breaking news
	
		
	
  handri neeva water
- 
  
    
                
      టీడీపీ జల రాజకీయం
 - 
      
                   
                               
                   
            జలమున్నా.. భూములు బీడేనన్నా!
సాక్షి, అనంతపురం: హంద్రీ–నీవా సుజలస్రవంతి పథకం ద్వారా భారీగా నీరు వస్తున్నా జిల్లాలో మాత్రం ఆయకట్టు భూములు బీడుగానే దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వ నిర్వాకమే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా ద్వారా జిల్లాకు ఒక టీఎంసీ నీటిని తీసుకురావడానికి దాదాపు రూ.7 కోట్లు ఖర్చవుతోంది. ఈ లెక్కన గత పదేళ్లలో రూ.వందల కోట్లు విద్యుత్ బిల్లుల కోసమే ఖర్చు చేశారు. ఇంతటి విలువైన కృష్ణాజలాలు జిల్లాకు వస్తున్నా జిల్లా రైతాంగంలో మార్పులు సంభవించాయా అంటే నామమాత్రమేనని చెప్పుకోవాలి. అప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు అభివృద్ధికి కొంతమేర సాధ్యపడ్డాయి. అంతేకాని జిల్లాలో బీడు భూములు పండ్లతోటలుగా, మాగానిగా మారలేదు. ఇందుకు కారణం అధికారంలో ఐదేళ్లు ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధుల వైఫల్యమేనని చెప్పుకోవాలి. ఏనాడు హంద్రీ– నీవా ఆయకట్టును అభివృద్ది చేయాలి, పంటలకు సాగునీరు ఇవ్వాలనే దానిపై దృష్టి సారించలేదు. ఎంతసేపూ తన సొంత నియోజకవర్గం కుప్పంకు నీటిని తీసుకుపోవాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేశారు. జిల్లా ప్రజాప్రతినిధులు కూడా ఎవరికి వారు వారి సొంతనియోజకవర్గంపైనే దృష్టి సారించారు తప్పా హంద్రీనీవా ఆయకట్టు అభివృద్దిపై దృష్టి సారించలేదు. ఫలితంగా హంద్రీనీవా ఆయకట్టు రైతాంగానికి తీవ్ర నష్టం చేకూరింది. 1.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నా.. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక హంద్రీ–నీవా పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు కింద జిల్లాలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. వైఎస్సార్ హయాంలోనే హంద్రీ–నీవా మొదటి దశ దాదాపు పూర్తయింది. ఆయన మరణాంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం జిల్లాకు హంద్రీ–నీవా నీళ్లు వచ్చాయి. 2012లో తొలిసారి జిల్లాకు నీళ్లు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిరంతరాయంగా జిల్లాకు వస్తున్నాయి. అత్యధికంగా మూడేళ్ల నుంచి దాదాపు 26 టీఎంసీలకు పైగా నీళ్లు వస్తున్నాయి. ఇందుకోసం వందల కోట్లు ఖర్చు అయ్యాయి. ఆయకట్టు అభివృద్ధి చేయొద్దని జీఓ ప్రతి నీటి బొట్టూ సద్వినియోగం చేసుకోవడంపై హంద్రీ–నీవా అధికారులు దృష్టి సారించాలి. కానీ అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇష్టానుసారం మళ్లించారు. ఎవరికి పలుకుబడి ఉంటే ఆ ప్రాంతానికి ఎక్కువ తీసుకెళ్లడం.. పలుకుబడి లేని ప్రాంతాలకు అసలే విడుదల చేయకపోవడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కనీసం ఒక్క ఎకరాకు కూడా నీరిచ్చిన దాఖలాలు లేవు. పైగా హంద్రీ–నీవా ఆయకట్టు అభివృద్ధి చేయరాదని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా జీవో కూడా విడుదల చేశారు. దీంతో ఆయకట్టుకు నీరివ్వాలనే అంశం మరుగున పడింది. ఎంతసేపు ఎన్నికల లబ్ధి గురించే టీడీపీ నేతలు ప్రయత్నించారు తప్ప కరువు జిల్లా అభివృద్ధి విషయంపై దృష్టి సారించిన పాపాన పోలేదు. - 
      
                   
                               
                   
            నీళ్లిచ్చానని వరి జోలికెళ్లొద్దు
అనంతపురం , కదిరి: ‘హంద్రీనీవా జలాలు వచ్చాయని రైతులెవరూ వరి పంట జోలికెళ్లద్దు. వరి సాగు లాభం కన్నా... నష్టమే ఎక్కువ. పండ్లతోటలు, కూరగాయలు సాగుచేసుకోండి. వీటికి తక్కువ నీరు సరిపోతుంది. బిందు, తుంపర్ల ద్వారా సాగుచేస్తే నీరు మరింత ఆదా అవుతుంది. పొరపాటున కూడా వరి సాగుచేయద్దు..’ అనిముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను హెచ్చరించారు. మంగళవారం ఆయన కదిరి మండలంలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేశారు. అంతకుముందు జలహారతి ఇచ్చి, పైలాన్‌ను ఆవిష్కరించారు. తర్వాత ఆదరణ–2 పథకం కింద పలువురికి పనిముట్లు, వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభలో గంటకు పైగా ప్రసంగించారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానన్నారు. 1.5 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన చెర్లోపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని భవిష్యత్‌లో పెంచడమే కాకుండా ఈ జలాశయం ద్వారా ఈ ప్రాంతంలోని అన్ని చెరువులను నింపుతామని హామీ ఇచ్చారు. అనంతపురం అనగానే కరువు జిల్లాగా పేరుందని, ఇక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు కూడా వెళ్తున్నారన్నారు. అయితే రానున్న రోజుల్లో ఇతర ప్రాంతాల వారే ‘అనంత’కు వలసలు రావడం ఖాయమన్నారు. చిత్రావతి రిజర్వాయర్‌తో అనుసంధానం చేస్తాం హంద్రీనీవా ప్రాజెక్టును చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నదుల అనుసంధానంతో రాయలసీమకు సరిపడ నీటిని అందిస్తామని తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రాభివృద్ధికి సహకరించడం లేదని, అయినా సంక్షోభంలో అవకాశాలను వెదక్కోవడం తనకు బాగా తెలుసన్నారు. ఏపీ నుంచి భారీగా పన్నులు కడుతున్నా...నిధులిచ్చేందుకు ఆయన మనసు రావడం లేదన్నారు. పోస్టుడేటెడ్ చెక్కులు ఇస్తున్నాం డ్వాక్రా గ్రూపులను ప్రారంభించిదే టీడీపీ అని, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఫిబ్రవరి 2, 3, 4వ తేదీల్లో ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున 3 పోస్టుడేటెడ్ చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. వీటిని మార్చి, ఏప్రిల్ నెలల్లో డ్రా చేసుకోవచ్చాన్నారు. దీని ద్వారా 95 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ‘జయహో బీసీ’ సభ ద్వారా 22 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపామనీ, ఆయా వర్గాలకు వాటి ద్వారా నిధులిచ్చి ఆదుకుంటామన్నారు. ‘‘నేను మీ కోసం ఐదేళ్లుగా కష్టపడుతున్నాను..మీరు నాకోసం 75 రోజులు కష్టపడి గెలిపించండి’’ అని కోరారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, ప్రభుత్వ చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే వరదాపురం సూరి, విప్ చాంద్‌బాషా, టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. - 
            
                                     
                                                           
                                   
                ఉరవకొండలో వైఎస్ జగన్ మహాధర్నా
 - 
  
    
                
      ఆయన ముఖ్యమంత్రి కాదు.. ముఖ్య‘కంత్రి’!
 - 
      
                    
ఆయన ముఖ్యమంత్రి కాదు.. ముఖ్యకంత్రీ: వైఎస్ జగన్

 
 చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాదు.. ముఖ్య కంత్రీ అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గానికి హంద్రీ-నీవా నీళ్లు ఇవ్వాలని కోరుతూ ఆయన నేతృత్వంలో అనంతపురం జిల్లా ఉరవకొండలో మహా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 
 
 
 అనంతపురం జిల్లా కరువు, కాటకాలకు పుట్టినిల్లు
 
 వలసలు, ఆత్మహత్యలు రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలోనే ఉన్నాయి
 
 రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో అతి తక్కువ వర్షపాతం ఉండేది. మనం ఇప్పుడు ఆ జిల్లాతో పోటీ పడుతున్న అధ్వాన పరిస్థితిలో ఉన్నాం
 
 ఈ జిల్లాకు సంజీవని మాదిరిగా ఏమైనా ఉందా అంటే, ఈ జిల్లా ప్రజలను ఆదుకోవాలంటే దీనికి హంద్రీనీవా సుజల స్రవంతి ఒక్కటే మార్గం
 
 దీనికోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం
 
 ఆ ప్రాజెక్టు శ్రీశైలం నుంచి 40 టీఎంసీల నీటితో రాయలసీమ నాలుగు జిల్లాలకు కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 
 
 దీనికి సంబంధించి 6800 కోట్లు ఖర్చవుతాయి. దీనికి దివంగత నేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని పూర్తి చేయాలన్న నిజాయితీ కనిపించింది. 
 
 అప్పట్లో దీనికి 4వేల పైచిలుకు కోట్ల నిధులను కేటాయించారు, పనులు చేశారు
 
 హంద్రీ నీవా సుజల స్రవంతిలో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. 
 
 మిగిలిన పది శాతం పనులు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను ఇంతవరకు ఈ ప్రభుత్వం చేయకపోవడంతో రైతాంగం అల్లాడుతోంది
 
 పది శాతం పనులు పూర్తి చేసి ఉంటే హంద్రీనీవా మొదటి దశ పూర్తయ్యేది
 
 పది లక్షల మందికి సాగునీరు అందించే పరిస్థితి ఉండేది
 
 ఈ ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే 80 వేల ఎకరాలకు సాగునీరు అందేది
 
 ఈవాల్టికీ కూడా చంద్రబాబు సీఎం అయ్యి మూడేళ్లవుతున్నా ఈ పది శాతం పనులు పూర్తి కాక మనం కొట్టుమిట్టాడుతున్నాం
 
 గతంలో చూస్తే, ఇదే చంద్రబాబు తొమ్మిదేళ్లు పాలించారు
 
 అప్పుడు ఇదే ప్రాజెక్టుకు తొమ్మిదేళ్లలో కలిపి కేవలం 24 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు
 
 అవి ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోలేదు
 
 ఆయన హంద్రీనీవా ప్రాజెక్టు గురించిపట్టించుకోలేదు, ఒక్క కిలోమీటరు కాల్వ తవ్వలేదు, ఒక్క లిఫ్టు పెట్టలేదు, ఒక్క ఇటుక కూడా పెట్టిన పాపాన పోలేదు
 
 కానీ ఇదే చంద్రబాబు ఎన్నికలు ఉన్నప్పుడల్లా 1996లో ఉరవకొండకు వచ్చాడు
 
 అప్పుడు 5.5 టీఎంసీలకు దీని సామర్థ్యాన్ని కుదిస్తూ, ఈ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు
 
 మళ్లీ 99లో ఎన్నికలు వచ్చినప్పుడు ఆత్మకూరుకు వచ్చి, దీనికి రెండోసారి శంకుస్థాపన చేశారు
 
 ఒకో ప్రాజెక్టుకు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వచ్చి టెంకాయలు కొట్టి వెళ్లిపోతారు
 
 ఎన్నికలు అయిపోయాక అనంతపురం జిల్లా రైతులు ఎటుపోతే నాకేంటని ఆలోచన చేస్తారు
 
 ఈయనకు రైతుల మీద ప్రేమలేదు, నీటిపారుదల ప్రాజెక్టుల మీద అంతకన్నా లేదు
 
 ఇదే చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉండగా 'మనసులో మాట' అనే పుస్తకం రాశారు
 
 ఆ పుస్తకంలో ఆయన ఏం రాశారో తెలుసా.. 'ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టుల మీద కోట్లు ఖర్చుపెడితే రైతుల నుంచి వచ్చే నీటితీరువా కేవలం లక్షల్లోనే ఉంటుంది, అందుకే ప్రాజెక్టులు కట్టడం వేస్ట్' అని రాశారు
 
 అంత గొప్ప ముఖ్యమంత్రి మన చంద్రబాబు
 
 ఇదే చంద్రబాబుకు హంద్రీ నీవా మీద ఎంత ధ్యాస ఉందని ఈ మూడేళ్లు చూద్దాం
 
 హంద్రీ నీవా పూర్తి కావాలంటే యుద్ధప్రాతిపదికన 2వేల కోట్లు కేటాయించి పనులు చేయాలి
 
 
 
 2014-15లో దీనికి 100 కోట్లు మాత్రమే
 
 15-16లో ఇచ్చింది 380 కోట్లు
 
 16-17లో కేటాయింపులు చేసింది 504 కోట్లు మాత్రమే
 
 ఇదే చంద్రబాబుకు ఒక్క విషయం అర్థం కావడం లేదు
 
 ఈ సంవత్సరం ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు హంద్రీ నీవాలో మోటార్లు ఆడించారు. అందుకు 359 కోట్ల కరెంటు బిల్లులు వచ్చాయి. 
 
 మరి ఈయన కేటాయించిన 500 కోట్లలో ప్రాజెక్టు పనులకు ఏమిస్తారని అడుగుతున్నా
 
 ఈయనకు ప్రాజెక్టుల మీద ధ్యాస లేదు, కాంట్రాక్టర్లతో కక్కుర్తి పడి లాలూచీ పడతారు
 
 కమీషన్ల కోసం కుమ్మక్కు అవుతారు
 
 ప్యాకేజి నెం. 36 అని ఒకటుంది. అందులో పెండింగు పనులు 35 కోట్లు
 
 కాంట్రాక్టర్ నుంచి ఆ పనులు తీసేశారు. దానికి మళ్లీ అంచనాలు వేయించి 363 కోట్ల కింద తనకు నచ్చినవారికి ఇచ్చే కార్యక్రమానికి పూనుకుంటున్నారు
 
 ఇదే చంద్రబాబుకు ప్రాజెక్టుల మీద ఎంత చిత్తశుద్ధి ఉందంటే, పక్కన గాలేరు నగరి ప్రాజెక్టు ఉంది. దానిలో 11 కోట్ల పనులు మిగిలాయి.
 
 వాటికి రీ ఎస్టిమేట్ వేయించి తనవాళ్లతో పనులు పూర్తి చేయించారు. వాటికి 110 కోట్లకు అంచనాలు వేయించారు
 
 ఇంతటి దారుణంగా చంద్రబాబు పాలన సాగుతోంది
 
 మొట్టమొదటి నుంచి ఆయన పాలన ఇంతే
 
 ఆయనకు ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేస్తూ మేనిఫెస్టో పెడతారు
 
 ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు.. కలెక్షన్ మేనిఫెస్టో తీసుకొస్తారు
 
 కాంట్రాక్టర్ల నుంచి ఎలా డబ్బులు రావాలని చూస్తారు
 
 ఇదే చంద్రబాబు హంద్రీ నీవా గురించి జిల్లాలో చాలాసార్లు చెబుతారు
 
 హంద్రీనీవా ప్రాజెక్టు ఆయనే కట్టినట్లు ఫొటోలకు పోజులిస్తారు
 
 వచ్చిన ప్రతిసారీ ఈ ప్రాజెక్టు తన కలల్లోకి వస్తోందని, దానికోసం ఎంతో కష్టపడుతున్నానని, ఇక్కడే మంచం వేసుకుని పడుకుంటున్నానని అంటారు
 
 కానీ వాస్తవంలో ఈ ప్రాజెక్టుకు దివంగత నేత రాజశేఖరరెడ్డి హయాంలో 4వేల కోట్లతో మొదటి దశలో 90 శాతం పనులు పూర్తయ్యాయి
 
 2012లోనే కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా, ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు
 
 వాటన్నింటినీ ప్రజలు మర్చిపోతారనుకుని, కొత్తగా మళ్లీ వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తారు
 
 ప్రాజెక్టులు కట్టినవాళ్లు గొప్పవాళ్లా.. వాటి వద్దకు వెళ్లి గేట్లు ఎత్తేవాళ్లు గొప్పవాళ్లా అని అడుగుతున్నా
 
 మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ తీసుకున్నారు
 
 ఇదే హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయండని, అలా అయితే ప్రతి ఎకరాకు నీళ్లొస్తాయని, అనంతపురం జిల్లాలోనే 1.18 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయని విశ్వేశ్వరరెడ్డి ధర్నాలుచేస్తూ, దీక్షలు చేస్తూ చంద్రబాబును నిలదీశారు
 
 దానికి ఇదే చంద్రబాబు.. తన ప్రాధాన్యతలు తమకున్నాయని, మీరు చెప్పినట్లు మేం చేయాలా అని రైతుల కళ్లల్లో మట్టికొట్టారు
 
 నేను ఇక్కడకు రావడానికి ముందు మంత్రులు చెరువుల దగ్గర నిలబడి, కొందరు అందులో ఈతలు కొట్టారు
 
 30 టీఎంసీల నీళ్లు ఇచ్చినట్లు చెప్పారు. అలా ఇస్తే కనీసం 4 లక్షల ఎకరాల పంటలు సస్యశ్యామలంగా ఉండాలి
 
 నిజంగా అలా అయితే 63 మండలాలు కరువు మండలాలుగా ఎందుకు ప్రకటించారని ప్రశ్నిస్తున్నా
 
 పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, వెలిగొండ ప్రాజెక్టులు చూసుకున్నా చేసింది ఇంతే
 
 పబ్లిసిటీ ఎక్కువ, రైతులకు మేలు చేయలేదు
 
 గతంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి కరువు పరిస్థితులున్నాయని, ఈ ఒక్క జిల్లానుంచి నాలుగైదు లక్షల మంది వలసలు వెళ్తున్నారని, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను ఆదుకోవాలని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించారు.
 
 ఎస్ఆర్ఎంసీని 11వేల క్యూసెక్కుల నుంచి మరో 44వేలు పెంచుతూ 55వేల క్యూసెక్కులకు తీసుకెళ్లారు
 
 రైతులకు తోడుగా ఉండేందుకు 85 శాతం పనులు పూర్తి చేశారు
 
 ఆ మిగిలిన 15 శాతం పనులు ఇంకా పూర్తికాలేదు
 
 ఏ ప్రాజెక్టు చూసినా మిగిలిన 20 శాతం పనులను మూడేళ్లలో చంద్రబాబు చేసిన పాపాన పోలేదంటే ఈయన అసలు ముఖ్యమంత్రేనా అని అడుగుతున్నా
 
 ఈయన హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు..
 
 ఆయన చంద్రబాబు కన్నా బొంకడంలో నాలుగురెట్ల పీహెచ్డీ ఎక్కువ తీసుకున్నారు
 
 అవకాశం వచ్చినప్పుడు ఏదైనా చెరువు కనిపిస్తే ఈతలు కొట్టి, తానే నీళ్లు తెచ్చానంటారు
 
 గతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్ఆర్ పెంచితే, ఇదే మంత్రి ప్రకాశం బ్యారేజి మీద అప్పట్లో ధర్నాలు చేశారు
 
 అదే నాయకుడిని చంద్రబాబు మంత్రి చేశారు. వీళ్లకు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల మీద ప్రేమ ఉందని చెవిలో పూలు పెడతారు
 
 వైఎస్ఆర్ బతికుంటే హంద్రీనీవా పనులు 2011-12 ప్రాంతంలోనే పూర్తయ్యేవి, వలసలు వెళ్లాల్సి వచ్చేదికాదు, రైతుల పొలాలన్నీ సస్యశ్యామలం అయ్యేవి
 
 ఆయన చనిపోయాక రైతులకు తోడుగా నిలబడే మనిషి కరువయ్యాడు
 
 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు పూర్తయితే లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిసి కూడా పట్టించుకోవట్లేదు
 
 రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం దుస్థితి ఏంటంటే.. శ్రీశైలంలో 854 అడుగులపైన 120 రోజులు నీటిమట్టం ఉంది. 
 
 మన్యాల ప్రాజెక్టు 800 అడుగుల్లో పనిచేస్తుందని తెలిసినా, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలు ఈరోజుకూ కరువు ఛాయల్లో ఎందుకున్నాయని ప్రశ్నిస్తున్నా
 
 తుంగభద్ర డ్యాం పూడిక వల్ల నీటిని తీసుకొచ్చే హైలెవెల్ కెనాల్లో నీరు తగ్గిపోయింది
 
 దీనిపై ఏం చేస్తున్నారని ప్రతి సంవత్సరం అడుగుతున్నాం అయినా పట్టించుకోరు
 
 అనంతపురం జిల్లా రైతులు కేరళ వెళ్లి భిక్షాటన చేస్తున్నారంటే చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి
 
 ఉపాధి హామీ పనులు కూడా వారికి ఇవ్వడం లేదు
 
 రాజశేఖరరెడ్డి హయాంలో 98 శాతం వరకు లేబర్ కాంపొనెంట్ పెట్టేవారు
 
 150 రోజుల పనులు కూడా కల్పించిన సందర్భాలున్నాయి
 
 ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక, ఉపాధి హామీ పనులు నత్తనడకన సాగుతున్నాయి
 
 కేరళకు వెళ్లి రైతులు అడుక్కుంటున్నా 40 శాతానికి మించి లేబర్ కాంపొనెంట్ పెట్టడంలేదు
 
 చంద్రబాబు పుణ్యమాని రైతులకు రుణమాఫీలు అమలు కావడం లేదు 
 
 బ్యాంకులలో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు
 
 బాబు సీఎం అయ్యారు గానీ, బంగారానికి బ్యాంకులు వేలం పాటలు పెడుతున్నాయి
 
 ఆడవాళ్లని చూడకుండా పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెళ్లను వదల్లేదు
 
 తానే ఈ సంఘాలను కనిపెట్టానని, వాళ్ల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు
 
 చంద్రబాబు రైతులను, ఆడవాళ్లను, చివరకు చదువుకునే పిల్లలను కూడా వదల్లేదు
 
 జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు
 
 జాబ్ ఇవ్వలేకపోతే ఇంటింటికీ 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు
 
 చంద్రబాబు తనకు 64వేల బాకీ ఉన్నాడని విజయనగరంలో ఒక యువకుడు అన్నాడు
 
 ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు ఎక్కువ. అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులు దాదాపు 25 మంది చనిపోయారు
 
 ప్రతి ఇంటికీ వెళ్లి వాళ్లకు చేతనైనంత వరకు తోడుగా ఉండే ప్రయత్నం చేశాను
 
 ఆరోజు ముఖ్యమంత్రి కావడానికి.. చేనేత కార్మికుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని, వారిని నట్టేట ముంచారు
 
 ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి లక్షన్నర పెట్టి షెడ్డు, ఇల్లు కట్టిస్తానన్నారు, అదీ చేయలేదు
 
 వడ్డీ లేకుండా మరో లక్ష రుణం ఇప్పిస్తానన్నారు
 
 చంద్రబాబు సీఎం అయ్యేనాటికి ప్రతి కుటుంబానికి 600 సబ్సిడీ వచ్చేది, దాన్ని కూడా ఎత్తేశారు
 
 రైతులకు రుణమాఫీ కాక.. వాళ్లు బ్యాంకులకు పోయే పరిస్థితి లేదు
 
 చంద్రబాబు రానంతవరకు రైతులకు వడ్డీ లేకుండా రుణాలు వచ్చేవి
 
 ఇప్పుడు అపరాధ వడ్డీలు కట్టాలని నోటీసులు వస్తున్నాయి
 
 రుణాలు రెన్యువల్ కాలేదు కాబట్టి ఇన్సూరెన్స్ కూడా రావడంలేదు
 
 దేశంలో రాజకీయాల్లో చాలామంది నాయకులను చూశాం. ప్రతి ఒక్కరికీ కొన్ని గుణగణాలుంటాయి
 
 చంద్రబాబుకు ఉన్న విచిత్రమైన గుణగణాలు తెలుసా.. ఆయన సీఎం అవుతూనే ఆయనతోపాటు కరువు వచ్చేస్తుంది
 
 కరువొచ్చినా రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ అంతంతగానే వస్తాయి
 
 రైతులకు కొత్త రుణాలు రావు
 
 రెయిన్ గన్స్ అంటూ వర్షంతో యుద్ధమని, నాలుగు రోజుల్లో కరువును జయించేశానని అంటారు
 
 ఆయన కేంద్రంతో ఎప్పుడూ స్నేహం చేసి, రాష్ట్రంతో యుద్ధం చేస్తాడు
 
 ఈయన సీఎం అయితే కాంట్రాక్టర్లతో స్నేహం చేసి, రైతులతో యుద్ధం చేస్తాడు
 
 ఈయన ఎన్టీఆర్‌తో కయ్యం ఆడతాడు, బాలకృష్ణతో వియ్యం ఆడతాడు
 
 మోదీగారు బలహీనంగా ఉంటే ఆయనతో ఢీ అంటాడు.. ఆయన బలంగా ఉంటే ఆయన కాళ్లు పట్టుకుని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తాడు
 
 అందితే కేసీఆర్ జుట్టు పట్టుకుంటారు, దొరికిపోతే కేసీఆర్ కాళ్లు పట్టుకుంటారు
 
 అటునుంచి అటు పై రాష్ట్రం నీళ్లు ఎత్తుకుపోతున్నా కనీసం అడగడానికి కూడా ధైర్యం చేయడు
 
 కోతలు కొండంత కోస్తాడు.. చేతలు చూస్తే చీమ తలకాయంత కూడా చేయడు
 
 ఈయన పార్టీ పేరు తెలుగుదేశం, పొద్దున్న లేస్తే విదేశాల్లోనే కనిపిస్తాడు
 
 ఒకరోజు సింగపూర్, దావోస్, చైనా, జపాన్.. ఇలా అంటారు
 
 ఏ దేశానికిపోతే దాన్ని ఇక్కడకు తెచ్చేస్తానంటారు
 
 అవినీతి మీద యుద్ధం చేస్తామంటారు.. చేసేది మాత్రం పూర్తిగా అవినీతి రాజ్యం
 
 ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అంటారా.. ముఖ్య కంత్రీ అంటారా అని అడుగుతున్నా
 
 చంద్రబాబు గుణగణాలు చెప్పాల్సి వస్తే మోసం, కుతంత్రం, నయవంచన, అవినీతి, దురాశ, దుర్మార్గం, దుష్టత్వం, ప్రలోభం లాంటివన్నీ కేవలం చంద్రబాబులోనే కనిపిస్తాయి
 
 ఇవన్నీ ఉన్నా తాను చాలా మంచివాడినని నిరంతరం అబద్ధాలు ఆడతారు. 
 
 ఈయన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పర్యటిస్తే ఆయనకు రాజకీయాలు గుర్తుకొస్తాయి
 
 పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఇస్తున్నానంటారు
 
 
 
 అక్కడ 45 టీఎంసీలకు గాను శ్రీశైలం నుంచి అదనంగా తీసుకోవచ్చని జీవో ఇవ్వరు
 
 డెల్టాలో ఆయన పర్యటించినపుడు పట్టిసీమ కట్టాను, డెల్టా రైతులను కాపాడి, 45 టీఎంసీల నీళ్లు ఇచ్చానంటారు
 
 అదే డెల్టాలో ఉన్న పులిచింతలలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద తెలంగాణ రైతులకు 125 కోట్లు ఇస్తే నీళ్లు స్టోరేజి పెంచుకోవచ్చని తెలిసినా చేయరు
 
 ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి పోయే నీళ్ల సంగతేంటంటే ఏమీ మాట్లాడరు
 
 నమ్మేవాళ్లు ఉండాలేగానీ, హంద్రీ నీవా ద్వారా శ్రీకాకుళానికి నీళ్లిస్తామంటారు
 
 కాలువల ద్వారా అమెరికాకు కూడా నీళ్లిస్తామని అనగల గొప్ప ముఖ్యమంత్రి ఈయన
 
 నమ్మేవాళ్లుండాలే గానీ చెవుల్లో ఎంత పెద్ద పువ్వయినా పెట్టడానికి వెనకాడడు
 
 పదవి కోసం సొంతమామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవగలరు, ఎన్నికలు వస్తే ఆయన విగ్రహానికి దండలూ వేయగలడు
 
 వైఎస్ఆర్ గారి పుణ్యమాని ప్రాజెక్టులు ఒక కొలిక్కి వస్తే, మిగిలి ఉన్న పనులు చేయడు, కొద్దో గొప్పో చేసి అక్కడ కుళాయిలు తిప్పి, ప్రాజెక్టులన్నీ తానే కట్టానని డబ్బాలు వాయించుకుంటాడు
 
 రాజశేఖరరెడ్డి మరణించాక గ్రామగ్రామాన విగ్రహాలు వచ్చాయి
 
 తనను ఎవరూ గుర్తుంచుకోరేమోనని మొన్న విశాఖలోని భాగస్వామ్య సదస్సులో తన విగ్రహానికి ఆయనే పూలమాల వేసుకుంటారు
 
 నాయకుడిని ప్రజలు ఎందుకు గుర్తుంచుకుంటారు?
 
 ప్రజలకు మంచి చేస్తే గుర్తుంచుకుంటారని దివంగత నేత వైఎస్ఆర్ చెప్పేవారు
 
 చంద్రబాబు పాలసీ ఏంటో తెలుసా.. మంచి చేసినా చెయ్యకపోయినా ప్రచారం చేసుకుంటే చాలనుకుంటారు
 
 ప్రజలు రాజశేఖరరెడ్డిని గుర్తుంచుకుంటారు, చంద్రబాబును కూడా గుర్తుంచుకుంటారు
 
 ఎక్కడైనా మంచి కనిపిస్తే గుర్తుకొచ్చేది దివంగత నేత రాజశేఖరరెడ్డి
 
 ఎక్కడైనా మోసం కనిపిస్తే, కరువు కనిపిస్తే గుర్తుకొచ్చేది చంద్రబాబు పేరు
 
 సాయంత్రం అయ్యేసరికి ఐదారుగురు మంత్రులు టీవీల ముందుకు వచ్చి, జగన్ అలా, వాళ్ల నాయన ఇలా అని ఏకరువు పెడతారు
 
 ఈ మాటలు విని ప్రజలకు విసుగొచ్చింది
 
 ప్రాజెక్టులు కట్టేది కాంట్రాక్టర్ల కోసం కాదు.. రైతుల కోసమని చెవికి ఎక్కితే చాలు, ఆ మేరకు బుద్ధి, జ్ఞానం వస్తే చాలని అంటున్నా
 
 ఆయన సీఎం అయ్యి మూడేళ్లు కావస్తోంది
 
 దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో.. అప్పట్లో దేశమంతా 8 లక్షల ఇళ్లు కడితే ఒక్కమన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టారు
 
 చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదు
 
 చంద్రబాబు బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు దగ్గర్లోనే ఉందని చెబుతున్నా
 
 చూస్తూ చూస్తూ మూడేళ్లయిపోయింది. మరొక్క సంవత్సరం గడిస్తే ఎన్నికల సంవత్సరం. 
 
 ఆ తర్వాత నాకు రెండేళ్ల సమయం ఇవ్వండి.. హంద్రీ నీవా పూర్తిచేసి చూపిస్తా
 


