breaking news
five crore rupees
-
రూ.5కోట్ల భూమి ఆక్రమణకు యత్నం
పోరుమామిళ్ల : రాత్రికి రాత్రి ప్రభుత్వభూమి ఆక్రమించుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.రెవెన్యూ అధికారుల ఉదాసీన, నిర్లక్ష వైఖరి వల్ల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వభూములు అన్యాక్రాంతమవుతున్నాయి. రెండు దశాబ్దాల కాలంగా నిరాటంకంగా జరుగుతున్న కబ్జాలను అరికట్టే చర్యలు జరగలేదు. అధికారులు రెవెన్యూచట్టాలను ఉపయోగించి, కఠినచర్యలు తీసుకోకపోవడం అక్రమణదారులకు వరంగా మారింది. కబ్జాదారులు బోగస్‌పత్రాలు సృష్టించి, కార్యాలయ సిబ్బంది సహకారంతో రికార్డుల్లో నమోదు చేయించడం, అడ్డుకుంటే కోర్టు మెట్లెక్కడం పరిపాటిగా మారింది. మండల కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ప్రభుత్వభూములపై చాలాకాలంగా కబ్జాదారులు కన్ను వేశారు. వాటిని స్వాధీనం చేసుకుంటే కోట్ల రూపాయలు సునాయాసంగా జేబులో పడతాయన్న దురాశతో అధికారులను, నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఈ విషయంలో సఫలీకృతులయ్యారు.ఈ నేపథ్యంలో సర్వేనెంబరు 1008, 1009లో ఆదివారం రాత్రి డోజర్‌తో చదును చేసి, అందులో నిర్మాణాలు చేపడితే కోట్లరూపాయల భూమి సొంతమవుతుందని కొందరు భావించారు. ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతుండగా గమనించినవారు తహసీల్దారుకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన వీఆర్వోను అలర్ట్ చేయడంతో వారు ప్రయత్నాలు ఆపి పరారైనట్లు తెలిసింది. ఈ స్థలం ఏడెమిదేళ్లుగా వివాదంగా ఉంది. ఆ సర్వేనెంబరులో రంగసముద్రం సచివాలయం నిర్మించారు. ప్రభుత్వస్థలంలో భవనం నిర్మిస్తే, కొంతమంది ఆస్థలం స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా బోగస్ పత్రాలు సృష్టించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. బోగస్ పత్రాల సహకారంతో కోర్టుకు పోవడం, సచివాలయం నిరుపయోగంగా మారడం జరిగింది. ఏడేళ్లుగా ఈ స్థలాన్ని ప్రభుత్వభూమిగా స్పష్టం చేయడం అధికారులకు సాధ్యం కాలేదంటే రెవెన్యూశాఖ పనితీరు గురించి అర్థం చేసుకోవచ్చు. పోరుమామిళ్ల–మైదుకూరు ప్రధాన రహదారిలో ఉన్నందున ఆ భూమి విలువ రూ. 5 కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. కబ్జాకు ప్రయత్నం చేసినవారిపై కేసు పెడతామని అధికారులు తెలిపారు. సోమవారం బంద్ దృష్ట్యా సిబ్బంది రాలేదని, మంగళవారం పూర్తి వివరాలతో కేసు పెడతామన్నారు. ఆక్రమణకు ప్రయత్నించిన వారి వివరాల గురించి ప్రశ్నించగా విచారిస్తున్నామని, రేపు చెబుతామన్నారు. చర్యలు తీసుకుంటాం: తహసీల్దార్ చంద్రశేఖరవర్మ సర్వేనెంబరు 1008, 1009లో జరిగిన ఆక్రమణ గురించి తహసీల్దారు చంద్రశేఖరవర్మ, వీఆర్ఓ సదానందంలను వివరణ కోరగా దుండగుల గురించి విచారిస్తున్నామన్నారు. భూమి చదును చేసేందుకు ఉపయోగించిన యంత్రం (డోజర్/ జేసీబీ) స్వాధీనం చేసుకుంటామన్నారు. దాదాపు ఎకరన్నర భూమి చదును చేశారన్నారు. ఆ భూమిపై కోర్టులో ‘డబ్ల్యూఎపి 4755/2011, 4788/2011’ నంబర్లతో కేసు నడుస్తోందన్నారు. -
బాబు కోసం ఐదు కోట్ల బస్సు
-
బాబు కోసం ఐదు కోట్ల బస్సు
సీఎం బసకు బుల్లెట్, బాంబు ప్రూఫ్ బస్సు కొనుగోలు చేసిన ఆర్టీసీ సాక్షి, విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కోసం రూ. 5 కోట్లతో అత్యంత సౌకర్యవంతమైన బస్సును ఏపీఎస్ ఆర్టీసీతో ప్రభుత్వం కొనుగోలు చేయించింది. పటిష్టమైన భద్రత కోసం బుల్లెట్, బాంబు ప్రూఫ్‌గా బస్సును రూపొందించారు. ఆ బస్సును శుక్రవారం విజయవాడ క్యాంపు ఆఫీసు వద్ద చంద్రబాబు పరిశీలించారు. బస్సు లోపల సిట్టింగ్, ఇంటీరియర్లల్లో కొద్దిపాటి మార్పులు సూచించారు. బెంజి కంపెనీకి చెందిన ఈ బస్సుకు చండీగఢ్‌లోని జేసీబీఎల్ కంపెనీలో బాడీ బిల్డింగ్ చేయించారు. బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ బస్సులో ఏర్పాటు చేశారు. మొత్తం తొమ్మిది మంది కూర్చునే డైనింగ్ కమ్ మీటింగ్ హాలు ఉంటుంది. వైఫై, ఇంటర్నెట్, కంప్యూటర్, ఫ్యాక్స్, ప్లాస్మా టీవీ, డిష్ యాంటెనా వంటి అధునాతన సాంకేతిక హంగులన్నీ బస్సులో ఉన్నాయి. ఎటువంటి రోడ్లపైనైనా ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు. బస్సుకు చుట్టూ అమర్చిన ప్రత్యేక కెమెరాల ద్వారా బయట ఏం జరుగుతోందో లోపలి టీవీ ద్వారా గమనించవచ్చు. డ్రైవర్‌కు సైతం కెమెరాల ద్వారా రోడ్డు క్లారిటీ, ట్రాఫిక్ గమనించే సౌకర్యం కూడా ఉంటుంది. రోడ్డు షోల సందర్భంలో ఉపన్యాసం స్పష్టంగా విన్పించేందుకు ప్రత్యేక స్పీకర్లు ఏర్పాటు చేశారు. విజయవాడ క్యాంపు ఆఫీసుతో పాటు రాష్ర్టంలో ఎక్కడకు వెళ్లినా బస్సులోనే సీఎం బస చేసేలా సౌకర్యాలను సమకూర్చారు. ఈ బస్సు నిర్వహణ ఏపీఎస్ ఆర్టీసీకి అప్పగించడంతో విజయవాడలోని ఆర్టీసీ గ్యారేజీలో ఉంచనున్నారు. చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ఆయన బస కోసం అక్కడికి ఈ బస్సు పంపించనున్నారు.