పాములాంటి.. చేప
అచ్చం పాములా ఉన్న ఇది ఓ జాతి చేప. మలుగు పాముగా పిలిచే ఈ చేప సాధారణంగా 3 నుంచి 4 అడుగుల మేర పెరుగుతుంది. అందుకు భిన్నంగా ఏకంగా 8 అడుగుల మేర పెరిగిన ఈ మలుగు పాము చేప పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం చేపల మార్కెట్లో అమ్మకానికి వచ్చింది. 5 కిలోల బరువు తూగిన ఈ చేపను స్థానికులు రూ. 500లకు కొనుగోలు చేశారు. కాకినాడ సమీపంలోని సముద్రంలో దీనిని పట్టి తీసుకొచ్చినట్టు వ్యాపారి సీహెచ్ వెంకట్రావు చెప్పారు.
- గోపాలపురం