breaking news
engineering stream
-
'ఇంజనీరింగ్‌లో ఒకే ప్రవేశ పరీక్ష’కు మద్దతు
- అఖిల భారత సాంకేతిక విద్యాసంస్థల సమాఖ్య తీర్మానం - సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా కేవీకే రావు ఎన్నిక సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహణ, ఒకే సిలబస్‌కు మద్దతిస్తూ అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థల సమాఖ్య తీర్మానం చేసింది. సమాఖ్య రెండో కార్యవర్గ సమావేశం ఆదివారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమాఖ్య చీఫ్ ప్యాట్రన్‌గా తమిళనాడుకు చెందిన ఆర్ ఎస్.మునిరత్నం, అధ్యక్షుడిగా పంజాబ్‌కు చెందిన అనుష్ కటారియా, ప్రధాన కార్యదర్శిగా తెలుగు రాష్ట్రాల సాంకేతిక విద్యా సంస్థల సంఘానికి చెందిన కేవీకే రావు, ఉపాధ్యక్షుడిగా ఆంధ్రా అసోసియేషన్‌కు చెందిన భూపాలం ఎన్నికయ్యారు. అనంతరం సమాఖ్య పలు తీర్మానాలు చేసింది. ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా ఒకే ప్రవేశపరీక్షను, ఒకే సిలబస్‌ను త్వరగా ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరారు. ప్రధాన కార్యదర్శి కేవీకే రావు మాట్లాడుతూ.. సాంకేతిక విద్యలో విద్యార్థుల నైపుణ్యాలను పెంచే విధంగా సాంకేతిక విద్యామండలి సంస్కరణలు ప్రవేశపెట్టాలని కోరారు. -
ఎట్టకేలకు..!
ఎచ్చెర్ల క్యాంపస్ :ఎంసెట్-2014 ఇంజినీరింగ్ స్ట్రీం వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు గురువారం ప్రారంభమైంది. దీనికి శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల వేదికైంది. ఒకటి నుంచి ఐదు వేలు మధ్య ర్యాంకులు సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. తొలి రోజు జిల్లా నుంచి 33 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. గతంలో 15,000 లోపు ర్యాంకు అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఒకే రోజు చేసేవారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం రోజుకు ఐదు వేల ర్యాంకులు ప్రామాణికంగా తీసుకోవటంతో రద్దీ బాగా తగ్గింది. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన కేంద్రంలో అధికారులు అందుబాటులో ఉంటున్నారు. అయితే తొలిరోజు మధ్యాహ్నం రెండు గంటలకే ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయ్యింది. పస్తుతానికి ధ్రువీకరణపత్రా ల పరిశీలన తప్ప ఆప్షన్ ఎంట్రీలకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. గతంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, ఆప్షన్ల వెబ్ కౌన్సెలింగ్‌కు ఒకేసారి ప్రకటన విడుదల చేసేవారు. అయితే రాష్ట్రం యూనిట్ గా వెబ్ కౌన్సెలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో ఇంకా ధ్రువీకరణ పత్రాల పరిశీ లన ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఆప్షన్ల ఎంపికలో నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఈ ఏడాది కొత్త విధానాన్ని సైతం ఉన్నత విద్యాశాఖ ప్రవేశ పెట్టింది. పాలీసెట్, ఈ సెట్ పద్ధతిలో ధ్రువీకరణ పత్రాల పరిశీ లన సాగుతోంది. గతం లో ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలు సైతం తీసుకునే వారు. ప్రస్తు తం జిరాక్సు కాపీలను తీసుకొని ఒరిజనల్స్ ను పరిశీలించి అభ్యర్థులకు ఇచ్చేస్తున్నారు. గతం లో కౌన్సెలింగ్ డ్రాఫ్ అయ్యే విద్యార్థులు ధ్రువీ కరణ పత్రాల కోసం సహాయ కేంద్రం చుట్టూ తిరిగేవారు. లేదంటే ఒరి జనల్ ధ్రువీకరణ పత్రా లు కన్వీనర్ పాయింట్‌కు వెళ్లి పోయేవి. అక్కడి నుంచి విద్యార్థులు తీసుకోకపోతే సీటు ఎలాట్ అయిన కళాశాలలకు వెళ్లి పోయేవి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం కొత్త విధానం వల్ల సీటు వచ్చినప్పటికీ విద్యార్థులు కళాశాలలో చేరక పోయినా ఇబ్బంది ఉండదు. ఆదాయ ధ్రువీకరణ పత్రాల సమస్య కూడా గతంలో తలెత్తేది. ప్రస్తుతం ఆ సమస్య కూడా లేకపోవడంతో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన సజావుగా సాగుతోంది. శుక్రవారం 5001 నుంచి 10 వేల మధ్య ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించనున్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వీఎస్ దత్, అడ్మిషన్ల ఇన్చార్జి మేజర్ కె.శివకుమార్, విభాగాధిపతులు విజేయ్ కుమార్, తవిటినాయుడు, కె.శ్రీరామాచార్యులు, డి.మురళీ కృష్ణ, ఎం.ఎల్. కామేశ్వరి, బి.కృష్ణ పాల్గొన్నారు.