breaking news
gurrappa
-
మాజీ న్యాయమూర్తిపైనే దుర్భాషలా?
సాక్షి టాస్క్‌ఫోర్స్: చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని తనను అత్యంత అసభ్యకరంగా, బూతు.. రోత మాటలతో నీచంగా దూషించారని ఆరోపిస్తూ విశ్రాంత న్యాయమూర్తి, సీనియర్ న్యాయవాది గుర్రప్ప నాయుడు తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కోర్టు విచారణలో ఉన్న అవిలాల భూ వివాదంలో బాధిత వృద్ధ దంపతుల తరఫున న్యాయవాదిగా వాదిస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుని టీడీపీ ఎమ్మెల్యే నాని వ్యక్తిగత దూషణలకు దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రగిరి కాంగ్రెస్ ఇన్చార్జి ఐరాల లోకేష్‌రెడ్డికి ఫోన్ చేసి తనను ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునేలా బూతులు మాట్లాడారని, ఆ ఆడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయిందని తెలిపారు. ఒక మాజీ న్యాయమూర్తిని, సీనియర్ న్యాయవాదిని లక్ష్యంగా చేసుకుని ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల సమీపంలోని సర్వే నంబర్ 476/1లో రిటైర్డ్ ఆర్టీఓ ద్వారకనాథరెడ్డి దంపతులకు చెందిన 3.17 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కుట్ర జరిగిందని, రెవెన్యూ రికార్డుల్లో అక్రమ మార్పులు, తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగాయని, బాధితుల తరఫున తాను కోర్టులో పోరాడుతున్నానని గుర్రప్ప నాయుడు తెలిపారు. ఈ వ్యవహారంలో జూన్ 24న తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి రెవెన్యూ శాఖ అవకతవకలను బయటపెట్టిన మరుసటి రోజే టీడీపీ ఎమ్మెల్యే నాని ఫోన్లో తనపై బూతు పదజాలంతో విరుచుకుపడ్డారని ఆరోపించారు. దాదాపు 30ఏళ్ల పాటు న్యాయ అధికారిగా సేవలందించి ప్రస్తుతం తిరుపతిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న తనపై జరిగిన ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని టీడీపీ ఎమ్మెల్యే నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్పీని కోరారు. తనను దూషించినట్టు ఆడియో బయటకు వచ్చిన మరుసటి రోజే తిరుపతి ఎంఆర్‌పల్లిలోని తన కార్యాలయం వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, వారిని కూడా అరెస్టు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎస్వీయూ క్యాంపస్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు.ఇంత నీచమైన భాషా?ఎమ్మెల్యే పులివర్తి నాని తనను ఉద్దేశించి వాడిన బాషను యధాతథంగా విశ్రాంత న్యాయమూర్తి తన ఫిర్యాదులో రాయడం సభ్యత అనిపించుకోదని భావించినప్పటికీ ఇలా పొట్టి అక్షరాల్లో రాశారు. ‘‘వాడెవ్వడో జడ్జి గుర్రప్ప నాయుడు అంట.. వాడి అమ్మను..దెం.. లం.. కొడుకు ఊల్లోళ్లకు పుట్టిన లం...కొడుకు నాపైన పెట్టిస్తున్నాడు.. రిటైర్డ్ జడ్జి.. వాడెవ్వడో పోరంబోకు గుర్రప్ప నాయుడు.. కొడుకు.. నా మొ..గు..సే దానికి లేకుండా.. ఇలాంటి పనులు చేస్తా వుంటాడు.. వాడికి ధైర్యముంటే నేరుగా వచ్చి నా మొ.. తీరా గు..స్తాను అంటే ఓకే.. ’’ అంటూ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక రిటైర్డ్ న్యాయమూర్తినైన నన్ను దూషించారు అంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
విశ్రాంత తహసీల్దార్‌పై కేసు నమోదు
పుట్లూరు : మండలంలోని సూరేపల్లి గ్రామానికి చెందిన గుర్రప్ప అనే రైతు ఫిర్యాదు మేరకు విశ్రాంత తహసీల్దార్ రామచంద్రారెడ్డితో పాటు మరో ఇద్దరు రెవెన్యూ సిబ్బందిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్‌బాబు తెలిపారు. గత జూన్ 30న తహసీల్దార్‌గా రామచంద్రారెడ్డి పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే. అయితే ఆయన పదవీ విరమణ చేస్తున్న రోజే సూరేపల్లి రెవెన్యూలో 180 సర్వే నంబర్లో తనకు చెందిన 5.27 ఎకరాల భూమిలో ఆదిలక్ష్మమ్మ అనే మహిళకు 1.72 ఎకరాల భూమిని ఆన్లైన్ చేసి మోసం చేశారని రైతు గుర్రప్ప ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయమై విశ్రాంత తహసీల్దార్ రామచంద్రారెడ్డి, ఆర్ఐ రాజ్‌కుమార్, వీఆర్వో సంజీవ్‌పై గుర్రప్ప ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీ 420, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


