breaking news
Group fights
-
నల్లగొండ జిల్లాలో భగ్గుమన్న పాతకక్షలు
-
'కారు' చిచ్చు!
సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్: అధికార టీఆర్ఎస్లో విభేదాలు గుప్పుమంటున్నాయి. ఇన్నాళ్లు అంతర్గతంగా రాజుకున్న చిచ్చు వేదికలపై ఒక్కొక్కటిగా బయటపడి తారాస్థాయికి చేరుకుంటోంది. శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య జరిగిన వివాదం రచ్చకెక్కగా.. తాజాగా శనివారం నారాయణపేటలోనూ భగ్గుమన్నాయి. ‘పేట’ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డితో 2014లో టీఆర్ఎస్ తరుఫున పోటీపడి ఓటమిపాలైన కుంభం శివకుమార్‌రెడ్డికి మధ్య కొన్నిరోజులుగా వార్ జరుగుతోంది. ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ శివకుమార్ వర్గానికి చెందిన మాజీ ఎంపీటీసీ, పార్టీ మండల కార్యదర్శి గౌని శ్రీనివాస్ శనివారం బీఎస్ఎన్ఎల్ టవరెక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సముదాయించి కిందకు దించారు. అనంతరం దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి వద్ద శంకుస్థాపన చేసిన సబ్‌స్టేషన్ కార్యక్రమంలో తనను పార్టీలో అవమానిస్తున్నారంటూ మంత్రి సమక్షంలోనే శివకుమార్ మిగతా బహిరంగంగా విమర్శించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో ఇరువర్గాల వారిని మంత్రి సర్దిచెప్పి శాంతపరిచారు. పెరిగిన గ్రూపు తగాదాలు గులాబీ గూటిలో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయి. నాయకులు తమ ఆవేదనలను వేదికలపై వెళ్లగక్కుతున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ల మధ్య పలుమార్లు విభేదాలు పొడచూపాయి. ఒకానొక సందర్భంలో విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం కార్యక్రమం విషయంలోనూ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డిల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ విషయంలో ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మంత్రి జూపల్లి తీరుపై విమర్శలు చేశారు. తాజాగా శుక్రవారం జెడ్పీ అథితిగృహం ప్రారంభోత్సవం విషయంలోనూ మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ల మధ్య మాటలయుద్ధం నడిచింది. ఇలా బడా నాయకుల మధ్య వార్ కొనసాగుతుండగా మరోవైపు నియోజకవర్గాల్లో కూడా క్యాడర్ మధ్య గ్రూపు విభేదాలు పొడచూపుతున్నాయి. రాజకీయ పునరేకీకరణలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్దఎత్తున టీఆర్ఎస్లోకి వచ్చారు. అప్పటికే టీఆర్ఎస్లో ఉన్న నాయకులకు గ్రామ, మండల స్థాయినుంచి విభేదాలు తలెత్తుతున్నట్లు సమాచారం. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. ‘పేట’లో లొల్లి.. నారాయణపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డికి, ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు కుంభం శివకుమార్‌రెడ్డిల మధ్య పచ్చిగడ్డివేస్తే మండేట్లుగా తయారైంది పరిస్థితి. 2014 సాధారణ ఎన్నికల్లో ‘పేట’ నుంచి టీఆర్ఎస్ తరఫున శివకుమార్ పోటీచేయగా.. రాజేందర్‌రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఓడిపోయినప్పటికీ శివకుమార్ తన హవా కొనసాగించారు. అయితే బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ రెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. అప్పటినుంచి ఇరువర్గాల మధ్య అంతర్గత గొడవలు జరుగుతున్నాయి. శివకుమార్‌పై నజర్.. టీఆర్ఎస్లోకి వచ్చిన నాటినుంచి ప్రత్యర్థి శివకుమార్ వర్గంపై ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి నజర్ పెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఎక్కడా శివకుమార్ పేరెత్తకుండా ఆఖరికి ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేసే ఫొటో విషయంలోనూ జాగ్రత్త పడ్డారు. పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలను కూడా ఎమ్మెల్యే అనుచరుల చేతిలోనే ఉండిపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో విభేదాలు బయటపడ్డాయి. నారాయణపేట నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చిన సమయంలో వేదికపై ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ నేతలను ఎమ్మెల్యే సన్మానిస్తూ ప్రస్తావించారు. ఆ సమయంలో టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంభం శివకుమార్‌రెడ్డి ఉన్నా ఆయన పేరును ప్రస్తావించకపోవడం, .సన్మానించకపోవడంతో అందరు అవాక్కయ్యారు. ఈ మధ్యే కంసాన్పల్లి నుంచి ధన్వాడ బీటీ రోడ్డు పనులను ప్రారంభించేందుకు ధన్వాడకు వచ్చిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఎదుట బయటపడ్డ గొడవ మరకముందే అదే మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుడు గౌని శ్రీను ఏకంగా ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడంటూ శనివారం సెల్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. దీన్ని బట్టి ‘పేట’ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గపోరు బయటపడింది. బతుకమ్మలపై ప్రమాణం ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డికి సైతం శివకుమార్ వర్గం చికాకు పెట్టిస్తోంది. గత నెలలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే సొంత మండలం కోయిల్‌కొండలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. రాంపూర్‌కు శివకుమార్‌రెడ్డిని ఆహ్వానించి భారీ ఎత్తున ర్యాలీని చేపట్టారు. ఈ సంబరాల్లో కొంత మంది టీఆర్ఎస్ వర్గీయులు ‘ఇంత వరకు ఎమ్మెల్యేకు మద్దతునిచ్చి తప్పుచేశాం.. శివన్న ఏ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నా.. స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసినా.. మా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది.. బతుకమ్మలపై ప్రమాణం చేస్తున్నాం’ అంటూ శపథం చేశారు. అదేవిధంగా దామరగిద్ద మండలంలోని మొగల్‌మడ్కా పంచాయితీ పరిధిలో గల సుద్దబండాతండాలో రెండు రోజుల క్రితం భవానీ మందిర్ ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యేతో పాటు శివకుమార్‌రెడ్డిని ఆ గ్రామ పాలకులు, నిర్వాహకులు ఆహ్వానించారు. ముందుగా శివకుమార్‌రెడ్డి ఆ తండాకు వెళ్లి పూజల్లో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. దీంతో ఎమ్మెల్యేకు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఇలా అంతర్గతంగా ఉన్న విభేదాలు శనివారం ఒక్కసారిగా బయటపడటంతో జిల్లాలో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. -
ఎస్వీయూ ఇంజనీరింగ్ విద్యార్థుల ఘర్షణ
సాక్షి, తిరుపతి: సినిమాల ప్రభావం విద్యార్థులపై బాగానే ఉంటోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల నేపథ్యంలో పలు సినిమాలు వచ్చాయి. అందులో సినిమాలో విద్యార్థులు గుంపులుగా విడిపోయి కొట్టుకుంటారు. తమ బలం సరిపోకపోతే బయటి కాలేజీ కాలేజీ విద్యార్థులు, వ్యక్తులను తీసుకు వచ్చి గొడవలకు దిగుతారు. ఇప్పుడు అలాంటి ఘటనే తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఎస్వీయూ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు పరస్పర ఘర్షణలకు దిగారు. ఇందులో ఎస్వీయూ రిజిస్ట్రార్ బంధువు నితిన్ చౌదరి దాదాగిరికి పాల్పడ్డాడు. కాలేజీలో రెండు గ్రూపుల్లో నితిన్ చౌదరి ఒకదానికి నేతృత్వం వహిస్తున్నాడు. విద్యార్థుల మధ్య గొడవలు రావడంతో బయటి వ్యక్తులను పిలిపించి సహచరులపై దాడులకు తెగబడ్డాడు. ఇందులో పది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రిన్సిపల్ కార్యాలయంపై దాడిచేశారు. -
గందరగోళంలో టీడీపీ
చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో గ్రూప్ తగాదాలు తేలని టీడీపీ చైర్మన్ అభ్యర్థి పలమనేరులో కాంగ్రెస్ నుంచి వచ్చినవారితో పోటీ! పుంగనూరులో రెండు వర్గాల వైరం మదనపల్లెలోనూ ఇదే తంతు జిల్లా నాయకులకు దిశా నిర్దేశం చేయని చంద్రబాబు సాక్షి, చిత్తూరు: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థులు ఎవరనేది తేల్చుకోలేక టీడీపీ సతమతమవుతోంది. అభ్యర్థులు ఎవరికి వారు టీడీపీ పేరుతో నామినేషన్లు వేశారు. వీరిలో ఎందరికి పార్టీ బీ-ఫారం వస్తుందో తేలాల్సి ఉంది. ప్రతి మున్సిపాలిటీల్లో ఏడెనిమిది మంది టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తానంటే తానని ప్రచారం చేసుకుంటున్నారు. మున్సిపాలిటీల వారీగా చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లూ ధైర్యంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అడిగివారికి మీరే చైర్మన్ అభ్యర్థి గెలుచుకుని రండి చూద్దామంటున్నారు. దీంతో ఆరు మున్సిపాలిటీల్లో ఎవరికివారు చైర్మన్ అభ్యర్థిత్వం కోసం గ్రూప్‌లుగా ఏర్పడి పైరవీలు చేస్తున్నారు. పుంగనూరులో వైఎస్ఆర్సీపీ ముందంజ పుంగనూరులో చైర్మన్ పదవిని మైనారిటీలకే ఇస్తామని ప్రకటించి వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది. నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముస్లింలకు చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించి ఆ దిశగా ముందుకెళుతున్నారు. అదే సమయంలో ఇక్కడ టీడీపీ నియోజకవర్గ నాయకులుగా ఇద్దరు ఉన్నారు. ఎవరి గ్రూప్ వారిదే అన్నట్లు సాగుతున్నారు. టీడీపీ నేత వెంకటరమణరాజు చైర్మన్ అభ్యర్థిత్వానికి కొన్నిపేర్లు సూచిస్తున్నారు. మరో నాయకుడు శ్రీనాథరెడ్డి వర్గం కొన్ని పేర్లు సూచిస్తోంది. టీడీపీ తరఫున ఫలానా సామాజికవర్గానికి లేదా ఫలానా వ్యక్తికి చైర్మన్ పదవి ఇస్తామని ప్రకటించలేని దుస్థితి నెలకొంది. శ్రీకాళహస్తిలో.. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా జనరల్సీటులో బీసీ నాయకుడు మిద్దెల హరిని ప్రకటించారు. అదే స్ఫూర్తితో ఎన్నికలకు పార్టీ దూసుకెళుతోంది. మరోవైపు టీడీపీ చైర్మన్ అభ్యర్థి తేలడం లేదు. టీడీపీ నుంచి గురవయ్యనాయుడు, రాధారెడ్డి పోటీపడుతున్నారు. ఇంకా ఒకరిద్దరు కొత్తగా రాజకీయాల్లోకి దిగినవారు ఆశలు పెట్టుకున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికనేది ఎమ్మెల్యే గోపాలకృష్ణారెడ్డి చెప్పలేదు. కాంగ్రెస్ కూడా ప్రకటించలేదు. మదనపల్లెలో.. మదనపల్లెలోని 35 వార్డులకు అధికంగానే నామినేషన్లు టీడీపీ తరఫున దాఖలయ్యాయి. ఇంతవరకు చైర్మన్ అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ప్రకటించలేని స్థితి. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఒకరు చైర్మన్ పదవి ఆశిస్తున్నా గ్రీన్‌సిగ్నల్ రాలేదు. అలాగే టీడీపీకి చెందిన బీసీ నేత చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. చంద్రబాబు నోటి వెంట నువ్వే మా చైర్మన్ అభ్యర్థివి అన్న మాటరాలేదని వాపోతున్నారు. బీసీ సామాజిక వర్గానికి రిజర్వ అయిన ఈ పదవి కోసం మరో ఆరేడుగురు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. పలమనేరులో.. పలమనేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి, గతం నుంచి టీడీపీలో ఉన్నవారికి చైర్మన్ అభ్యర్థి ఎంపికలో గ్రూప్ రాజకీయాలు సాగుతున్నాయి. గల్లా అరుణకుమారి ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఆమెతో సన్నిహిత సంబంధాలు ఉండి టీడీపీలోకి వచ్చినవారు తమకే చైర్మన్ గిరి అన్న ఆశతో ఉన్నారు. సీటు జనరల్ మహిళ కావడంతో ఏడెనిమిది మంది చైర్మన్ అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకుని ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి ఎక్కడ ప్రాధాన్యం ఇస్తారోనని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొంది. అలాగే జిల్లా నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయడం లేదు.