breaking news
Ernakulam-Duronto Express
-
పట్టాలపై పడ్డ తల్లి, 9 నెలల పసిపాప.. వేగంగా దూసుకొచ్చిన రైలు.. చివరికి
చెన్నై: ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాలు ఎదురవుతుంటాయి. అయితే కొందరు అప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాదం నుంచి బయట పడుతుంటారు. సరిగ్గా ఈ తరహాలోనే ఓ తల్లి, బిడ్డలు మృత్యువు అంచు వరకు వెళ్లి తప్పించుకున్నారు. ఈ ఘటనే తమిళనాడు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రైల్వే లైన్లు దాటుతుండగా యువరాణి అనే మహిళ తన 9 నెలల పసి పాపతో రైలు పట్టాలు దాటేందుకు యత్నించింది. అనుకోకుండా ఆమె కాలు జారీ పట్టలాపై పడి పోయింది. అంతలో అదే ట్రాక్‌పై ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదకరంగా దగ్గరగా రావడం ఆమె గమనించింది. దీంతో షాక్ తిన్న ఆమె కదలలేకపోయింది. అయితే ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించి యువరాణి, తన పాపతో కలిసి తెలివిగా పట్టాల మధ్యలో అలానే ఉండిపోయింది. వారిని రక్షించడానికి ట్రాక్ పై వాళ్ళు పడి ఉన్నది చూసిన రైల్వే సిబ్బంది ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ను సకాలంలో ఆపి వారిని రక్షించారు. ఈ ఘటనలో పాప క్షేమంగా బయటపడింది కానీ యువరాణి తలకు గాయాలయ్యాయి. రైల్వే అధికారులు, ప్రయాణికులు ఆమెను ట్రాక్‌పై నుంచి లేపి సురక్షిత ప్రాంతానికి తరలించారు.యువరాణి, ఆమె బిడ్డను చికిత్స నిమిత్తం వేలూరు ఆసుపత్రికి తరలించారు. చదవండి: బాలికపై అఘాయిత్యం.. 80 ఏళ్ల వృద్ధుడితోపాటు.. మరో ఐదుగురు -
పట్టాలు తప్పిన దురంతో
పనాజీ: గోవాలో ఎర్నాకుళం-దురంతో ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. పది బోగీలు పట్టాలు తప్పి స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే, ఎవరికి ఎలాంటి హానీ జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 'ఆదివారం ఉదయం 6.30గంటలకు ఎర్నాకులం-దురంతో ఎక్రప్రెస్ దక్షిణ గోవాలోని బాలీ స్టేషన్‌కు సమీపంలో పట్టాలు తప్పింది. ప్రయాణీకులకు ఎలాంటి హానీ జరగలేదు' అని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ అధికారికి ప్రతినిధి బాబన్ గాట్గే మీడియాకు తెలిపారు. ముంబయిలోని తిలక్ టర్మినల్ నుంచి ఎర్నాకుళం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కొంకణ్ రైల్వే మార్గాలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.