breaking news
endoment ministry
-
నిరుపేదలకు అండగా ప్రభుత్వం
దిలావర్పూర్(నిర్మల్): ఆడపిల్లల వివాహానికి ఆర్థికసాయం అందిస్తూ సీఎం కేసీఆర్ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం దిలావర్పూర్, నర్సాపూర్(జి) మండలాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్డీవో ప్రసూనాంబా మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఆడపిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయా లని సూచించారు. 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని సూచించారు. అనంతరం మంత్రిని రైతులు సన్మానించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఏఎంసీ చైర్మన్ కె.దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ పాల్దె లక్ష్మి, సర్పంచ్ నంద అనిల్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, మండల కన్వీనర్ రాజేశ్వర్, నాయకులు రమణారెడ్డి, సంభాజీరావు, నర్సారెడ్డి, రేఖ, కవిత, రవి, నర్సయ్య, భూమన్న, మనేశ్, సుధాకర్‌రెడ్డి, గుణవంత్‌రావు, అనిల్, గంగారాం, భుజంగ్‌రావు, భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో దేవాదాయ శాఖకు వెబ్సైట్
గుంతకల్లు రూరల్: దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఒక వెబ్‌సైట్‌ను రూపొం దించి, ఆలయాల సమగ్ర సమాచారాన్ని అందులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. కర్ణాటకలోని సింధనూరులో జరిగిన బీజేపీ సమావేశాలకు హాజరైన ఆయన తిరిగి విజయవాడకు వెళ్తూ మంగళవారం సాయంత్రం గుంతకల్లులోని రైల్వే కోజీ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆలయాల నిర్వహణ, ఆదాయ, వ్యయాలు, ఉద్యోగుల పనితీరు, సీసీ కెమెరాల నిఘా విభాగం, తదితర వివరాలతో కూడిన సమగ్ర సమాచారం నిరంతరం అందుబాటులో ఉండేవిధంగా త్వరలో ఒక వైబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఆలయాల్లో భక్తుల సంఖ్య ఆధారంగా ఏసీ క్యాడర్లో ఉన్న ఆలయాలను డీసీ క్యాడర్‌లోకి, అదేవిధంగా డీసీ క్యాడర్లో ఉన్న ఆలయాలను ఆర్జేసీ క్యాడర్‌లోకి మారుస్తామని చెప్పారు. కసాపురం దేవస్థానానికి త్వరలోనే టూరిజం ప్యాకేజీ ప్రకటిస్తామని తెలిపారు.