breaking news
emage
-
తాతకు నివాళిగా పోస్ట్...హత్యకు దారి తీసిన ‘లాఫింగ్’ ఇమేజ్
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఫేస్బుక్ పోస్ట్ ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో 20 ఏళ్ల యువకుడు కత్తిపోట్లకు గురై మరణించాడు. బాధితుడిని బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌మీడియాలో పాటించాల్సిన కనీస మర్యాద, సభ్యత, సంస్కారాలకు నిదర్శనం ఈ ఘటన.20 ఏళ్ల ప్రిన్స్ కుమార్ బీహార్‌కు చెందినవాడు. మరో ముగ్గురు బంధువులతో కలిసి గుజరాత్‌లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. నాలుగు నెలల క్రితం కాలం చేసిన తన తాత రూప్నారాయణ్ భింద్ను గుర్తుచేసుకుంటూ ఫేస్బుక్లో ఒక కథనాన్ని అప్లోడ్ చేశాడు ప్రిన్స్. అయితే బీహార్‌కు చెందిన ప్రిన్స్ పరిచయస్తుడు బిపిన్ కుమార్ రాజిందర్ గోండ్ అనుచితంగా రియాక్టయ్యాడు. ప్రిన్స్ పోస్ట్‌కు నవ్వుతున్న ఎమోజీతో పోస్ట్ చేశాడు. ఇదే ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది.మొల్లగా ఫోన్లోమొదలైనఘర్షణ ముదిరి భౌతిక దాడికి దారి తీసింది.ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) ప్రకారం, సెప్టెంబర్ 12 రాత్రి, 12:30 గంటల ప్రాంతంలో, ప్రిన్స్ తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీ వెలుపల ఆటో రిక్షాలో కూర్చుని బిపిన్ దాడిచేశాడు. దీంతో ప్రిన్స్ ఫ్యాక్టరీ లోపలికి తిరిగి వెళ్లిపోయాడు. కానీ మరో నిందితుడు బ్రిజేష్ గోండ్ అడ్డుకున్నాడు. చంపేస్తానని బెదిరించాడు. ఇంతలో, బిపిన్ ప్రిన్స్‌ను కత్తితో పొడిచాడు. ప్రిన్స్ అరుపులు విన్న అతని సహచరులు వెంటనే అతనికి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఆపై రాజ్‌కోట్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాలుగు రోజులకు పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)కి తరలించారు. గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో సెప్టెంబర్ 22నకన్నుమూశాడు. చనిపోవడానికి ముందు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.చదవండి: మిలన్ ఫ్యాషన్‌వీక్ : రొటీన్‌గా కాకుండా బోల్డ్ లుక్‌లో మెరిసిన ఆలియాప్రిన్స్ వీపుపై అంగుళంన్నర, రెండు అంగుళాల లోతు గాయం ఉందని పోలీసులు తెలిపారు. బాధితుడి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన గుజరాత్ పోలీసులు కీలక నిందితుడిని అరెస్టు చేశారు, మరొకరు పరారీలో ఉన్నారు. -
'చిరంజీవి ఇమేజ్ అంతగా దిగజారిపోయిందా?'
శ్రీకాకుళం : ఆయనను చూడటానికి ఒప్పుడు జనం క్యూ కట్టేవారు. ఆయన వస్తున్నాడంటే ఎండనకా వాననకా గంటలకొద్ది వేచి చూసేవారు. ఆయన్ని చూస్తే అభిమానులు ఉప్పొంగిపోయేవారు. కానీ ఆయన రాజకీయ రంగప్రవేశం చేశాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన వస్తున్నారన్నా జనం పట్టించుకోవడం లేదు. కనీసం ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడడం లేదు. ఒకప్పుడు వేలల్లో వచ్చిన వారు ఇప్పుడు కనీసం వందల్లో కూడా రావటం లేదు. ఆయన ఇమేజ్ అంతగా దిగజారిపోయింది మరి. ఆయన ఇంకెవరో కాదు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మెగాస్టార్, ప్రస్తుతం కేంద్రమంత్రి చిరంజీవి, ఆయన శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా పర్యటిస్తున్నా పెద్దగా జనం పట్టించుకోవడం లేదు. చిరంజీవి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, ఇచ్చాపురం, పలాస, తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పర్యటించారు. ఎక్కడా ఆశించిన స్థాయిలో ప్రజలు హాజరు కాలేదు. ఆయన పర్యటనలో ఎక్కడా ఎక్కువసేపు ప్రసంగించకపోవడంతో హాజరైన అతి కొద్దిమంది కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రసంగించిన తీరు కూడా ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.


