government shock
-
కమీషన్ల కోసమే తొలగింపు !!
విజయనగరం: ఏళ్ల తరబడి పట్టణ ఆరోగ్యకేంద్రాల నిర్వహణను చూస్తున్న బాధ్యతలను తప్పించి స్వచ్ఛంద సంస్థలకు సర్కార్ షాక్ ఇచ్చింది. పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి రికార్డులు, భవనాలు, ఉద్యోగులు, ఫర్నిచర్, మందులు తదితర అన్నింటిని వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించాలని ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈనెలఖారులోగా అప్పగించే పక్రియ పూర్తి కావాలని నోటీస్‌లో పేర్కొంది. జిల్లాలో 8 పట్టణ ఆరోగ్య కేంద్రాలు విజయనగరం బీసీ కాలనీలో ఒకటి, రాజీవ్‌నగర్ కాలనీలో ఒకటి, ఫూల్‌బాగ్‌లో ఒకటి, లంకాపట్నంలో ఒకటి, బొబ్బిలిలో రెండు పార్వతీపురంలో ఒకటి, సాలురులో ఒకటి పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఒక వైద్యాధికారి, వైద్యాధికారికి సహాయకుడు ఒకరు, కమ్యూనిటీ ఆర్గనైజరు ఒకరు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక వాచ్‌మన్, ఒక అటెండర్ పనిచేస్తున్నారు. ప్రస్తుతం పట్టణ ఆరోగ్యకేంద్రాల నిర్వహణను స్వచ్చంద సంస్థల ప్రతినిధులు చూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఆ బాధ్యతలను తప్పించింది. కమీషన్ల కోసమేనా? ప్రస్తుతం ఐదు, ఆరు స్వచ్ఛంద సంస్థలు పట్టణ ఆరోగ్య కేంద్రాలను జిల్లాలో నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణ ఒకే సంస్థకు కట్టబెడితే పెద్ద ఎత్తున కమీషన్లు వస్తాయనే భావనతోనే ప్రభుత్వ పెద్దలు ఈవిధంగా స్వచ్ఛంద సంస్థలకు బాధ్యతలు తప్పించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఇదే విషయాన్ని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి వద్ద సాక్షి ప్రస్తావించగా స్వచ్ఛంద సంస్థలకు పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం తప్పించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. 19 వేల జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం పట్టణంలోని వెనుకబడిన వర్గాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 19 వేల మంది జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. ఆయా ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న పేద ప్రజలు జలుబు, జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, గాయాల వంటి సాధారణ వ్యాధులకు అవసరమైన పరీక్షలు చేసి వాటికి మందులు అందజేస్తున్నారు. అదేవిధంగా గర్భిణులకు, పిల్లలకు టీకాలు కూడా వేస్తున్నారు. -
రైతుకు కరెంట్‌షాక్..!
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: రైతులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పెట్టింది. ఇప్పటి వరకు అనధికారికంగా కోతలు విధిస్తున్న సర్కారు ఇక అధికారికంగానే ఆ పని చేయనున్నట్లు ప్రకటించింది. వ్యవసాయానికి ఇకపై ఏడు గంటలకు బదులు ఆరు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అందనున్నది. పగలు మూడు గంటలు, రాత్రి మూడు గంటల చొప్పున రెండు విడతల్లో సరఫరా చేయనున్నారు. ఆదివారం నుంచే ఈ విధానం అమలు కానుంది. చాలినంత సమయం కరెంట్ అందకపోనుండటంతో వ్యవసాయం ఇక రైతులకు భారం కానుంది. బావి, బోర్ల కింద సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ రబీలో పంటలు సాగు చేసిన రైతులకు మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. మంత్రులు, ప్రజాప్రతినిధులకు రైతుల సమస్యలు పట్టడం లేదని, దీనిపై మౌసం వీడి విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. నీరుగారిన ఉచిత విద్యుత్ హామీ: రైతుల సంక్షేమం కోసం వ్యవసాయానికి 7గంటల పాటు ఉచిత విద్యుత్ అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో తెలుగుదేశంపాటు ఇతర పార్టీలు సాధ్యం కాదని చెప్పినా 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ ఫైలుపైనే తొలి సంతకం చేసి సాహసోపేతంగా ఆచరణలో పెట్టారు. అప్పటివరకు జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రైతుల కోసం 5,085 కనెక్షన్లు మంజూరు చేసి వీటి కోసం రూ..39.74 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఉచిత విద్యుత్ కనెక్షన్ల సంఖ్య లక్షకు పైగా ఉంది. కొంత కాలంగా థర్మల్ పవర్ ప్లాంట్లలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణాలతో విద్యుత్ ఉత్పత్తి బాగా పడిపోయింది. దీంతో జిల్లాలో అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం వ్యవసాయ విద్యుత్‌పై కూడా తీవ్రంగా పడింది. ఇకపై ఏడు గంటల్లో గంట సేపు కోత పెట్టి ఆరు గంటలే ఇవ్వనున్నారు. ప్రకటించిన ఆరు గంటలు కూడా అమలు చేయడం ప్రశ్నార్థకమేనని, అందులో అనధికారికంగా కూడా కోతలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉచిత విద్యుత్ రైతులతోపాటు తాత్కాల్, రెగ్యులర్ కనెక్షన్లపై ప్రభావం చూపనుంది.