బాహు 'బలి'
హైదరాబాద్: అభిమాన హిరో సినిమా రిలీజైందంటే.. అభిమానుల సందడి అంతా ఇంతాకాదు. కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, పూలదండలు, పాలాభిషేకాలు ఎక్కడ చూసిన పండగ వాతావరణమే.. అలాంటిది తెలుగు సినిమా స్టామినా ప్రపంచానికి చాటిచెప్పబోతున్న బాహుబలి సినిమా సందడి మామూలుగా ఉంటుందా.. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా భారత సినీ చరిత్రను తిరగరాయాలని కోరుతూ అభిమానులు పూజలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో శుక్రవారం బాహుబలి చరిత్ర సృష్టించాలని కోరుతూ పోస్టర్ ముందు మేకను బలి ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.