్. ‘లేదు అనుకుంటే ఏమీ లేదు. ఉంది అనుకుంటే ఎంతో ఉంది’ అనే ధోరణిని అనుసరించే యువతరం సూర్యోదయం నుంచి వెండి వెన్నెల వెలుగు వరకు ప్రతి ప్రకృతి అద్భుతాన్ని ఎంజాయ్ చేస్తోంది.‘హ్యాపీనెస్ అనేది ఎమోషన్, ఫీలింగ్ కాదు. అదొక స్కిల్’ అంటున్న యువతరం రకరకాల టెక్నిక్‌లపై కూడా దృష్టి సారిస్తోంది. స్థూలంగా చె΄్పాలంటే ‘సంతోషం’ అనే పునాదిని సిద్ధం చేసుకొని ‘లక్ష్యాలు’ అనే భవనాలపై దృష్టి పెడుతోంది. ట్రై చేసి చూద్దాం వ్యాయామాలతో సంతోషాన్ని సొంతం చేసుకునేవారు కొందరైతే, సంతోషం కోసం ప్రత్యేక వ్యాయామాలు చేసేవారు కొందరు. ‘హ్యాపీనెస్’ను సొంతం చేసుకోవడం కోసం చిన్నపాటి ఎక్సర్సైజ్ల మీద దృష్టి పెట్టే ధోరణి యువతరంలో పెరగుతుంది. వాటిలో కొన్ని... ► టాప్ ఔట్ స్ట్రెస్ ►న్యూ బెహ్ జెన్ ►యాంకర్ హ్యాపీ అండ్ కామ్ ఫీలింగ్స్ ►బ్రీత్ టెక్నిక్ ∙యాంగర్ రిలీజ్ సీక్రెట్. నచ్చిన పనిలోనే సంతోషం చెన్నైలో పుట్టి బెంగళూరులో పెరిగిన నిహారిక ఎన్ఎం ఇంజినీరింగ్ చదివే రోజుల్లో హాబీగా యూట్యూబ్ వీడియోలు చేసింది. ఈ ప్రక్రియ తనను ఒత్తిడికి దూరంగా ఉంచడంతో పాటు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చేసింది. ‘నచ్చిన పని చేయడంలో అపారమైన ఆనందం సొంతం అవుతుంది’ అంటున్న నిహారిక ఎన్ఎం ‘డిజిటల్ కంటెంట్ క్రియేటర్’గా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. హ్యాపీనెస్ ఫార్ములా ‘హ్యాపీనెస్’ అనే మాట వినిపించగానే గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటి సైకాలజిస్ట్ మార్టిన్ సెలిగ్మాన్. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన సెలిగ్మాన్ సంతోషం అంటే ఏమిటి? మనిషిని సంతోషంగా ఉంచే అంశాలు ఏమిటి? ఫెయిల్యూర్స్‌ను అధిగమించి విజయాలు సొంతం చేసుకున్న వ్యక్తుల గురించి లోతుగా అధ్యయనం చేశాడు. ‘అథెంటిక్ హ్యాపీనెస్’ పేరుతో పుస్తకం రాశాడు. ‘హ్యాపీనెస్’కు సంబంధించి హెచ్=ఎస్ +సి+వి అనే ఫార్ములాను రూపొందించాడు. హెచ్–హ్యాపీనెస్ ఎస్–సెట్ రేంజ్ : మన సంతోషంలో 50 శాతం పూర్తిగా మన నియంత్రణలో ఉండదు. జెనెటిక్ కెపాసిటీ ప్రభావం ఉంటుంది. సి–సర్కమస్టాన్సెస్: దీర్ఘకాలిక సంతోషాన్ని సొంతం చేసుకోవడానికి పరిస్థితులను సరిదిద్దుకుంటూ, స్ట్రాటిజిక్ వర్క్‌తో ప్రయాణించాలి. ఉదా: నెగెటివ్ ఈవెంట్స్, నెగిటివ్ ఎమోషన్స్‌కు దూరంగా ఉండడం. వి–వాలెంటరీ వేరియబుల్స్: హ్యాపీనెస్ ఫార్ములాలో బెస్ట్ అండ్ మోస్ట్ కంట్రోలబుల్ పార్ట్ ఇది. గత, వర్తమాన, భవిష్యత్తుకు సంబంధించిన పాజిటివ్ ఎమోషన్స్ ద్వారా సంతోషంగా ఉండడం.హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ్ర΄÷ఫెసర్, సోషల్ సైంటిస్ట్, రచయిత డా.అర్థర్ బూక్స్ర్ ‘హ్యాపీనెస్’కు సంబంధించి హెచ్=ఇ+ఎస్+ఎం అనే ఈక్వేషన్‌ను ప్రచారంలోకి తీసుకువచ్చాడు.హాపీనెస్ (హెచ్) = ఎంజాయ్మెంట్ (ఇ)+శాటిస్ఫాక్షన్ (ఎస్)+మీనింగ్ (ఎం) హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఆర్థర్ రూపొందించిన ‘మేనేజింగ్ హ్యాపీనెస్’ అనే కోర్సు అందుబాటులో ఉంది. -
హ్యాపీ డే...
తాడేపల్లి రూరల్: ఆదివారం.. ఆ కుటుంబానికి హ్యాపీ డే. బతుకుదెరువు కోసం ఇరాక్ వెళ్లి.. అక్కడి అంతర్యుద్ధం కారణంగా పడరాని పాట్లు పడిన కుటుంబ యజమాని క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవటమే ఇందుకు కారణం. తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటకు చెందిన ఎస్కె బాజీఖాన్ ఇంట్లో ఆదివారం ఆనందోత్సాహాలు వెల్లివిరిశారుు. బాజీఖాన్, బ్రహ్మానందపురానికి చెందిన కోడూరు లక్ష్మణ్‌లు నాలుగు నెలల క్రితం ఇరాక్ దేశంలోని కోఫిల్ పట్టణానికి చేరువలో ఉన్న కారవంచి జ్యూస్ ఫ్యాక్టరీలో పని చేయడానికి వెళ్లారు. అయితే ఇరాక్‌లో అంతర్యుద్ధం ప్రారంభమవటం.. బాజీఖాన్, లక్ష్మణ్‌లు పనిచేస్తున్న ఫ్యాక్టరీకి 40 కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యూరు. తమను ఇండియా రప్పించేందుకు గట్టిగా యత్నించాలని బాజీఖాన్, లక్ష్మణ్‌లు తమ బంధువులు, స్నేహితులను వేడుకోవటంతో వారి ఆందోళన మరింత ఎక్కువైంది. చివరికి కేంద్ర ప్రభుత్వ చొరవతో వారిద్దరు స్వదేశానికి చేరుకున్నారు. ఇరాక్ నుంచి శుక్రవారం అర్ధరాత్రి విమానంలో బయలుదేరిన బాజీఖాన్, లక్ష్మణ్‌లు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీకి, అక్కడనుంచి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎరుుర్‌పోర్టుకు చేరుకున్నారు. తన బ్యాగ్ కనిపించకపోవటంతో లక్ష్మణ్ అక్కడే ఉండిపోగా బాజీఖాన్ అష్టకష్టాలు పడి ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు తాడేపల్లి చేరుకున్నారు. ఆయన్ను చూడగానే భార్యాబిడ్డలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఒక్కసారిగా చుట్టుముట్టి రోదించారు. బాజీ తన పిల్లలిద్దరినీ ఎత్తుకుని ముద్దాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అల్లాహ్ దయ వల్ల భార్యాబిడ్డలను కలుసుకోగలిగానని చెప్పారు. పవిత్ర రంజాన్ మాసంలో అల్లాహ్ తమను కరుణించారని ఆనందం వ్యక్తం చేశారు. బస్ చార్జీలకు సొమ్ము లేక తంటాలు.. హైదరాబాద్ వరకు తీసుకొచ్చిన అధికారులు కనీసం బస్సు చార్జీలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో స్వగ్రామానికి వచ్చేందుకు బాజీఖాన్ నానా తంటాలు పడ్డారు. ఇరాక్ నుంచి తమతోపాటు వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మిత్రుల వద్ద సొమ్ము తీసుకుని బస్సులో విజయవాడకు, అక్కడ నుంచి ఆటోలో తాడేపల్లి చేరుకున్నారు.