breaking news
Duty handling
-
Supreme Court of India: జనం ఏమైపోయినా పట్టించుకోరా?
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని తేలి్చచెప్పింది. విధులను పక్కనపెట్టి నిరసనలు కొనసాగించడం సరైంది కాదని అభిప్రాయపడింది. సాధారణ ప్రజల అవసరాలను పట్టించుకోకుండా డాక్టర్లు ఇలా విధులకు గైర్హాజరు కావడం ఏమిటని ప్రశ్నించింది. జనం ఏమైపోయినా పట్టించుకోరా? అని నిలదీసింది. విధుల్లో చేరితే ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఉండబోవని వెల్లడించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మీ భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటారు, వెంటనే వెళ్లి డ్యూటీలో చేరండి అని డాక్టర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ విధులకు దూరంగా ఉంటూ నిరసనలు కొనసాగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినప్పుడు సంబంధిత డాక్టర్లకు ఇచ్చిన చలాన్ కనిపించకపోవడం పట్ల న్యాయస్థానం అనుమానం వ్యక్తంచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని సీబీఐని, పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చలాన్ మాయం కావడంపై దర్యాప్తు జరపాలని సీబీఐకి సూచించింది. జూనియర్ డాక్టర్‌పై అఘాయిత్యం కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. శవపరీక్ష కోసం ఉపయోగించిన చలాన్ తమ రికార్డుల్లో లేదని చెప్పారు. అయితే, అది ఎక్కడుందో తేల్చాలని ధర్మాసనం పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదులో 14 గంటలు ఆలస్యం కావడం పట్ల మరోసారి అసహనం వ్యక్తం చేసింది. బాధితురాలి ఫోటోలు, వీడియోలను అన్ని రకాల సోషల్ మీడియా వేదికల నుంచి తక్షణమే తొలగించాలని పేర్కొంది.విరమించబోం: జూనియర్ డాక్టర్లు కోల్‌కతా: ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ నెలరోజులుగా విధులను బహిష్కరిస్తున్న పశి్చమబెంగాల్ జూనియర్ డాక్టర్లు సమ్మె కొనసాగిస్తామని సోమవారం రాత్రి ప్రకటించారు. విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ తాము సమ్మె విరమించబోమని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. సీఐఎస్ఎఫ్కి వసతులు కలి్పంచండి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీల్డ్ కవర్లో సమరి్పంచిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై ఈ నెల 17వ తేదీలోగా తాజా నివేదిక సమరి్పంచాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. ఆర్జీ కర్ ఆసుపత్రిలో భద్రతా విధుల్లో చేరిన మూడు కంపెనీల సీఐఎస్ఎఫ్ సిబ్బందికి తగిన వసతి సౌకర్యాలు కల్పించాలని పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారికి అవసరమైన పరికరాలు ఇవ్వాలని పేర్కొంది.ఫోరెన్సిక్ నివేదికపై అనుమానాలు డాక్టర్ ఫోరెన్సిక్ నివేదికపై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. తదుపరి పరీక్షల కోసం బాధితురాలి నమూనాలను ఢిల్లీ–ఎయిమ్స్‌కు పంపించాలని నిర్ణయించినట్లు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. డాక్టర్ కేవలం హత్యకు గురైనట్లు నివేదిక తేలి్చందని చెప్పారు. కానీ, ఆమెను లైంగికంగా చిత్రహింసలకు గురిచేసి, అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు. -
కానిస్టేబుల్ అనిల్‌కు కన్నీటి వీడ్కోలు
- పిడుగు పడి మృతిచెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ - ఏలూరులో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు ఏలూరు(టూటౌన్), న్యూస్‌లైన్ : విధి నిర్వహణలో మరణించిన కానిస్టేబుల్ అనిల్‌కు పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఏలూరు గ్జేవియర్ నగర్ ప్రాంతానికి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ కారే అనిల్(32) హైదరాబాద్‌లో గ్రేహౌండ్స్ విభాగంలో పనిచే స్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా బుధవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా అమన్జల్ ప్రాంతంలో డెమో ఇవ్వడానికి అనిల్‌తో పాటు పలువురు కానిస్టేబుళ్లు వెళ్లారు. అక్కడ భారీగా వర్షం కురుసున్న సమయంలో ఖమ్మంకు చెందిన కానిస్టేబుల్ సుధాకర్, అనిల్ ఫోన్లో మాట్లాడుతుండగా వైబ్రేషన్స్‌కు వారిద్దరిపై ఒక్కసారిగా పిడుగు పడింది. ఘటనలో అనిల్ అక్కడికక్కడే మృతిచెందగా, సుధాకర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం అనిల్ మృతదే హం గురువారం ఉదయం ఏలూరు చేరింది. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు విశాఖ్, మణి, భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 2007లో కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన రత్నకుమారితో అనిల్‌కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు సంతానం. డెప్యూటేషన్‌పై హైదరాబాద్‌లో విధులు 2003 ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కాకినాడకు చెందిన అనిల్ కొంతకాలంగా డెప్యూటేషన్‌పై హైదరాబాద్ గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్నాడు. పట్టుదలతో పోలీసు ఉద్యోగం సాధించాడని, గత ఏడాది క్రిస్మస్కు ఏలూరు వచ్చిన కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నాడని స్నేహితులు తెలిపారు. 15 రోజుల క్రితం విశాఖపట్నం బందోబస్తుకు వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళ్తూ ఏలూరులో 10 నిమిషాలు తమ మాట్లాడి వెళ్లిపోయూడని, అవే చివరి చూపులను కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహానికి ఏలూరు డీఎస్పీ ఎం.సత్తిబాబు, త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావు నివాళుల్పరించారు. బాధిత కుటుంబానికి జిల్లా పోలీసుల సంఘం అధ్యక్షుడు కె.నాగరాజు ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు.