breaking news
girl sahana
-
‘సహన’ వైద్యానికి సర్కారు సాయం
హైదరాబాద్: ‘సహన‘ తలరాతను మారుద్దాం.. అనే శీర్షికతో ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు సహన వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. రెండు లక్షలు మంజూరయ్యాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి తీగుళ్ల పద్మారావుగౌడ్ మంగళవారం మంజూరుపత్రాన్ని అందజేశారు. మరో లక్ష రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో లక్ష రూపాయల సహాయం అందజేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి కొంతసేపు సహనతో ముచ్చటించారు. ఆమె ఆరోగ్యం గురించి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. సహనకు మెరుగైన వైద్యం చేయించాలనీ స్థానిక కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి హరిని మంత్రి పురమాయించారు. సికింద్రాబాద్ నియోజక వర్గం తార్నాక డివిజన్ పరిధిలోని మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన లక్ష్మమ్మ మనుమరాలు సహన(10) చిన్నప్పటి నుంచి వింత వ్యాధితో బాధపడుతోంది. పేదరికం కారణంగా కుటుంబసభ్యులు ఆమెకు మెరుగైన వైద్యం అందించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సహన దీనస్థితిపై ‘సాక్షి’లో కథనం రావడంతో ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు సహన కుటుంబసభ్యులు, స్థానికులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఆశలు నెరవేర్చుకున్న 'సహన'...
సహన అక్కల బాధ్యత తీసుకున్న సర్వ నీడీ వాలంట్రీ ఆర్గనైజేషన్ మారేడుపల్లి : నిరుపేద చిన్నారి సహనపై ‘సాక్షి’లో వచ్చిన కథనం పలువురి మనసులను కదిలించింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆ చిన్నారి మనసులో ఆనందం వెల్లివిరిసేలా చేసేందుకు ముందుకు వచ్చారు. ఆసుపత్రికి తప్ప ఇంటి నుంచి బయటకు రాని సహనను ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి బయటకు తీసుకువచ్చారు. చిన్నారి తన ఆలోచనలను వారితో పంచుకుంది. తన పుట్టిన రోజు జరుపుకొని, దీపావళి కాంతులను చూసి, ఆ దేవుని దర్శనం చేసుకోవాలని ఉందని వారికి తన కోర్కెలను తెలియజెప్పింది. సహనను వారి కుటుంబ సమేతంగా కార్ఖాన జూపిటర్ కాలనీలోని సర్వ నీడీ ఆర్గనైజేషన్‌కు శుక్రవారం తీసుకువెళ్లారు ఆర్గనైజేషన్ ప్రతినిధులు. ఫౌండేషన్‌లోని చిన్నారులుమొదట కొత్త వస్త్రాలతో ఆమెను అలంకరించారు. కేక్ కట్ చేయాలన్న సహన కోరిక మేరకు న్యూ ఇయర్ వేడుకలనే ఆమె పుట్టిన రోజుగా మార్చారు. అనంతరం కుటుంబ సభ్యుల మధ్య బర్త్‌డే కేక్ కట్‌చేసింది. దీపావళి క్రాకర్స్ కాల్చి న ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. అనంతరం దగ్గర్లోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెక్కాడితే కాని డొక్క నిండని వారి పరిస్థితిపై చలించిన ఆర్గనైజేషన్ డెరైక్టర్ గౌతమ్‌లు సహన అక్కయ్యలు మేఘన, సంధ్యరాణి బాధ్యతలను తీసుకున్నారు. వారి చదువుతోపాటు సర్వ నీడీ ఫౌండేషన్లోనే ఉండేందుకు వారికి రూంను ఏర్పాటు చేశారు. సహన ఆపరేషన్ అనంతరం తమ వద్దకు వస్తే ఆశ్రయం కల్పించి, విద్యాబుద్ధులు నేర్పుతామని హామీ ఇచ్చారు ఆర్గనైజేషన్ నిర్వహకుడు వెంకట్ రామరెడ్డి. సహన పుట్టిన రోజు వేడుకల్లో ఆమె కుటుంబసభ్యులతో పాటు ఆర్గనైజేషన్ నిర్వహకులు లలిత, అనుప, హిందు పాల్గొన్నారు.