breaking news
fool people
-
ఫూల్స్‌ని చేయడం ఆపేయండి! వీడియో కాల్లో పుతిన్ ఫైర్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీడియో కాల్లో ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్‌పై సీరియస్ అయ్యారు. దేశ పౌర సైనిక విమాన ఒప్పందం విషయంలో జాప్యం చేస్తున్నందుకు మంటురోవ్‌పై పుతిన్ మాటల తుటాలు పేల్చారు. ఈ మేరకు బుధవారం రష్యా ప్రభుత్వ టెలివిజన్ ప్రసారంలో.. ప్రభుత్వాధికారల సమావేశంలో జరిగిన ఒక వీడియో కాల్లో పుతిన్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి, ఉప ప్రధాని మంటురోవ్‌పై విరుచుకుపడ్డారు. 2023 ఏడాదికి సంబంధించి పౌర సైనిక విమాన ఒప్పందాలను ఒక నెలలోపు పూర్తి చేయాలని గట్టిగా హెచ్చరించారు. వాస్తవానికి రష్యా విమానాయన సంస్థ ఏరోప్లాట్తో దాదాపు 175 బిలియన్ల రూబిళ్లు(రూ. 21 వేల కోట్లు) విలువైన ఒప్పందాలు ఏర్పాటు చేసే బాధ్యత మంటురోవ్‌పై ఉంది. ఐతే సైనిక విమాన కాంట్రాక్ట్‌లు ఏవి సిద్ధంగా లేకపోవడంతోనే పుతిన్ తీవ్ర అసహనానికి గురైనట్లు అధికారికి వర్గాల సమాచారం. దీనికి మీరు చాలా వ్యవధి తీసుకుంటున్నారంటూ తిట్టిపోశారు. సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని గట్టిగా నొక్కిచెప్పారు. అయినా మీరు ఇప్పటివరకు ఏ ఎంటర్‌ప్రైజెస్‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదన్న విషయం తనకు తెలసునంటూ సీరియస్ అయ్యారు. ఒకవేళ ఒప్పందాలు పూర్తి అయితే గనుక ఎప్పుడూ సంతకాలు చేశారో చెప్పగలరా! అని గట్టిగా నిలదీశారు. ముందు మీరు అందర్నీ ఫూల్స్‌ని చేయడం ఆపేయండి అంటూ ఉపప్రధాని మంటురోవ్కి గట్టిగా చురకలంటించారు. బాగా ఉత్తమంగా ప్రయత్నించాలని చూడొద్దు, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని సాధ్యమైనంత తొందరగా.. కేవలం ఒకనెలలోపే ఈ ఒప్పందాలను పూర్తి చేసేలా ప్రయత్నించండి అంటూ పుతిన్ డిప్యూటి ప్రధాన మంత్రి మంటురోవ్కి గడువు కూడా ఇచ్చారు. దీనికి ఉప ప్రధాని మంటూరోవ్ పుతిన్‌కి సమాధానం ఇస్తూ..అందుకు సంబంధించిన ఆర్డర్లు సిద్ధంగానే ఉన్నాయని, తొందరగా పూర్తి చేసేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఐతే రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాత్రం అధ్యక్షుడి పుతిన్‌కి మంటురోవ్ పనితీరుపై ఎలాంటి ఫిర్యాదుల లేవని క్రెమ్లిన్ మీడియాకి చెప్పాడం గమనార్హం. Russian aviation industry didn't receive a single contract to produce a passenger plane in 2022. pic.twitter.com/9xwHYTBC3X — Anton Gerashchenko (@Gerashchenko_en) January 11, 2023 (చదవండి: క్రిమియాకు ఎందుకంత క్రేజ్? ) -
ప్రజల్ని పిచ్చోళ్లని చేస్తా..డబ్బు సంపాదిస్తా..
-
ప్రజల్ని పిచ్చోళ్లని చేస్తా..డబ్బు సంపాదిస్తా..
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల చిత్రపటంలో ఓ ఆసక్తికరమైన అంశం నమోదైంది. ఆగ్రా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటిస్తున్న వ్యక్తి షాకింగ్ ప్రచారంతో వెలుగులోకి వచ్చారు. తాను డబ్బుకోసమే రాజకీయాల్లోకి వచ్చానంటూ ఇండిపెండెంట్ అభ్యర్థి చౌదరి బహిరంగంగా ప్రకటించుకోవడం సంచలనంగా మారింది. ఈ అభ్యర్థి చేస్తున్న ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజకీయాల్లో రావడానికి కారణం కేవలం డబ్బు సంపాదించడానికే.. ప్రజల్ని అవివేకులను (ఫూల్స్) చేస్తానంటున్నాడు. అంతేకాదు దాదాపు అందరూ రాజకీయాల్లోకి పరోక్షంగా అదే ఉద్దేశ్యం తో వస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోఅడుగు ముందుకేసి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తన దాడిని ఎక్కుపెట్టి, విమర్శలు గుప్పించారు. ప్రజల్ని పిచ్చోళ్లని చేసి...ఒక వ్యక్తి దేశాన్నేలుతున్నపుడు ..తానెందుకు చేయలేనని ప్రశ్నించారు. తానూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానంటున్నారు .ప్రజలను ఫూల్స్ ని చేసిన ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు. దానికి కొంత టాలెంట్ ఉండాలంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.