breaking news
engagements
-
‘ఐయామ్ సారీ.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటా..’
జోహో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు సోషల్ మీడియా నుంచి తాత్కాలికంగా కొన్ని రోజులు దూరంగా ఉంటానని ప్రకటించారు. కంపెనీ కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్న తరుణంలో కొన్ని కోడ్లను మరింత సమర్థవంతంగా సృష్టించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ఇటీవల కాలంలో ఎక్స్ వంటి సామాజిక మధ్యమాల్లో చాలా చురుకుగా ఉన్న వెంబు తాను రన్ చేయాలనుకునే కొన్ని కోడ్లను మెరుగుపరిచేందుకు కొంతకాలం ఆన్లైన్ ఎంగేజ్మెంట్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పనిలో నాణ్యత ముఖ్యమని చెప్పడం కంటే మనమే ఆ పనిని సమర్థంగా చేసి చూపించాలన్నారు. తన సోషల్ మీడియా అనుచరులకు ఇలా కఠినమైన పరిమితిని విధించవలసి వచ్చినందుకు చింతిస్తున్నానని చెప్పారు.ఇటీవల కాలంలో కంపెనీ తయారు చేసిన దేశీయ ఆన్లైన్ కమ్యునికేషన్ ప్లాట్‌ఫామ్ అరట్టై యాప్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆ యాప్‌ను ఉపయోగించాలని పలువురు మంత్రులు, వ్యవస్థాపకులు, సీఈఓలు పిలుపునిచ్చారు. దీంతో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేవారు సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ & యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది.అరట్టై అంటే.. తమిళంలో సరదాగా ముచ్చటించుకోవడం అని అర్థం. దీనిని జోహో సంస్థ.. వాట్సప్‌కు పోటీగా అభివృద్ధి చేసింది. ఇది వాట్సప్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంది. దీనికి అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి కేంద్రమంత్రులు కూడా మద్దతు ప్రకటించారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా తాను అరట్టై డౌన్లోడ్ చేసుకున్నానంటూ ట్వీట్ చేశారు.అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలుఅరట్టై.. వాట్సాప్ రెండూ మెసేజింగ్ యాప్స్ అయినప్పటికీ, అరట్టైలో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.అరట్టై ఆండ్రాయిడ్ టీవీలతో సహా విస్తృత శ్రేణి పరికరాలకు యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్‌లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యు' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్‌వర్క్‌లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా అరట్టైలో యూపీఐ చేయడానికి కూడా జోహో సిద్ధమవుతోంది. దీనికోసం ఐస్పిరిట్ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: నక్సల్స్‌పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా? -
హైదరాబాద్ సిటీ ఈవెంట్స్
నేడు ఇండక్షన్ ముగింపు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో 15 రోజుల పాటు నిర్వహించిన ఇండక్షన్ కార్యక్రమం శుక్రవారం ముగియనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ దర్శకులు శేఖర్ కమ్ముల హాజరవుతారని వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.కృష్ణయ్య గురువారం తెలిపారు. టేల్స్ ఆఫ్ ది బుల్ అండ్ ది టైగర్ నృత్య ప్రదర్శన శంకరానంద్ కళాక్షేత్ర వార్షికోత్సవాల్లో భాగంగా.. ఆగస్టు 4, సాయంత్రం 4:30 గంటలకు రవీంద్రభారతి ముఖ్య అతిథులు: ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, ప్రముఖ నృత్యకారిణి చిత్ర విశ్వేశ్వరన్ అన్ కల్టివేటెడ్ ఫుడ్ ఫెస్టివల్ ఆగస్ట్ 4–5 ఉదయం 11– మధ్యాహ్నం 3 విశేషాలు: పూర్తిగా సేంద్రీయ పద్ధతుల ద్వారా పండించిన కూరగాయలతో వంట, బఫె భోజనం, ఆకుకూరలు–కూరగాయల ఎగ్జిబిషన్, మహిళా వ్యవసాయదారులతో ముఖాముఖి, నిపుణుల సూచనలు, సంబంధిత అంశంపై రూపొందిన సినిమా ప్రదర్శన. ఎంట్రీ ఫీజు: రూ.200 (పదేళ్ల లోపు పిల్లలకు రూ.100) వేదిక: పాక ఆర్గానిక్ కెఫె అండ్ కల్చరల్ స్పేస్, నల్లగండ్ల, తెల్లాపూర్ మ్యూజిక్ బ్యాండ్ లైవ్ షో హైలెట్స్: బాలీవుడ్, హాలీవుడ్, ఇండీ పాప్ సాంగ్స్ ఆగస్ట్ 4 ,సాయంత్రం 6–8 , ది హోల్ ఇన్ ది వాల్ కెఫె, జూబ్లీహిల్స్, రోడ్ నెంబర్.45 ఎంట్రీ ఫీజు: రూ.299 ఫొటో ట్రేడ్ ఎక్స్పో ఆగస్ట్ 3–5 వేదిక: జలవిహార్, నెక్లెస్ రోడ్ ప్రత్యేకత: ఫొటోగ్రఫీ పరికరాల ప్రదర్శన, యాక్ససరీస్, సాఫ్ట్వేర్స్, వర్క్‌షాప్స్ ప్రీ ఫ్రెండ్షిప్ డే పార్టీ ఆగస్ట్ 4 మధ్యాహ్నం 12 వెర్టిగో, ది హైలైఫ్, బంజారాహిల్స్ హైలెట్స్: డీజేలు యద్, రాన్ కె, యష్, మిడాష్ డ్రెస్ కోడ్: వైట్ కలర్ ఎంట్రీ ఫీజ్: లేడీస్ సింగిల్ రూ.500, జెన్స్ సింగిల్ రూ.800, కపుల్ రూ.700, ట్రాన్స్ఫర్మేషన్ మెడిటేషన్ క్లాసెస్ ఆగస్ట్ 5, ఉదయం 8–10, వేదిక: లైఫ్ ఫౌండేషన్, శ్రీనికేతన్ కాలనీ, బంజారాహిల్స్, రోడ్ నెం.3 బైక్ అఫైర్ సెంచురీ చాలెంజ్ ఆగస్ట్ 5 ,ఉదయం 5 – మధ్యాహ్నం 12 రాడిసన్ హోటల్, గచ్చిబౌలి రైడ్ ఫీజు: రూ.530 ముస్తఫా ఫ్రెండ్షిప్ డే కార్నివాల్, ఆగస్ట్ 5 ఉదయం 11– రాత్రి 11 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ , ఎంట్రీ ఫీజు: రూ.100 కామెడీ క్రాకర్స్ నైట్ షో స్టాండప్ కామెడీ, ఆగస్ట్ 5, రాత్రి 7 కమెడియన్స్: రోహిత్ స్వైన్, సాయికిరణ్ షో వ్యవధి: 60 నిమిషాలు వేదిక: ఫినిక్స్ ఎరీనా, మాదాపూర్ 19న ‘హ్యాపీ బిజినెస్ మోడల్’ సదస్సు రాయదుర్గం: బ్రహ్మకుమారీస్ సంస్థ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ వింగ్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి శాంతిసరోవర్‌లో ఈనెల 19న ‘హ్యపీ బిజినెస్ మోడల్’ సదస్సును నిర్వహిస్తారు. మెడిటేషన్‌తో కలిగే లాభాలను వివరించేందుకు ముంబయ్‌కి చెందిన ఎక్ప్‌పర్ట్ మేనేజ్మెంట్ ట్రైనర్ ఈవి గిరీష్ ప్రత్యేక ఉపన్యాసం చేస్తారు. వివరాలకు 8087411206, 040–23001234 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. -
శుభకార్యాలు చేస్తున్నారా... బహుపరాక్!
చిన్నారుల పంపి బంగారు ఆభరణాలను మాయం చేస్తున్న ముఠా సాక్షి, ముంబై: ఫంక్షన్ హాళ్లలో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, ఇతర శుభకార్యాలు చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. సందెట్లో సడేమీయా అన్నట్లు రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ముఠా సభ్యులు శుభకార్యాలు జరుగుతున్న ఫంక్షన్ హాళ్లలోకి చొరబడి పథకం ప్రకారం చేతికందిన విలువైన వస్తువులు చోరీ చేస్తున్నారు. ఇలాంటి పనులకు చిన్నపిల్లలను వాడుకుంటుండడంతో ఎవరికీ అనుమానం కలగడం లేదు. పెళ్లి హడావుడిలో ఇరువర్గాల వారు నిమగ్నమై ఉన్న సమయంలో బంధువులు సమర్పించిన కానుకలు, వధూవరుల బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను మాయం చేస్తున్నారు. ఇందుకోసం సదరు పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు, గుర్తు తెలియని వ్యక్తులపై కన్నేసి ఉంచాలని వధూవరుల తరఫు బంధువులకు స్థానిక పోలీసులు సూచిస్తున్నారు. గత పెళ్లిళ్ల సీజన్లో ఫంక్షన్ హాళ్ల నుంచి విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు అనేక ఫిర్యాదులందాయి. దీంతో నేర నిరోధక శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. చోరీ ఘటనలు జరిగినచోట అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. అందులో ఖరీదైన దుస్తులు ధరించిన కొందరు పిల్లలు అటే ఇటూపరుగులు తీయడం కనిపించింది. ఇందులో ఓ పిల్లాడి కదలికలు అనుమానాస్పదంగా తోచాయి. పిల్లలతో కలిసిపోయి వేదికపైకి ఎక్కి ఏకంగా వధూవరులతో ఫొటోలు దిగాడు. అతడిపై ఎవరికి అనుమానం రాలేదు. ఆ తర్వాత అదను చూసుకుని బంధువులు సమర్పించిన కానుకల ప్యాకెట్లు తీసుకుని మెల్లిగా జారుకుంటున్న దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇదే తరహాలో రెండు, మూడు ఫంక్షన్ హాళ్లవద్ద పలువురు పిల్లలు చోరీ చేసినట్లు వీడియో దృశ్యాల్లో కనిపించింది. దీంతో పోలీసులు వేటలో పడ్డారు. ఇటీవల జరిగిన ఓ పెళ్లికి పోలీసులు మారువేషాల్లో హాజరయ్యారు. అక్కడ ఓ బాలుడి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. అతనిపై నిఘా వేయగా ఎప్పటిలాగే విలువైన వస్తువులు చోరీ చేసేందుకు యత్నించాడు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు అతనిని ఆరా తీశారు. తన తల్లి ఫంక్షన్ హాలు బయట ప్రవేశద్వారం వద్ద బెలూన్లు విక్రయిస్తోందని చెప్పాడు. దీంతో వెంటనే అతని తల్లిని కూడా పట్టుకున్నారు. తరువాత పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం బయటపడింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి, నేరాలకు పాల్పడుతున్నట్టు వారు అంగీకరించారు.


