breaking news
discussion is completed
-
వైద్యుల సమ్మె సమాప్తం
కోల్‌కతా: బెంగాల్లో గత ఏడు రోజులుగా వైద్యులు చేస్తున్న సమ్మెకు తెరపడింది. కోల్‌కతాలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 31 మంది వైద్యుల బృందం మధ్య చర్చలు సఫలం అయ్యాయి. దీంతో తమ ఆందోళనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆసుపత్రుల్లో నోడల్ అధికారిని నియమించడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా తామంతా విధుల్లో చేరుతామని పేర్కొన్నారు. కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ వైద్యకళాశాలలో గత సోమవారం ఇద్దరు డాక్టర్లపై ఓ రోగి బంధువులు దాడిచేయడంతో బెంగాల్‌లోని వైద్యులంతా ఆందోళనకు దిగారు. సమావేశంపై ‘హైడ్రామా’.. సీఎం మమత, వైద్యుల మధ్య భేటీ విషయమై హైడ్రామా నడిచింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా లేకుండానే వైద్యులతో సమావేశం కావాలని మమత నిర్ణయించారు. అయితే ఇందుకు వైద్యులు, జూనియర్ డాక్టర్ల గవర్నింగ్ బాడీ నిరాకరించింది. మీడియా ఉంటే తప్ప చర్చలకు రాబోమని, ప్రభుత్వం చెబుతున్న వీడియో రికార్డింగ్ తమకు సమ్మతం కాదని తేల్చిచెప్పింది. దీంతో ఈ భేటీ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే వెనక్కి తగ్గిన మమతా బెనర్జీ సర్కారు రెండు ప్రాంతీయ వార్తాచానళ్లను అనుమతించింది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సమావేశం ఐదున్నర గంటలకు ముగిసింది. ఈ సమావేశంలో ఆసుపత్రుల్లో భద్రత, మౌలిక వసతులు సహా వైద్యులు లేవనెత్తిన అనేక సమస్యలను మమత సావధానంగా విన్నారు. ఆగిపోయిన వైద్య సేవలు బెంగాల్లో వైద్యులపై దాడికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సోమవారం సమ్మెకు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా వైద్యసేవలు స్తంభించిపోయాయి. దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో వైద్యులు నలుపురంగు బ్యాడ్జీలు ధరించి, మానవహారాలుగా ఏర్పడి నిరసన తెలియజేశారు. డాక్టర్లపై దాడులను అరికట్టేందుకు సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని 40,000 మందికిపైగా వైద్యులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. గోవాలో డాక్టర్లు మౌన ప్రదర్శన నిర్వహించారు. తమిళనాడులో నల్లటి బ్యాడ్జీలు, హెల్మెట్లు ధరించిన వైద్యులు మానవహారాలుగా ఏర్పడి నిరసనను తెలియజేశారు. అలాగే అస్సాం, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళలో వైద్యులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ వైద్యుల సమ్మె గురించి తెలియని ప్రజలు ఆసుపత్రుల వద్ద తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆసుపత్రికో నోడల్ అధికారి ఈ సందర్భంగా ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల భద్రత కోసం ఓ నోడల్ అధికారిని నియమించాలని సీఎం మమత పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. డాక్టర్లపై దాడులు జరిగితే సత్వరం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత పోలీస్ అధికారులపైనే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేసే నోడల్ అధికారులను ఎంపిక చేయాలన్నారు. వీరు స్థానిక పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకెళతారని మమత తెలిపారు. ఆసుపత్రిలో అందరికీ కనిపించేలా ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల వైద్యులపై దాడి చేయకుండా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయాలని అభిప్రాయపడ్డారు. -
వ్యవసాయమంత్రి సమాధానం లేకుండానే..
మండలిలో రైతుల సమస్యలపై ముగిసిన చర్చ 27న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఉందంటూ వాయిదా వేసిన చైర్మన్ సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో రైతుల సమస్యలపై స్వల్పకాలిక చర్చ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం లేకుండానే ముగిసింది. గురువారం కౌన్సిల్లో గిట్టుబాటు ధరలు, విద్యుత్ పరిస్థితి, రైతుల ఇతర సమస్యలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీ లు తమ అభిప్రాయాలను తెలియజేశాక చైర్మన్ స్థానంలో ఉన్న నేతి విద్యాసాగర్ సభను 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సభ్యులు లేవనెత్తిన అంశాలతో పాటు ఇతరత్రా సమాచారంతో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానమిచ్చేందుకు సంసిద్ధం కాగా, సభ వాయిదాతో ఆయన మిన్నకుండిపోయారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని, ఇప్పటికి 775 మంది రైతులు ఆత్మహత్యల చోటుచేసుకున్నట్లు రైతు స్పందన వేదిక ప్రకటించిందన్నారు. బాధిత కుటుంబాలకు ఇచ్చే సహాయాన్ని రూ. లక్షన్నర నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కరెంటు చార్జీల ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా వ్యవసాయ సంక్షోభం తప్పడం లేదన్నారు. రైతురాజ్యం, బంగారు తెలంగాణ అంటూ ప్రభుత్వం ఏవేవో మాట్లాడుతోందని, విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయాలని కోరారు. వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుని కొందరికి చెప్పే అలవాటు ఉంటుందని, చేసే అలవాటు ఉండదని, కానీ తాము అన్నీ అమలుచేసి చూపిస్తామన్నారు. తమకు విజన్డాక్యుమెంట్ అవసరం లేదని అన్నారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం విత్తన భాండాగారం, భూసార పరీక్ష కార్డులు ఇలా రైతులకు ఉపయోగకరమైన అనేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ రైతులను చైతన్యవంతులను చేసి వారు ఆత్మహత్యల బారినపడకుండా చూడాలని సూచించారు.