breaking news
govt orders CID probe
-
'నన్ రేప్' కేసులో ఎనిమిదిమంది అరెస్టు
రణఘాట్(పశ్చిమబెంగాల్): కోల్ కత్తాలో 72 ఏళ్ల సన్యాసిని(నన్)పై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఎనిమిదిమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ పుటేజ్‌ను సొంతం చేసుకున్న సీఐడీ పోలీసులు నలుగురు నిందితులను గుర్తించారు. ఆ దిశగా గాలింపు చర్యలు ప్రారంభించగా ఎనిమదిమంది పట్టుబడ్డారు. మరికొందరని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈలోపు నిందితులను అరెస్టు చేసేందుకు అవసరమైన వివరాలు చెప్పినవారికి రూ.లక్ష అందిస్తామని అంతకుముందు పోలీసులు ప్రకటించారు. కోల్‌కత్తాలోని నాడియా జిల్లా లోని గంగ్నాపూర్ లో 72 సం.రాల నన్ పై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అర్థరాత్రి తరువాత ఓ స్కూల్లోకి చొరబడ్డ సుమారు పన్నెండుమంది దొంగల్లో నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, లాకర్ లోని 12 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. -
నన్ పై గ్యాంగ్ రేప్
కోల్ కత్తా: కోల్ కత్తాలోని నాడియా జిల్లా లోని గంగ్నాపూర్ లో 72 సం.రాల నన్ పై సామూహిక అత్యాచారం కలకలం సృష్టించింది. పోలీసుల సమాచారం ప్రకారం గత అర్థరాత్రి తరువాత స్కూల్ లోకి చొరబడ్డ సుమారు పన్నెండుమంది దొంగలు నన్ పై సామూహిక అత్యాచారం చేసి, లాకర్ లోని 12 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్కూలు సిబ్బంది ఆమెను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఈవార్త దావానలంలో వ్యాపించడంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానికంగా రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధనం చేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ పీడీ సలీం, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటనగా ఆయన అభివర్ణించారు. పూర్తి వివరాలను ఇంకా తెలియాల్సి ఉందని నేరస్తులను తక్షణమే అదుపులోకి తీసుకుని తగినవిధంగా శిక్షిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఫిరాద్ హామీ ఇచ్చారు.