breaking news
Group -2 Post
-
గ్రూప్-2 జవాబు పత్రాల డిజిటైజేషన్
- భవిష్యత్తు అవసరాల కోసం జేపీజీ ఫార్మాట్లోకి మార్పు - రేపటికల్లా పూర్తికానున్న ప్రక్రియ, ఆ తరువాతే ప్రాథమిక ‘కీ’ విడుదల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1,032 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఈ నెల 11, 13 తేదీల్లో నిర్వహిం చిన రాత పరీక్ష జవాబు పత్రాల డిజిటైజేషన్‌కు టీఎస్పీఎస్సీ శ్రీకారం చుట్టింది. భవిష్యత్తు అవసరాలు, రిఫరెన్స కోసం అభ్యర్థుల జవాబు పత్రా లను జేపీజీ ఫార్మాట్లోకి మారుస్తోంది. పరీక్ష రాసేందుకు 7,89,437 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 63 శాతం మంది హాజరయ్యారు. వారందరికి సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ చేపడుతోంది. దీంతో భవిష్యత్తులో మూల్యాంకనానికి సంబంధించిన సమస్యలు తలెత్తినా డిజిటలైజ్ చేసిన జవాబు పత్రాలను చూసుకునేలా వాటిని టీఎస్పీఎస్సీ సర్వర్‌లో భద్రపరుస్తోంది. తద్వారా పారదర్శకతకు పెద్దపీట వేయవచ్చని భావిస్తోంది. ఈ ప్రక్రియ బుధవారం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తరువాతే గ్రూప్-2 రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ని టీఎస్పీఎస్సీ విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి తగిన చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఆ తరువాతే చేపట్టి ఫలితాలను ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. -
గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్టు సిలబస్ ఇదే
వెబ్సైట్లో పొందుపరిచిన ఏపీపీఎస్సీ సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి కొత్తగా ప్రవేశపెడుతున్న స్క్రీనింగ్ టెస్టు సిలబస్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. సిలబస్ సమాచారాన్ని ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో బుధవారం పొందుపరిచారు. సిలబస్‌లోని అంశాలిలా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్:రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక, కళలు, క్రీడలు, సాంస్కృతిక,పాలనా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ అంశాలు. రాజ్యాంగంలోని గణతంత్ర, ప్రాథమిక హక్కులు, విధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ, న్యాయ సమీక్ష, స్థానిక సంస్థలు, కేంద్ర, రాష్ట్ర చట్టసభలు, కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిపాలన, చట్టపరమైన సంబంధాలు గిరిజన ప్రాంతాల పాలనా వ్యవస్థ. భారత ఆర్థికాభివృద్ధి: మధ్యయుగ భారత ఆర్థిక వ్యవస్థ, స్వాతంత్య్ర పూర్వపు భారత ఆర్థిక వ్యవస్థ, స్వాంతంత్య్రానంతరం దేశంలో అభివృద్ధి ప్రణాళికలు, ఆర్థిక, పారిశ్రామిక విధానాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కార్మిక విధానాలు, భారతదేశంలో వ్యవసాయం, హరిత విప్లవం పాత్ర, ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలు, జనాభా. 1999 గ్రూప్-2 పోస్టుల భర్తీపై కసరత్తు 1999 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్ జాబితాను మరోసారి రూపొందించి పోస్టింగ్‌లు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంపై ఏపీపీఎస్సీ ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. మరో పక్షం రోజుల్లో ఈ నియామకాలు పూర్తిచేయవచ్చని తెలుస్తోంది. త్వరలోనే మెరిట్ జాబితాను ఖరారు చేసి నియామకాలు పూర్తిచేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. తాజా మెరిట్ జాబితా ప్రకారం 317 మంది కొత్తగా ఎంపికైన వారికి ఈనెలాఖరు లేదా వచ్చే నెలారంభంలో ఇంటర్వ్యూలు ఉండవచ్చని తెలుస్తోంది.