breaking news
Godari water
-
దేవుడు వరమిచ్చాడు..
సాక్షి, హైదరాబాద్: ఎగువన ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉప్పొంగుతోంది. అంతకంతకూ వరద ఉధృతి పెరగడంతో జూరాల నుంచి శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 2నెలలుగా నీటి రాకకై ఎదురుచూసిన శ్రీశైలం ప్రాజెక్టులోకి కరువుదీరా వరద వచ్చి చేరుతోంది. గురువారం ఒక్కరోజే శ్రీశైలంలోకి 12టీఎంసీల మేర నీరు వచ్చి చేరగా, శుక్రవారం అది మరింత పెరిగి 24గంటల్లో ప్రాజెక్టులోకి కొత్తగా 17 టీఎంసీల నీరొచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టు నిల్వ 60 టీఎంసీలను చేరగా, 2లక్షల క్యూసెక్కుల (18.18 టీఎంసీలు)మేర ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి. శ్రీశైలంలో పెరుగుతున్న నిల్వ: కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద 2లక్షల క్యూసెక్కులకు ఏమాత్రం తగ్గడం లేదు. వర్షాలు కొనసాగుతుండటంతో ప్రవాహాలు ఉధృతంగా ఉన్నాయి. శుక్రవారం సైతం ఆల్మట్టిలోకి 2లక్షల క్యూసెక్కుల (18.18 టీఎంసీలు) మేర వరద రావడంతో.. 2.30లక్షల క్యూసెక్కుల (20.9టీఎంసీలు) మేర నీటిని దిగువకు వదులుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆల్మట్టిలోకే 172టీఎంసీల మేర కొత్తనీరు వచ్చింది. ఆల్మటినుంచి భారీగా నీరు వస్తుండటంతో నారాయణపూర్ నుంచి దిగువకు 2.10లక్షల క్యూసెక్కుల (19టీఎంసీలు) నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జూరాలకు వరద ఉధృతి స్థిరంగా ఉంటోంది. శుక్రవారం సాయంత్రానికి జూరాలలోకి 2.05లక్షల క్యూసెక్కుల (18.62 టీఎంసీలు) మేర ప్రవాహం వస్తుండటంతో 24 గేట్ల ద్వారా 2.08లక్షల క్యూసెక్కుల (18.63టీఎంసీలు) నీటిని నదిలోకి వదిలారు. మరో 5,800 క్యూసెక్కుల మేర నీటిని నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌లతో పాటు జూరాల కుడి, ఎడమ కాల్వలకు వదులుతున్నారు. నదిలోకి వదిలిన నీరంతా శ్రీశైలానికి వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలానికి 1.98లక్షల క్యూసెక్కులు (18 టీఎంసీలు) మేర ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టులో నిల్వలు అమాంతం పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ప్రాజెక్టులోకి 17టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. దీంతో నిల్వ 215 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 60 టీఎంసీలుగా ఉంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటం, స్థానిక పరివాహకంలోనూ వర్షాలు కురుస్తుండటంతో ఈ ప్రవాహాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ విధమైన ప్రవాహాలే కొనసాగితే మరో మరో 10 రోజుల్లోనే శ్రీశైలం పూర్తిగా నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీటి విడుదల కొనసాగనుంది. 10 టీఎంసీలకు ఎల్లంపల్లి ఇక గోదావరిలోనూ రోజురోజుకీ గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం మేడిగడ్డ వద్ద 3.70లక్షల క్యూసెక్కుల (33.63టీఎంసీలు) మేర ప్రవాహాలు నమోదయ్యాయి. ఇక ఎల్లంపల్లికి సైతం స్థానిక పరివాహకం నుంచి 4,800 క్యూసెక్కుల మేర వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 20టీఎంసీలకు గానూ 10టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లిలో సరిపడినంత నీటి నిల్వలు చేరడంతో కాళేశ్వరంలోని ప్యాకేజీలు–6,7,8ల ద్వారా నీటిని తరలించే ప్రక్రియకు ఇంజనీర్లు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ప్యాకేజీ–6,8 పంప్‌హౌస్‌ల్లో 7 మోటార్లకు 5 మోటార్లు సిధ్దంగా ఉండగా ప్యాకేజీ–7లో రెండు, మూడ్రోజుల్లో పూర్తి కానున్నాయి. 5వ తేదీ నాటికి ఎత్తిపోతలు మొదలు పెట్టాలని భావించినా.. ఒకట్రెండు రోజులు అటుఇటుగా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు ఎత్తిపోతలు ఆరంభం కానుంది. -
గ్రేటర్ ప్రజలకు గోదారి నీళ్లు
ఏటూరునాగారం : గ్రేటర్ వరంగల్ ప్రజలకు గోదావరి జలాలు మరో 24గంటల్లో అందనున్నాయి. వేసవిలో నీటి కష్టాలు ఎదుర్కొం టున్న మహా నగర ప్రజలకు ఏటూరునాగా రం మండలంలోని దేవాదుల ఇన్ టేక్‌వెల్ నుంచి నీరు సరఫరా చేయాలని నిర్ణయిం చగా, కార్పొరేషన్ నుంచి రూ. 8.69 కోట్లు నిధులతో ఎమర్జెన్సీ పంపింగ్ సిస్టం ఏర్పాటు చేసిన విషయం విదితమే. గోదావరి ఒడ్డుపై 70 హార్స్పవర్ సామర్థ్యం కలిగిన 16 మో టార్లు, గోదావరి నది మధ్యలో రెండు ఇనుప పడవలపై 50 హార్స్పవర్ కలిగిన 16 సబ్ మెర్సిబుల్ మోటార్లు అమర్చి వీటి ద్వారా దేవాదుల ఇన్ టేక్‌వెల్ ఫోర్‌బేలోకి నీరు పం పింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు క్యూ బిక్ మీటర్ల మేర నీరు చేరడంతో దేవాదుల మొదటి దశలోని ఒక మోటారును మంగళవారం రాత్రి ప్రారంభించారు. 500 హెచ్‌పీ సామర్థం కలిగిన ఒక్క మోటారు ఒక్క సెకండ్‌కు ఐదు వేల లీటర్ల నీటిని డెలివరీ చేస్తోంది. ఈ మేరకు నీరు పైపులైన్ ద్వారా భీంఘన్‌పూర్, పులుకుర్తి, ధర్మసాగర్ రిజర్వాయర్లకు గురువారం నాటికి చేరుతుంది. నిమిషానికి ఆరు క్యూబిక్ మీటర్లు దేవాదుల వద్ద ఏర్పాటు చేసిన 32 మోటార్లతో ఒక నిమిషానికి ఆరు క్యూబిక్ మీటర్ల మే ర నీరు ఇన్ టేక్వెల్కు వెళ్లే కెనాల్లోకి పం పింగ్ చేస్తోంది. ఇలా గోదావరి నీరు అంతా ఇన్టేక్వెల్లోని ఫోర్‌బేలకు 72 మీటర్ల మేర చేరుకుంది. ఇలా 24 గంటల పాటు నీరు ఫోర్‌బేలకు చేరడంతో 864 క్యూబిక్ మీటర్లకు నీటి సామర్థ్యం పెరగనుంది. నగర ప్రజలకు కావాల్సిన నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్‌లో 350 ఎంసీఎఫ్‌టీ మేర నిల్వ చేసేందుకు 23 రోజుల పాటు దేవాదుల పైపులైన్ నుంచి మోటార్లు ఎత్తిపోయనున్నాయి. ఈక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.