చెత్తకుప్పలో శిశువు మృతదేహం
వికారాబాద్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రెండు రోజుల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడేశారు. ఈ సంఘటన వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం జరిగింది. పందులు, కుక్కలు పసికందు శవాన్ని పీక్కు తింటుంటే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.